పశ్చిమగోదావరి

దశలవారీగా డబ్లింగ్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు: నిడదవోలు-్భమవరం-విజయవాడ డబ్లింగ్ పనులు దశల వారీగా ప్రారంభించి, 2020-21 నాటికి పూర్తిచేస్తామని విజయవాడ రైల్వే డిఆర్‌ఎం ఆర్ ధనుంజయులు తెలిపారు. కొవ్వూరు - భద్రాచలం రైల్వే పనులను భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకూ ప్రారంభించనున్నట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు రైల్వే స్టేషన్‌ను శుక్రవారం డిఆర్‌ఎం సందర్శించారు. రైల్వే స్టేషన్లోని టిక్కెట్ కౌంటర్లను, రిజర్వేషన్ కౌంటర్లను, ప్రయాణికులు వేచియుండే గదులను, ప్లాట్‌ఫారంలను, రైల్వే స్టేషన్ పరిసరాలను, సిగ్నల్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గోదావరి నదిపై ఉన్న పాత రైలు వంతెనను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్టు చెప్పారు. విజయవాడ-విశాఖపట్టణం మూడవ లైను నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
స్థలం విషయంలో పురపాలక సంఘం సహకరిస్తే, శిథిలావస్థకు చేరుకున్న కొవ్వూరు రైల్వే స్టేషన్ భవనం స్థానంలో అత్యాధునిక నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని డిఆర్‌ఎం ధనుంజయులు తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు కొవ్వూరు రైల్వే స్టేషన్లో పాసింజర్ రైళ్లను ప్లాట్ ఫారం చివరికి కాకుండా ప్రయాణికులకు అందుబాటులో ఆగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొవ్వూరు రైల్వే స్టేషన్‌కు సంబంధించి పాసింజర్ రైళ్ల ద్వారా ఆదాయం తగ్గిందన్నారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో 32 రైళ్లను నిలుపు చేస్తున్నామని, వాటిలో 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 20 పాసింజర్ రైళ్లు ఉన్నాయన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం టిక్కెట్ కౌంటర్లో తాత్కాలికంగా మరో ఉద్యోగిని నియమిస్తామన్నారు. సిగ్నల్ వ్యవస్థ మార్పు విషయంలో అధికారులతో చర్చించిన డిఆర్‌ఎం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు వేచియుండే షెడ్లు అధ్వాన్నస్థితిలో ఉన్నాయని, వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. డిఆర్‌ఎం వెంట సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ సిపాలి, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ రామారావు, సీనియర్ డివిజనల్ హెచ్‌ఎం సత్యనారాయణ, ఆపరేషన్ మేనేజర్ చైతన్యరెడ్డి, ఎఇ వరప్రసాద్, కొవ్వూరు రైల్వే సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
టక్కరిదొంగ
చింతలపూడి: మోటారు సైకిల్ చోరీ కేసుకు సంబంధించి కోర్టులో హాజరుపర్చడానికి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి తీసుకొచ్చిన ఒక ఖైదీ పోలీసులకు పట్టపగలే చుక్కలు చూపించిన ఘటన చింతలపూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లికి చెందిన భూపాలపల్లి నాగేంద్రబాబు దొంగతనం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా తడికలపూడి స్టేషన్ పరిధిలో మోటారుసైకిల్ దొంగతనం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం అతడిని శుక్రవారం ఇద్దరు కానిస్టేబుళ్ల భద్రతతో చింతలపూడి కోర్టుకు తీసుకువచ్చారు. భోజన విరామ సమయంలో ఒక కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా, మరో కానిస్టేబుల్ బేడీలతో నాగేంద్రబాబుకు కాపలా ఉన్నాడు. ఆ సమయంలో మూత్ర విసర్జన పేరుతో పక్కకు వెళ్లిన నాగేంద్రబాబు పారిపోయే ప్రయత్నంచేశాడు. అయితే కాపలాగా ఉన్న కానిస్టేబుల్ అతడిని అడ్డుకున్నాడు. దీనితో ఒక్కసారిగా కానిస్టేబుల్‌ను తోసేసిన నాగేంద్రబాబు పరుగు అందుకున్నాడు. దీనితో ఇద్దరు కానిస్టేబుళ్లు అతని వెంబడించారు. రెండు గంటలపాటు అతడి కోసం గాలించారు. చివరకు పొలాల్లో ఒక తాడిచెట్టు ఎక్కి నక్కికూర్చున్న అతడిని గమనించి, కిందకు దించి, కోర్టులో హాజరుపరిచి, బతుకుజీవుడా అనుకున్నారు. ఈ ఘటన చింతలపూడిలో చర్చనీయాంశమయ్యింది.

నీటి కొరత లేకుండా చూస్తాం:ఎమ్మెల్యే సుజాత
ఏలూరు : చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తాగు, సాగునీరు కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. శుక్రవారం శనివారపుపేటలోని క్యాంపు కార్యాలయంలో చింతలపూడి నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్‌టి ఆర్ హౌసింగ్ పధకం ద్వారా మంజూరు కాబడిన ఇళ్లన్నీ కూడా త్వరితగతిన నిర్మాణాలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎత్తిపోతల పధకం సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించాలని, వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు.

గోతులు పూడ్చి కాపు యువకుల నిరసన
ఆకివీడు: ఆకివీడులోని కాపు యువకులు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు మద్దతుగా రోజుకోరీతిలో నిరసన తెలుపుతున్నారు. ప్రతీ రోజు మాదివాడ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్‌లో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టెలిఫోన్ క్వార్టర్స్ వద్ద జాతీయ రహదారిపై ఇటీవల కురిసిన వర్షాల వల్ల గోతులు మయమైన ప్రాంతంలో రాధారంగా మిత్ర మండలి సభ్యులు వినూత్నంగా మూడు ట్రాక్టర్ల మట్టి తెప్పించి శుక్రవారం గోతులు పూడ్చారు. ఒక పక్క సేవా కార్యక్రమాలు చేపడుతూనే మరో పక్క ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని నినదించారు. నిమ్మల నాగు, కేసిరెడ్డి దిలీప్, మోటుపల్లి రాజు, ద్వారకా, చుండూరి బోగారావు, ఆరేటి రాము, వానపల్లి హరీష్, తలారి రవి, నక్కా మణి, మోటుపల్లి రాఘవేంద్ర, నిమ్మల నాగేంద్ర, టింకు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలి
నిడదవోలు: విద్యుత్ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 22వేల కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని, పక్క రాష్ట్రంలో విద్యుత్ కార్మికులను ఏ విధంగా రెగ్యులరైజ్ చేశారో అదే మాదిరిగా మన రాష్ట్రంలో కూడా తక్షణం స్పందించి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఎపి ఎలక్ట్రిసిటీ ఎంప్లారుూస్ యూనియన్ అధ్యక్షుడు ఎన్ చంద్రరావు డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లారుూస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు చంద్రరావు అధ్యక్షత వహించగా, అయిదు జిల్లాల కంపెనీ ప్రధాన కార్యదర్శి కె మోహనరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రరావు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో కాంట్రాక్టు కార్మికులకు పని భారం విపరీతంగా పెరిగిందని, కాంట్రాక్టు కార్మికులు విధి నిర్వహణలో మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. ముఖ్య అతిథి మోహనరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో గుర్తింపుపొందిన సంఘాల ఐక్య కార్యాచరణ ద్వారా జెఎసిగా ఏర్పడి నిర్ణయం తీసుకుని ఉద్యమ రూపంలో ముందుకు వెళ్లతామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు జిపిఎఫ్ సౌకర్యాన్ని 1999లో నిలుపుదల చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 వరకూ కొనసాగించారన్నారు. వీరికి కూడా 2004 వరకూ వర్తింపజేయాలన్నారు. విద్యుత్ కార్మికులకు పూర్తి ఖర్చుతో వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వి రాము, డివిజన్ కార్యదర్శి ఆకుల వెంకట్రావు, ఎస్ శ్రీనివాసరావు, జి మోజేష్, వాసుదేవరావు, దుర్గాప్రసాద్, వాసు, వసంతరావు, కె రవి, కార్మికులు పాల్గొన్నారు.

సొసైటీ కార్యాలయం వద్ద ఘర్షణ
మొగల్తూరు: మొగల్తూరు మండలం పేరుపాలెం సహకార సంఘ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఇరువర్గాలకు చెందిన రైతులు ఘర్గణ పడ్డారు. ఒక వర్గం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా, మరోవర్గం వ్యతిరేకంగా అరుపులు, కేకలతో సంఘంలో జరిగిన అవకతవకల గురించి వాదించుకుంటూ ఘర్షణకు దిగారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. అనంతరం భీమవరం డివిజనల్ కోపరేటివ్ అధికారి సంకు మురళీకృష్ణ రైతుల సమస్యలు తెలుసుకున్నారు. సంఘ పరిధిలో గల 51 ఎంక్వయిరీని వేగవంతంగా పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. దీనిపై మురళీకృష్ణ మాట్లాడుతూ 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

బలహీన వర్గాల సంక్షేమానికి కృషి:చింతమనేని
పెదవేగి : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం విజయరాయిలో శుక్రవారం 9 మంది లబ్దిదారులకు చూడిగేదెలను ఎమ్మెల్యే ప్రభాకర్ పంపిణీ చేశారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా ఎస్‌సి రైతులకు ఈ గేదెలను పంపిణీ చేస్తున్నారని, పెదవేగి మండలంలో ఇప్పటి వరకు 163 మంది లబ్దిదారులకు చూడిగేదెలను అందించామని ఆయన తెలిపారు. ఈ పధకంలో 15 వేలు లబ్దిదారులు చెల్లిస్తే 62 వేల రూపాయల విలువగల గేదెను అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి దేవరపల్లి బక్కయ్య, విజయరాయి సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్, సర్పంచ్ సరోజిని, సుందరయ్య పాల్గొన్నారు.
జగన్‌లోని నేర ప్రవృత్తి బయటపడుతోంది
పాలకొల్లు: రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపండి, కొట్టండి, ఉరితీయండి అంటూ ప్రతిపక్ష నేత జగన్ నంద్యాల ఉప ఎన్నికలలో చేసే వ్యాఖ్యలతో ఆయనలోని నేర ప్రవృత్తి బహిర్గతమైందని ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు అన్నారు. కేవలం ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలనే తహతహతప్పిస్తే విచక్షణా జ్ఞానాన్ని జగన్ కోల్పోయి వ్యవహరిస్తున్నారన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ నెలవారీ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వైసిపి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు కూడా సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో ఎంతో అభివృద్ధి చేసినా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అవేమీ వారికి కనిపించడం లేదని, కేవలం విమర్శలు తప్పిస్తే మరేమీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కనిపించకపోవడం శోచనీయమన్నారు. వేల కోట్ల జగన్ ఆస్తులు, ఇడి జప్తుచేస్తే, తాను పేదవాడినని ప్రకటించుకోవటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సమావేశానికి ఎఎంసి ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, రాష్ట్ర కల్లుగీత సహకారం సంస్థ డైరెక్టర్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో మన్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ కర్నేన రోజారమణి, పట్టణ అధ్యక్షుడు బోనం నరసింహరావు, కార్యదర్శి గండేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బోనం నాని, రాష్ట్ర నాయకులు పెచ్చెట్టి బాబు, ఆసుపత్రి కమిటీ ఛైర్మన్ తమ్మినీడి సత్యనారాయణ, పాలకొల్లు మండల అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ధనాని సూర్యప్రకాష్, పెనె్మత్స రామభద్రిరాజు, దేవరపు దొరయ్య, కెవి సీతారాం, దేవరపు దొరబాబు, దాసరి రత్నంరాజు, అంగర చిన్ని, ఎస్ సర్వేశ్వరరావు తదితర్లు పాల్గొన్నారు.