Others

అనుబంధానికి చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకను తెలియజేసే విశిష్టమైన పండుగయే రక్షాబంధనం. ఈ రక్షను పూర్వం బంగారు, వెండి, పట్టుదారాలను తీసుకొని మంత్ర పూరితంగా నిర్దేశకమైన ముడులు వేసేవారు. ఇలా కట్టిన దారాన్ని పూర్ణకుంభంలో ఉంచి, పూజించేవారు. ఆపై మనసున సోదరునికి జయం కలగాలని, అప మృత్యుదోషాలు ఏవైనా ఉంటే అవి దూరం కావాలని కోరుతూ సోదరునికి రక్షాబంధనం కట్టేవారు. రాను రాను కాలవైప రీత్యాలవల్ల రాఖీ కూడా రూపు మారి వివిధ ఆకృతులతో తయారు అవుతోంది. కాని సోదరి మాత్రం అదే భావనతో కొత్త రక్షా బంధనాన్ని సోదరునికి కడుతోంది. ఈ రక్షాబంధనం గురించి పురా ణాలు వివిధ కథలను చెబుతున్నాయ. ఓసారి రాక్షసరాజైన బలి చక్రవర్తి ఇచ్చిన వరం వల్ల మహా విష్ణువుబలి రాజ్యాన్ని కావలి కాయ డానికని వెళ్లి అక్కడే అంటే పాతాళం లోనే ఉండిపోయాడు. అపుడు మహా విష్ణువు లేని వైకుంఠంలో శ్రీమహాలక్ష్మి ఉండలేక పోయంది. ఇట్లాకాదని బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి లక్ష్మీదేవిస్వయంగా వెళ్లింది. తన్ను సోదరిగా భావించమని కోరి బలికి రక్షరేకును కట్టిందట. దానికి మహదానంద పడిన బలి మహాలక్ష్మీ దేవిని సంతోషింప చేయడానికని ఆ బలి చక్రవర్తి విష్ణువును లక్ష్మీదేవితో వైకుంఠానికి పంపాడని ఓ పురాణం చెబుతుంది. మరో పురాణం ప్రకారం మహా బలవంతుడైన వృతాసురునితో సం గ్రామం జరిపేటపుడు ఇంద్రుడు అలసిపోవడం చూసి ఇంద్రుని భార్య అయన శచీదేవి తన భర్తకు విజయం లభించాలని మహావిష్ణువు ను పూజించి తన భర్త కుడిచేతి మణికట్టుకు రక్షను కట్టిందట. దాని వలనే వృతాసుర సంహారంచేసి ఇంద్రుడు విజయం సాధించాడట. దీన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుతారు. అశ్వముఖంతో, మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్ల ని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడు హయ గ్రీవావతారుడుగా అవతరించిన రోజు శ్రావణ పూర్ణిమ. సర్వవిద్యలకు మూలా ధారమైన హయగ్రీవునికి నమస్కరిస్తే సర్వవిద్యలూ కరతలా మలకం అవుతా య. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. హయ గ్రీవోపాసన చేసిన వారికి సకలవిద్యలూ కరతలామలకం అవుతాయ. ద్వాపర యుగంలో ఓసారి శ్రీకృష్ణుని చేతికి గాయం కాగా ద్రౌపది తన చీరకొంగును కొద్దిగా చించి కట్టిన ఫలితంగా కౌరవులు ద్రౌపదికిని నిండు సభలో వస్త్రాపహరణం చేయు సమయం లో శ్రీకృష్ణుడు చీరలిచ్చి కాపాడాడని జనశుత్రి కూడా ఉంది. ఇలా పలు విధాల పర్వాలకు నెలవైన ఈ రక్షా బంధన పర్వంలోని అంతరార్థాన్ని తెలుసు కొని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయ.

- చివుకుల రామమోహన్