డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా వంక తెల్లబోయినట్లే చూశాడు అన్నయ్య.
కళ్యాణి!
‘‘అవును అన్నయ్యా’’
‘‘ప్లీడరుగారేం చెప్పారో విన్నావు కదా!’’ అడిగాడు అన్నయ్య.
‘‘విన్నాను, తాత్సర్యం చేయడంతోప్రయోజనం ఏముంది? మనస్తాపం,, పొడిగించడం తప్ప. బెదిరింపులతో బంధాలు నిలపలేరు అన్నయ్యా. బంధం నిలుపుకోవాలన్న బాధ్యత లేనప్పుడు, బెదిరింపులతో బంధం నిలిచినప్పుడు దానికి విలువలేదు’’ అన్నాను.
‘‘కాని కళ్యాణి! నీకు, చంద్రకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆస్తులు, ఐశ్వర్యాలు పోగొట్టుకోవడం తెలివితక్కువ తనం.
‘‘న్యాయబద్ధంగా నాకు చెందాల్సింది నా భర్త ప్రేమ, రక్షణ. అది దక్కనపుడు అతని తాలూకు ఆస్తి మాత్రం ఎందుకు?
‘‘నీకు అక్కరలేకపోవచ్చు. కాని చంద్రను గురించి ఆలోచించాలి కదా!’’
‘‘నా సంపాదనతో వాడిని పెంచలేనా?’’ అడిగాను.
‘‘అది కాదు నేను అనేది వాడు ఆ యింటి వారసుడిగా హక్కులు ఎందుకు వదులుకోవాలి’’.
‘‘వాడికి అధికారం, హక్కులు తండ్రి ద్వారా సంక్రమించాలి. తండ్రి ఇవ్వలేనప్పుడు ప్రాకులాడడం అనవసరం’.
‘‘కళ్యాణీ! నీకు కోపంగా వుంది. అందుకే నువ్వు ఆలోచించలేకుండా ఉన్నావు. కొద్దిరోజులు గడవని. కాస్త ప్రశాంతంగా ఆలోచించు’’ అన్నాడు అన్నయ్య.
‘‘ఆలోచించడానికి ఏం లేదన్నయ్యా. ఇవాళ ఆస్తి అడిగి, వాళ్ళ జోక్యం వౌళి జీవితంలోకి శాశ్వతంగా ఆహ్వానించడమే. మైనర్‌కి ఆస్తి రాసిచ్చి ఎవ్వరూ ఊరుకోరు. దాన్ని జాగ్రత్త చెయ్యాలనే చూస్తారు. నాకు అది ఎంతమాత్రం ఇష్టంలేదు. వాడు మీ అందరి దగ్గర నార్మల్‌గా పెరుగుతున్నాడు. దానికి నేనెటువంటి భంగం రానివ్వను’’.
నా కంఠంలో స్థిరత్వం చూసి అన్నయ్య ఆశ్చర్యపోయాడు. నాన్న నా ముందుచూపు చూసి ‘‘నేనింతగా ఎప్పుడు ఎదిగిపోయానా?’’ అని తెల్లబోతున్నారు.
చిన్న అన్నయ్య మాత్రం మాట్లాడకుండా వుండలేకపోయాడు. వార్త వినంగానే రెక్కలు కట్టుకొని వచ్చాడు.
‘‘కళ్యాణి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు వౌళికి కావాల్సింది కచ్చితంగా అడుగు. ఒకసారి వచ్చాక వాళ్ళెవరూ నిన్ను బాదర్ చేయకుండా మేం చూసుకుంటాం. అంతేకానీ వౌళికి రావాల్సింది వద్దనకు’’ అన్నాడు.
‘‘నేను వద్దని అనడంలేదు. అడగనంటున్నాను. రేపు వౌళి పెద్దవాడై వాడి హక్కులకు పోరాడదల్చుకుంటే అది వాడిష్టం. నేను మాత్రం ఇప్పుడు దానికోసం చెయ్యి చాచను’’.
‘‘కళ్యాణి నువ్వు జీవితాంతం ఉద్యోగం చెయ్యక్కరలేదు. కాలిమీద కాలేసుకుని కూర్చోవచ్చు. వాడికి వచ్చే ఆస్తిపాస్తుల మీద రుూ ఉద్యోగం ఎంత చెప్పు. నీ జీతంతో వాడికి ఏ విధంగా న్యాయం చేయగలవు?’’
‘‘ఏం అన్నయ్యా! నువ్వు లెక్చరర్‌వే కదా! నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడంలేదా! నాన్న మీకెవరికి ఆస్తులు ఇవ్వలేదని, మీరు ఏమైనా తక్కువగా బతుకుతున్నారా!’’
ఆ రోజు నా ధోరణి చూసి ఎవరూ మాట్లాడటానికి ముందుకు రావడానికి వెనుకాడరు. వీళ్ళకి ఎలా అర్థవౌతుంది నా ఆత్మాభిమానానికి తగిలే దెబ్బ!
యివాళ రఘు వచ్చి నన్ను అమెరికా రమ్మంటే నేను వెళ్ళాలి అంటే అది వౌళి కోసం వెళ్లి ఉండేదానే్నమో! నా కోసం మాత్రం కాదు. ఎంత డబ్బున్నా, ఎంత మేధావి అయినా భార్యకు ఇవ్వవలసిన స్థానం ఇవ్వలేకపోయాడంటే అది భార్యాభర్తల సంబంధం కాదు. భార్యను శాసించగలననుకునే భర్త కేవలం ఒక బాస్, భర్త కాదు.
ఒకసారి వౌళి పుట్టే ముందు జరిగిన సంభాషణ కళ్ళముందు తిరిగాయి. మనసు జుగుప్సతో నిండిపోయింది. అక్కడ నుంచి లేచిపోయాను.
చిన్నన్నయ్య ‘దీనికి ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు’’ అన్నాడు.
అన్నయ్య వౌనంగా కాగితాలను బీరువాలో పెట్టి తలుపేశాడు.
నాన్న మాత్రం ‘‘దానిమీద ఎవ్వరూ వత్తిడి తేకండి, దాని బతుకు అది బతుకుతుంది’’ అన్నారు.
15రోజుల తరువాత అన్నయ్య నన్ను కృష్ణా బ్యారేజీ వైపు తీసుకువెళ్ళాడు. ఇద్దరం బ్యారేజి మీద నుంచుని క్రింద ప్రవహిస్తున్న నదిని చూస్తూ వుండిపోయాం. ‘‘మరోసారి ఆలోచించుకో’’ అన్నాడు.
‘‘ఆలోచించాల్సింది ఏమీ లేదన్నయ్యా’’
‘‘చంద్రకి అన్యాయం చేస్తున్నావేమో. వాడు చిన్నవాడు, వాడికీ గొడవలు అర్థంకావు’’ అన్నాడు.
‘‘అవునన్నయ్యా! వాడికి అర్థం కావు. అందుకే రుూ బురదలోకి వాడిని లాగడం నాకిష్టంలేదు. కనీసం, రఘు కుటుంబం వౌళికి ఇవ్వవలసిన ప్రేమాభిమానాలు చూపించి వుంటే నేను దేనికైనా ముందుకు వచ్చేదానే్నమో! అటువంటిదేమీ జరగలేదు. పైగా, ఇప్పుడు డబ్బుతో వాళ్ళు వాడి జీవితాన్ని శాసించడం మొదలుపెట్టడం నాకు ఇష్టంలేదు.
‘‘అలా ఎందుకు జరుగుతుందనుకుంటున్నావు. వాళ్ళు ఇకముందు కూడా పూర్వంలాగానే వుంటారేమో’’.
తల అడ్డంగా ఊగించాను. ‘‘డబ్బు వున్నవాళ్ళు, డబ్బుకున్న విలువ, వాళ్ళకంటే ఎవరికీ తెలియదనుకుంటారు. వాళ్ళకంటే ఎవరూ డబ్బును పెంచి పోషించలేదనుకుంటారు’’.
‘‘పోయిన యిన్ని ఏళ్ళల్లో వాళ్ళు దేనికీ ముందుకు రాలేదు. నేను ఎవ్వరినీ, దేనికీ యాచించను’’ అన్నాను కోపంగా.
రఘుమీది కోపం అన్నయ్యమీదకు మళ్లింది. అందుకే అన్నయ్య మీద అంత కోపం వస్తోంది.
మళ్లీ అన్నాను అన్నయ్యతో సమాధానం చెప్తున్నట్లుగా.
‘‘అన్యాయం వాళ్ళ నాన్న చేశాడు. నేను కాదు. కాని, ఎవరూ అతన్ని అడిగే వాళ్ళు లేరు. నేను మాత్రం ఎదురుగా ఉన్నాను.. అందరూ అడగటానికి. పోయిన రెండు వారాలుగా చాలా కోపంగా వుంది రఘుమీద. అతను చేసే పనులకు దోషిగా నిలబడేది నేను. సంజాయిషీ ఇవ్వాల్సింది, నిర్ణయాలు తీసుకోవాల్సింది, సమాధానం చెప్పాల్సింది నేను. నా మనసు నా స్వాధీనం తప్పుతుందేమోననిపిస్తోంది. అందుకే ఇంక ఈ ప్రహసనానికి ముగింపు చెప్పాలి అనుకున్నాను.
నాలో సంఘర్షణ అన్నయ్యకి అర్థం అవుతోంది. అందుకే వౌనంగా వుండిపోయాడు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి