డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా, నా ఎకనామిక్స్ కోర్సులో ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను. కాలానికి వుండే విలువ. గడిచే ప్రతి క్షణం చేయిజారిన గాజుముక్క. చేయి జారిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకుపోలేము. కోల్పోయిన సమయానికి విలువ కట్టలేం.
నాన్న మరో ప్లీడరు గారిని కూడా కలిశారు. రుూ విడాకులు జరగకుండా ఏమైనా చెయ్యగలరేమో అని కాలయాపన జరిగితే పరిస్థితులు చక్కబడతాయేమోనని. కాని వాళ్ళకు అర్థం కానిది నా మనఃస్థితి. అది ఎలా వుందో ఎవరికి తెలియదు. ఎంత గాయపడిందో తెలియదు.
రఘు యిలాంటిది అడుగుతాడేమోనని నాకు పోయిన కొంతకాలంగా మనసులో మెదులుతూనే వుంది. అందుకని ఆ కాగితాలు నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కాని కనీసం ఒక ఉత్తరం, ఒక ఫోన్, ఎటువంటివి లేకుండా, సరాసరి కాగితాలు పంపాడు. అంటే మా ఇద్దరిమధ్య వున్నది కేవలం చట్టబద్ధమైన బంధం. రుూ బంధంలో ముడివేసుకున్న రుూ కొసకు విలువలేదు. విడదీయడమే ముఖ్యం. ప్రపంచ ఖ్యాతి గడించిన మేధావి. ఏ పని చట్టబద్ధంగా తప్పుచేయలేడు. చట్టానికి మనసు లేదు. చట్టవిరుద్ధంగా జరగకుండా చూడాల్సిన కర్తవ్యం ఒక్కటే బాధ్యత లేదు. ఏనాడో ఆ డాక్టర్‌గారు చెప్పిందిగా. బాధ్యతకు తప్పొప్పులుంటాయి. కర్తవ్యానికి వుండవు. రఘుకు బాధ్యతలేదు.
అందుకే ఆ రోజున నా మనసఃస్థితిని గమనించలేదు. ఈ రోజు నేనో వ్యక్తినన్న విషయం విస్మరించాడు.
నాన్నకు ఆ ప్లీడరుగారు సలహా ఇచ్చారు. నాన్న అంటే అందరికీ గౌరవమే!
‘‘ఎదురుగా వున్న వ్యక్తితో పోరాడాలని ఓ రాయి విసిరితే తగిలే అవకాశం వుంది. ఆకాశంలో వున్న వ్యక్తిపైరాయి రువ్వితే తిరిగి అది మనమీదే పడుతుంది.
‘‘ఆ అమెరికాలో కూచున్నవాడితో మీరేం చేయగలరు చెప్పండి. అతను తిరిగి వస్తే కదా! ఏం చేయడానికైనా’’ అన్నాడు.
రఘు తరఫు లాయరు వచ్చాడు. నాన్న కాగితాలు ఇచ్చేశాడు. ఆయన తెల్లబోయాడు.
ఎటువంటి ఘర్షణ లేకుండా, ఎటువంటి రాయబారాలు, సంప్రదింపులు లేకుండా, ఆస్తుల గురించి, మనోవర్తిని గురించి ఏ విధమైన ఒప్పందాలు కోరకుండా కాగితాలు అందించడం బహుశ ఆయన వృత్తిలోనే ప్రథమం ఏమో!
ఆయన ఏదో అనబోయాడు. నాన్న రెండు జోడించి ‘‘మీరు ఆ కాగితాల కోసమే కదా వచ్చింది. ఇక వెళ్లిరండి’’ అన్నాడు.
ఎంత అనుకోని రీతిలో నా పెళ్లి జరిగిందో అదేవిధంగా విడాకులు కూడా జరిగిపోయాయి. మేమిద్దరం ఎక్కడివాళ్ళం అక్కడ వుండిపోయాం. మధ్యలో వౌళి మాత్రం మిగిలిపోయాడు.
***
ఒక్కసారి క్యాబిన్‌లో పరిసరాలంతా ఒక విధమైన వాసనతో నిండిపోయింది.
ఎయిర్‌హోస్టెస్ భోజనం సర్వ్ చేస్తోంది. నాకు విమానంలో భోజనాలు అలవాటు అవ్వాలంటే నేను చాలా ప్రయాణాలు చెయ్యాలి. అది మాత్రం జరిగే పని కాదు.
వేడి వేడి కాఫీ త్రాగి వెనక్కి తల వాల్చుకున్నాను, చెవులకు స్పీకర్లు తగిలించుకుని. మనసెందుకో భారంగా వుంది. వౌళిని వదిలినందుకా? అవుననిపించడం లేదు. నేను వౌళికి దూరంగా వుండటం కొత్తేం కాదు. అప్పుడే వాడు అమెరికా వచ్చేసి చాలా ఏళ్ళు అవుతుంది. మొదట్లో బాధగా అనిపించినా, అలవాటయిపోయింది. అందులో యిప్పుడు తేజ, మూర్తిగారి కుటుంబం కూడా వాడితో వున్నారు.
అంతలోనే మరో ఆలోచన వచ్చింది. వౌళి మానసికంగా దూరమైపోతాడన్న భయమా! తేజకి దగ్గరపోయి? ‘్ఛ’ అనుకున్నాను. వాళ్ళిద్దరూ సరదాగా తిరుగుతుంటే నాకు నిజమైన సంతోషం కలిగింది.
నా భారానికి కారణం నేనే! నా ఒంటరితనమే, నా ఆనందం పంచుకునేందుకు ప్రక్కన ఎవ్వరూ లేకపోవడమే!
పెళ్లిని గురించి ఎవ్వరూ నిజంగా ఆలోచించరు. ఆ బంధంలో రోజులు మామూలుగా గడిచిపోయినంతకాలం అది దూరమైనప్పుడే ఆలోచన కలుగుతుందేమో! నిజంగా ఏ పెళ్లి అయినా, కోరికలు, మోహాలు అన్ని చిన్న వయసులోనే. తరువాత మిగిలేదీ స్నేహపూరితమైన అనుబంధం. అది పూర్తిగా ఒక కమిట్‌మెంట్‌కు ఫలితం.
మన వివాహాల్లో సంస్కృత మంత్రాలలో మనం ఏమని పెళ్లిచేసుకుంటున్నామో సగానికి సగం అర్థం కాదు. ఏదో పంతులుగారు చెప్పారని చేయడం తప్పితే. కాని పాశ్చాత్య వివాహాలు అలా కాదే. ప్రతి పదం ప్రతి ఒక్కరికి తెలుసు. జీవితంలో ఎటువంటి సందర్భాల్లో అయినా సరే! చావు విడదీసేవరకూ కలిసి వుంటామని ప్రమాణం చేస్తారు. కాని ఆ ప్రమాణానికి గౌరవం లోపించిపోతుంది.
ఇది రుూనాటి జంటలకు ఎందుకు అర్థం కావడంలేదు. పెళ్లిని ఎందుకంత తేలికగా తీసుకుంటున్నారు. ఎటుచూచినా విడాకులే. అందులో పిల్లలు కూడా పుట్టాక. మనం పూర్తిగా పాశ్చాత్య దేశాల అలవాట్లని, మన అలవాటుగా చేసుకుంటున్నాము. కాని అవగాహన చేసుకోవడంలేదు.
మూర్తిగారి స్నేహితుల్లో అప్పుడే ఎన్ని విడాకులో. ఒక కుర్రాడు వీసా రాగానే అమ్మాయిని వదిలేశాడు. మరొక అబ్బాయి వచ్చినప్పటినుండి శారీరక హింస. మరొక అమ్మాయి అయితే, ఇండియాలో బాయ్‌ఫ్రెండ్ వుంచుకొని పెళ్లి చేసుకువచ్చింది. మరొక విషయమయితే మరీ ఘోరం. గర్భవతి అయి పెళ్లిచేసుకువచ్చింది ఇంట్లో ఒత్తిడి మూలంగా. తీరా వచ్చాక భర్తను అంగీకరించలేక చంపేసింది. ప్రస్తుతం జైలులో వుందిట. ఒక్క ప్రాంతంలో ఇన్ని జరుగుతుంటే దేశం మొత్తంమీద భారతీయులలో ఎంతమందిలో ఇలా జరుగుతుందో? మనుషుల్లో బాధ్యత తగ్గిపోయింది. సర్దుకునే గుణం తగ్గిపోయింది’’ నిట్టూర్చాను.
కాని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నిజంగా, అమెరికా అబ్బాయిలలో కొంత తేడా బాగా కనిపించింది. భార్యలందరికి చాలా చేదోడు వాదోడుగా కనిపించారు. పిల్లల బాధ్యత, గినె్నలు కడగడం, డైపర్స్ కూడా మారుస్తున్నారు.
చిన్నపిల్లలతో సతమతమయ్యే చిన్న దంపతులను చూస్తేమాత్రం ముచ్చటేసింది. ఇంట్లో ఏ పని ఎవరి వంతన్నది లేదు. ఎవరికి వీలయితే వాళ్ళు చేసుకుంటున్నారు. వాషింగ్ మిషన్‌ల బట్టలు వుతకడం, పిల్లల్ని స్కూలులో దింపడం ఒక్కటేమిటి అన్నీను.
మరి చెయ్యాలి కదా! యిద్దరూ ఉద్యోగం చేసేటప్పుడు రుూ అవగాహన అందరికీ వస్తే ఎంత బాగుండును. రుూ విడాకులు సమస్యలే వుండవు కదా!
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి