భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఆయనే్న వెతుకుతూ ముందుకు వెళ్ళాను. చాలా దూరం వెళ్ళాను. అక్కడ ఊరికవతల పొలాల్లో జొన్న కంకులు కోసుకుని తింటూ కూర్చుని ఉన్న ఫకీరును చూచాను. ఆనందం వేసింది. గబగబా వెళ్లి నేను తెచ్చిన వాటిని పెట్టి తినమని బతిమిలాడాను.
ఆయన నా వంకనే చూస్తూ గుడ్లు ఉరిమి..
అసలు నిన్ను ఇక్కడికి రమ్మన్నదెవరు? ఇవన్నీ ఎవరు తీసుకుని రమ్మన్నారు. వెళ్లిపో ఇక్కడ నుంచి అని పెద్ద పెద్దగా అరిచారు.
చిత్రం ఆ అరుపులకు నాలో ఆనందమే కాని భయం వేయలేదు.
నేను వెంటనే చేతులు జోడించి
మీకు ఎవరూ భిక్ష ఇవ్వలేదు కదా. అందుకే నేను తెచ్చాను అన్నాను.
ఓహో అయితే నేను అడిగిందల్లా ఇస్తావా? అన్నాడాయన.
నా దగ్గర ఏది ఉన్నా ఇస్తాను అని పంతంగా అన్నాను.
దానికి ఆయన అయితే నీ ప్రాణానివ్వు అన్నారు.
బాబా అవి నా చేతుల్లో లేవు. అవి నీ దగ్గరే ఉన్నాయి. అవి నాకు ఇవ్వాలన్నా నా నుంచి తీసుకోవాలన్నా నీవే సమర్థుడివి. నేను కాదు. అన్నింటికి కారణమైన నీవు నన్ను పరీక్షిస్తున్నావా? అన్నాను. ఆ మాటలకు ఆయన ఎంతో ఆనందించారు.
నన్ను దగ్గరకు పిలిచి నా తలపై ముద్దు పెట్టుకుని ఇక్కడనుంచి వెళ్లిపో అన్నారు. నాకు మాటల్లో వర్ణించలేని ఆనందం దొరికింది.
వేగంగా ఇంటికి వెళ్లాను. నావారితో జరిగింది అంతా చెప్పేశాను. ఇక నేను ఈ సంసారంలో ఉండలేను. నాకు నా గురువు దొరికారు. వారి సన్నిధిలోనే నా కాలాన్ని గడుపుతాను. వారి సేవే నాకు శ్రీరామరక్ష. నేను నా గురువుగారి దగ్గరకు వెళ్తున్నాను అని పరుగెత్తి మళ్లీ వచ్చేసాను.
ఈసారి బాబా చిమ్టా తీసుకుని నాపైకి పరుగెత్తివచ్చారు.
ఉగ్రంగా ఏరా! నీవు నీకిచ్చింది చాలక మళ్లీ వచ్చావా? నన్ను పీక్కుతిందామని వచ్చావా?’’ అని వడివడిగా స్మశానంలోకి వెళ్లిపోయారు.
నేను ఏ మాత్రం సద్గురువును వదలకుండా గురువుగారి బాటలోనే నడుచుకుంటూ వెళ్లాను. నన్ను చూసి చిరునవ్వు నవ్వారు ఒక సమాధి ముందు ఆగారు. అక్కడ ఒక నుయ్యి ఉంది. అందులోనుంచి నీరు తోడి సమాధి అటు పక్కన గుంటలో నీళ్లు పొయ్యమన్నారు. నేను అట్లానే చేశాను. ఆ గుంటలో నీరు బాబా దోసలితో తీసుకుని మూడుసార్లు తాగారు. నన్ను కూడా అట్లానే తాగమన్నారు. సరే అని తాగాను. అంతే నాకు బాహ్యస్మృతి పోయింది. మళ్లీ నేను లేచేసరికి నాకు నేను ఎక్కడ ఉన్నానో తెలిసేసరికి ఆయన లేరు.
ఇదిగో చాలా యేండ్లు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాను. ఈ మసీదులో ఉన్నారని అంటే నేను వచ్చాను.
పొద్దున నేను వచ్చేసరికి బాబా స్నానం చేస్తున్నారు. నన్ను చూసి
పెద్దగా తిట్టారు. మరలా దగ్గరకు పిలిచారు. ఇక నా దగ్గరకు రాకు. నిన్ను అందరూ దైవంగా పిలుస్తారు. ఇక నీవు గురువుగా కీర్తించబడుతావు. ఇక వెళ్లిపో అన్నారు.
అలా నేను మరలా ఒక్కసారి ఈ బాబాకు నమస్కరించి వెళ్దాం అని వచ్చాను. ఇది నా కథ.
ఇప్పుడైనా ఈ బాబా అనుగ్రహాగ్రహాలు తెలిసాయా అని అడిగారు.
అంతా మైమరిచి వింటున్న జనం బదులు చెప్పడానికి కూడా రాక వౌనంగా ఆయనే్న చూస్తూ ఉండేవారు.
ఆయన అనంతర కాలంలో శ్రీగుజారీ మహారాజ్‌గా జనుల చేత పొగడించుకున్నారు. ఆయన చేసిన ధార్మిక కార్యాలు ఎన్ని ఉన్నాయో, పాఠశాలలు, ధర్మశాలలు స్థాపించారు. అందరికీ బాబా గురించి బోధ చేసి సన్మార్గులను చేసేవారు.
చాలాకాలం తరువాత తన భక్తులతో శిరిడీ వచ్చి శిరిడీ వీధులను శుభ్రం చేసి బాబాను దర్శించుకుని ఇక నేను వెళ్లిపోతున్నాను.. నా గురువుగారి దగ్గరికి శాశ్వతంగా వెళ్లిపోతున్నాను అంటూ నర్మదా నదీ జలాల్లోకి అడుగులు వేసారని భక్తులు చెప్తారు.
***
బయాజీబాయి ఇందాక ఇక్కడికి వస్తుంటే పిల్లల్నెందుకో కోప్పడుతోంది.

ఎందుకంటావు అని అడిగాడు తాత్య. ఆ ఏముంది బయాజీబాయి కుమారుడు పేరు కూడా తాత్యాపాటిల్, వాని స్నేహితుడు రఘు పాటిల్ వీరిద్దరికి తోడు మరికొంతమంది ఈ మసీదుకు వచ్చి బాబాను చూస్తూ నిలబడుతారు. వారు నిలబడినంత సేపు నిలబడి ఈయనపైకి రాళ్లు రువ్వుతుంటారు. సాయిబాబా వారిని ఒక్కోసారి ఏమీ అనడు. అట్లాంటపుడు మరింత ఉత్సాహంతో వాళ్లు రాళ్లు బాబాపైకి రువ్వుతూనే ఉంటారు. ఒక్కోసారి బాబా తన పక్కనే ఉన్న సట్కా తీసుకొని ఒక్కసారి గట్టిగా ఉరిమారంటే వెంటనే వారు అక్కడ్నుంచి పరుగెత్తి పారిపోయేవారు. అదిగో ఆ మాటలే మాట్లాడుకోవడం బయాజీబాయి విన్నట్లు ఉంది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743