విశాఖపట్నం

పిక సందేశం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్రానికి ముందు
ఫాల్గుణంలోనే
వేకువ జామున
పరగడుపునే
కోయిన కూజిత ఫలహారం
కులాలపై కలాలతో
పోరాటం చేయమంటున్న
ఏకవాక్య గీతాలాపన
కోయిల కుహుకుహులోను
సామాజిక స్పృహే
- మాధవీ సనారా,
కామాక్షి కోవెల వీధి,
నిదానం దొడ్డి,
అనకాపల్లి-531002.

తల్లి కడుపు నుండి
నేలపై పడగానే
నీ మీదే నడుస్తాం
నిలువెత్తు ఎదుగుతాం
నీ గాలే పీలుస్తాం
నీ నీరే తాగుతాం
నీ పైరు పంటలు తిని
మేము జీవిస్తాం
అడవులను నరికేసి
ఎడారులు చేస్తున్నాం
విషవాయువు లెన్నో వదిలి
ఓజోన్ పొరను చీల్చి
గనులనెన్నో తవ్వేసి
భూసారము పీల్చేసి
బంగారు మట్టిని
జీవరహితంగా చేస్తున్నాం
ప్రకృతి సమతౌల్యతకు
పాతరేస్తున్నాం
మాతా నిను రక్షించే
ప్రయత్నం ఇక చేస్తాం
- ఆండ్ర కవి మూర్తి, అనకాపల్లి. సెల్: 924 6666585

విద్యతోనే సర్వస్వం
విద్య ఒసగు వినయం
విద్య ఇచ్చు విజ్ఞానం
విద్య ఖర్చు కాని ధనం
విద్యయే సౌందర్యం
విద్య యశస్సుకు మూలం
విద్య బోగభాగ్యాలకు నిలయం
విద్య పరమ దైవం
విద్యతోనే లభించు సమస్తం
విద్య లేని వాడు వింత పశువు
విద్యను గౌరవించాలి
విద్యను ప్రేమించాలి
విద్య వెలకట్టలేని నిధి
విద్య నేర్చిన వాడు ఎల్లలు దాటి రాణిస్తాడు
విద్యా కుసుమం ఎక్కడైనా గుబాళిస్తుంది
విద్య నేర్చినవాడు ఆదర్శవంతుడవుతాడు
- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ. సెల్ : 7680812592.

సాక్షి
ఎవరు నువ్వు? ఏమిటా నవ్వు?
ఏమిటలా చూస్తున్నావు?
ఎక్కడికి ఆగకుండా పోతున్నావు
ఆ కుత్తికపై గాట్లేమిటి?
ఆ నెత్తుటి ధారలేమిటి?
దండలో దారమొక్కటే మిగిలిందేమిటి
పువ్వుల్ని, నవ్వుల్ని రాల్పేసుకున్నావేమిటి
వాపు చూసి బలుపని పొంగిన దానివి,
రూపు మారి చూపు తగ్గిన దానివి
కాపు కాచే కంచే
చేను మేస్తుందని తెలియక
దాపుకొచ్చే వాళ్లకు ప్రాపునిచ్చేసావు
ఏపు మీదున్న పరువాల యవ్వనవతులను
ఓ చూపు చూడాలనుకున్న కోడెగాండ్రు
నీ నీడలో భుజాల బూజులు
దులుపేసుకున్నారు
నిజాల గొంతుక నులిమేసారు
వీళ్ల పాపం నీకు శాపమై తగిలిందా?
ఎందుకింకా నోరు విప్పవు?
జరిగిన దానికి సాక్ష్యం చెప్పవు
తప్పు చూసి తప్పించుకు పోతున్నావెందుకు
కాలానికి గాలం వేయగల ధీరులు లేరన్నా
గతమెంత గాజుకళ్లతో మెరిసినా
గుడ్డిదే అంటుంది లోకం
చూసింది చెప్పకపోతే
చెడ్డే మిగులుతుంది పాపం
- బండారు చిన్న రామారావు,
సెల్ : 9553330545.