రంగారెడ్డి

భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్: శ్రావణమాసం చివరి రోజు కావడంతో దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగిపోయింది. సోమవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లోని దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రావణమాసం.. సోమవారం కావడంతో శివాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగిపోయింది. శివపార్వతులకు అభిషేకాలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోమాలు వంటిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేశారు. శ్రావన మాసంలో చివరి రోజు సోమవారం రావడంతో భక్తులు కుటుంబ సమేతంలో నూతన వస్త్రాలు ధరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య, సూర్యగ్రహణం కలిసి రావడం.. అందులో శ్రావన సోమవారం కావడంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతో శ్రేష్టమని భక్తులు తండోప తండాలుగా సమీపంలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ పంచాయతీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చుట్టు పక్కల గ్రామాల నుండి భక్తులు తెల్లవారుఝాము నుండే చేరుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కన్యకాపరమేశ్వరీ దేవాలయం, శివమారుతి గీతా అయ్యప్పమందిరం, శ్రీ రమ సత్యనారాయణ స్వామి దేవాలయం, ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామ సమీపంలో ఉన్న శ్రీ భవానిమాత దేవాలయాలకు భక్తులు చేరుకొని అభిషేకాలు, కుంకుమార్చన, హోమాలు వంటి పూజా కార్యక్రమాలను చేపట్టారు.