భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం- 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా చిరునవ్వు నవ్వాడు.
‘‘నానా! నీకు ఎందుకీ అనుమానం వచ్చింది. అయినా నీవు నేను వేరు వేరు కాదు కదా. నీవెంతో నేను అంతే. ఎక్కడినుంచి వచ్చామో మనమంతా తిరిగి అక్కడికే పోతాం కదా! మధ్యలో నీవు నేను అని ఎందుకీ చర్చలు’’ అన్నాడు.
అంతలో హేమాదిపంతు-
‘‘బాబా అందరూ మమ్ముల్ని అడుగుతుంటారు. బాబా ఎక్కడినుంచి వచ్చారు. ఆయన తల్లిదండ్రులు ఎవరు? అని. మేము నీ దగ్గరగా ఉంటామని నీ గురించి మాకు తెలిసి ఉంటుందని వాళ్లు ఆసక్తిగా అడుగుతారు. అప్పుడు మేము ఏమీ చెప్పలేక ఉన్నాం’’ అన్నాడు.
అదా సంగతి. ఆ అనుమానం ఉండేవాళ్ళు నా దగ్గరకు రమ్మని చెప్పండి. అసలు నా దగ్గరకు వచ్చినవారికి ఆపదలే కాదు అనుమానాలు లేకుండా చూసే బాధ్యత నాది అన్నాడు బాబా.
అదీ కాదు బాబా నీవు ఎవరివో మాకు కాస్త చెప్పరాదా! అన్నాడు మహిల్సాపతి. మీలాగే ఓ రోజు నా దగ్గరకు ఓ అబ్బాయి వచ్చాడు. వాడికి చలిగా ఉందంటే ఒక రగ్గు, ఒక కోటు ఇచ్చాను. దానికి వానిమీద ఎవరో ఇవి నావి. వీడు దొంగతనం చేశాడు అని కేసు పెట్టాడట. ఈ అబ్బాయి కోర్టులో నేను వాటిని ఇచ్చానని చెప్పాడట. అది నిజమో కాదో తెలుసుకోవడానికి నా దగ్గరకు న్యాయవాది వచ్చాడు. అతడూ మీలాగే మీరెవరు? ఎక్కడనుంచి వచ్చారు? ఎంతకాలం అయింది అంటూ ఏవేవో అడిగాడు అన్నాడు బాబా.
మరి బాబా అప్పుడు నీకు ఆ న్యాయవాదికి జరిగిన సంభాషణ అంతా జరిగింది జరిగినట్లుగా మాకు చెప్పు, అప్పుడు నువ్వెరివో మాకు తెలుస్తుంది అన్నారు అందరూ ఒక్కసారిగా.
ఓహో అలానా సరే
న్యాయవాది: మీ పేరేమి?
నేను:వీరంతా నన్ను సాయిబాబా అని పిలుస్తారు.
న్యాయవాది:మీ తండ్రి పేరు
నేను: నాకుతెలీదు
న్యాయ:మీదేమి మతం
నేను:మానవత్వం
న్యాయ: మీ గురువు ఎవరు
నేను: వెంకుసా
న్యాయ:మీదేమి కులం?
నేను:దైవ కులం
న్యాయ:మీ వయస్సు ఎంత?
నేను:చెప్పలేను. కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యి ఉంటుంది.
న్యాయ:ఇలా కాదు సరిగా చెప్పండి.
నేను:నేను అంతా నిజమే చెబుతున్నాను. ఇంతకన్నా నా దగ్గర నిజాలు అంటూ ఏమీ లేవు.
అంతలో ‘‘నారాయణా! మాకు ఏమీ అర్థం కాలేదు, బాబా లక్షల
సంవత్సరాలు జీవించడమేమిటి? నీ తల్లిదండ్రులు

పేర్లు తెలీదని మీ గురువుగారి పేరు మాత్రం ఛెప్పావు ఏమిటి ఆ గురువు ఎవరు ఎక్కడుంటారు చెప్పలేదేమి? మతమేదంటే మానవత్వం అంటావా? అదేంటి, మతం లేకుండా నీవు ఎక్కడనుంచి వచ్చావు?’’ అన్నాడు గబగబా అక్కడే వున్న కాశీనాథ్.
భగవంతుడికి చావు పుట్టుకలు అవసరమా? ఎక్కడ పుడతాడో ఎక్కడనుంచి వస్తాడో ఏ రూపంలో ఉంటాడో ఎవరికి తెలుసు. పరమాత్మ గురించి పరమాత్మ తప్ప మానవులు తెలుసుకునే జ్ఞానం ఉందా? ఏ భక్తుని కథ చదివినా ఆ భక్తుని కోరిక మేరకు భగవంతుడు తన్ను తాను సృజయించుకున్నాడుగాని ఆయనకు రూపమెక్కడ ఉంది. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అయినవాడే కదా భగవంతుడని మనం అంటుంటాముఅని మనసులో అనుకున్నాడు మహిల్సాపతి.
అదీ నిజమే. ఈ బాబా నిజంగా భగవంతుడే అయి ఉంటాడు. ఎప్పుడూ చిరునవ్వులు చిందించడం బాధను ఉపశమింపజేయడం అనేది భగవంతునికి మాత్రమే తెలిసిన విద్య కదా! అనుకున్నాడు హేమాదిపంత్.
అంతలో-
అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీగుజారీ మహారాజ్ వీరి మాటలను విన్నాడు.
గుజారీ మహారాజ్ మీకంతా ఓ విషయం చెప్తాను. నా జీవితంలో జరిగిన విషయం చెప్తాను వినండి. అని ఇలా చెప్పసాగారు.
‘‘నేను ఇంతవరకు దీనిని ఎవరికీ చెప్పలేదు కానీ మీకు ఈ నా గురుసేవ గురించి బాబా చెప్పమని చెపుతున్నట్లుగా నాకు అనిపించింది. అందుకే చెబుతున్నాను అన్నాడు. మా తల్లిదండ్రులు చాకలివారు. నేను ఒక బట్టల కొట్టులో పనిచేసేవాణ్ని. ఒక రోజు ఆ బట్టలు కొట్టు దగ్గరికి ఓ ఫకీరు వచ్చాడు. అతని చేతిలో గినె్న అతని భుజాన జోలె ఉంది. చిరిగిన బట్టలు వేసుకుని ఉన్నాడు. కాని అతని ముఖం మాత్రం దివ్య వర్చస్సుతో వెలిగిపోతోంది. నాకు ఎందుకో అతని దగ్గరకు వెళ్లాలని అనిపించింది. అతడు భిక్ష అడుగుతున్నాడు. కానీ అక్కడెవరూ అతనికి భిక్ష పెట్టలేదు. కాని అక్కడ ఉండబుద్ధి కాలేక నా యజమానిని అడిగి నేను వేగంగా మా ఇంటికి వెళ్లాను. మా ఇంటి నుంచి రొట్టెలు, అన్నం, కూర తీసుకొని అంతే వేగంగా కొట్టు దగ్గరకు వచ్చాను. అక్కడ ఆ ఫకీరు నాకు కనిపించలేదు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743