Others

దుష్టులను దునుమానేవానికి దిష్టా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతనకు ప్రాణాలు లాగివేస్తున్నట్టు అనిపించింది కూర్చున్న చోటునుంచి వీధిలోకి పరుగెత్తింది. అంతలో పరమాత్మ ప్రాణాలు తోడివేశాడు గట్టిగా ఆర్తనాదం చేస్తూ పుడమిపై పడిపోయింది పూతన. సౌందర్యరాశిగా చిన్ని వయస్సులోని ముగ్ధయైన గోపికగా ఉన్న పూతన భారీకాయంతో, కోరలతో, వికృతాకారంతో నేలపై పడి ప్రాణాలు విడిచింది. ఆ వికృత శరీరిణిపై కూర్చుని ఏమి తెలియని చిన్నారి బాలునిలాగా కృష్ణయ్య చేతులు కాళ్లు ఆడిస్తున్నాడు. చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ గావుకేకకు అందరూ జనాలు పరుగెత్తుకు వచ్చారు. అక్కడ జరిగింది చూచి నోళ్లు వెళ్లబెట్టారు. అయ్యో! అంటూ మ్రాన్పడి నోట మాట రాక ఉండిపోయారు. ఆ శబ్దాన్ని విని లోపలున్న యశోద రోహిణిలు కూడా వెలుపలకు వచ్చారు. వారికి పెద్ద శరీరంతో పడిన రాక్షసి, ఆ రాక్షసి పైన చేతులు కాళ్లు ఆడిస్తూ నవ్వుకుంటూ ఆనందిస్తున్న తన కుమారరత్నం కనిపించాడు. వెంటనే యశోదమ్మ పరుగెత్తి ఆ రాక్షసి శరీరంనుంచి కృష్ణయ్యను అమాంతంగా తీసుకొని ఇవతల వచ్చింది. హృదయానికి హత్తుకొంది. ఎంతటి కీడు తప్పింది. అమ్మో ఎంత పెద్ద శరీరమో ఆ శరీరం కింద పడి ఎన్ని చెట్లు విరిగిపోయాయో ఆ దేవుడే నా కుమారుడిని ఈ రోజు రక్షించాడు. లేకపోతే ఈ రాక్షసి ఎపుడు వచ్చిందో నా బిడ్డడిని పొట్టన పెట్టుకోవాలని చూచి ఎత్తుకుబోయిందో ఏమో నేను ఎంత నిర్లక్షంగా వున్నానో ఛీ ఛీ ఇక ఎపుడూ నా చిన్నవాణ్ణి వదిలి ఎక్కడికీ పోనమ్మా అంటూ కృష్ణునికి ముద్దులు పెట్టింది. దిష్టితీసేయాలి ఎవరి దిష్టినో తగిలింది అంటూ దిష్టి తీసింది. అంతలో నందుడు రావడం జరిగింది తెలుసుకొని ఆ పూతన శరీరాన్ని దూరం చేయడం లాంటివి జరిగిపోయాయి. ఇంట్లోకి వచ్చి పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూసుకోవడంలో అలసత్వం కనిపిస్తోందని అందరికీ జాగ్రత్తలు చెప్పాడు. ఏ దేవుడో మనలను రక్షించాడు కనుక నష్టం ఏమీ కాలేదు. కాని మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని అందరికీ హితం చెప్పాడు. అందరూ తలలాడించారు. కనిపించని దేవునికి దండాలు పెట్టారు ఎపుడూ తమను దయతో చూడమని ఈ చిన్ని బాలుని జాగ్రత్తగా కాపాడమని మరీ మరీ వేడుకున్నారు.
* * *

చరణ శ్రీ