డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు మీ వ్యాసాలలో మద్దతు ఇచ్చేది అదే కదండీ. ఫ్రీ ఎంటర్‌ఫైజ్, వ్యాపార దృష్టి, లాభదృష్టి లేకుండా, ఏది ముందుకు వెళ్ళలేదని గవర్నమెంటు వారు కల్పించుకోవడం తగ్గాలని’’ అన్నారు ఒకరు.
నా ఐడియాలజీ వాళ్ళు ఫాలో అవుతున్నారన్నమాట.
‘‘మేడమ్ మీకు ఆ వూళ్ళో అన్ని వసతులు ఏర్పాటుచేస్తాం. మీకు ఏ విధంగాను ఆర్థిక నష్టం వుండదు. నిజం చెప్పాలంటే చాలా మెరుగవుతుంది. మీ గైడెన్స్ కావాలి. మీ ఐడియాలను బాగా ఉపయోగించాలి. మనం ముఖ్యంగా ఒకేషనల్ సైడ్ ఆఫ్ ది ఇనిస్టిట్యూషన్ కూడా అన్నాడు మరొకాయన.
‘‘మీ విశాల దృక్పథం కేవలం వ్యాసాలకు మాత్రమే కాకూడదు, క్లాస్‌రూమ్స్‌దాకా వెళ్లాలి’’ అన్నాడు మరొకడు.
అరడజను మంది పెద్దలు ఎందుకొచ్చారో అర్థమయింది.
వాళ్ళు చెప్పిందంతా విని ‘‘నేను మీకు సాయపడగలననుకోను, కారణం నేను ఎక్కువగా బాధ్యతలు తీసుకోదలచుకోలేదు. మా అబ్బాయి, కోడలు అమెరికాలో వుంటారు. వాళ్ళు నన్ను రమ్మని తరచుగా అంటూ ఉంటారు. నేను వెళ్ళానంటే 4, 5 నెలలు వుండిపోతానేమో. అందుకని అదనపు బాధ్యతలతో తల దూర్చదలచుకోలేదు’’ అన్నాను.
‘‘మీరు మా ప్రపోజల్ మనసులో వుంచుకోండి. బాగా ఆలోచించుకోండి. తొందర ఏమీ లేదు. మీలాంటి సమర్థులు వెనకాడకూడదని మా ఉద్దేశ్యం. డబ్బుకోసం కాకుండా, మానసిక వికాసం రావాలనే నేర్పే ఉపాధ్యాయులు చాలా తక్కువ ఈ రోజుల్లో’’ అన్నారు, వాళ్ళు వెళ్ళేందుకు సిద్ధపడుతూ.
ప్రతివారికి వారికి పనిచేసేవాళ్ళంతా ఎంతో నీతివంతంగా పని చెయ్యాలన్న కాంక్ష. కాని వాళ్ళ తరఫునుంచి ఎంత పాటిస్తున్నారన్నది చూడరు. వారి తరఫునుంచి ఎంతమంది చేతులు తడిపారో రుూ సంస్థ ఇంతవరకు రావడానికి.
డబ్బు, డబ్బు- అది సంపాదించడమే రుూ రోజు ధ్యేయం. అది సంపాదించుకోవడానికి ఏ దార్లో ప్రయాణం చేస్తున్నారన్నది పూర్తిగా మరుగుపడిపోయింది. ఆ తప్పుడు పని చెయ్యందెవరు? అన్నీ సమర్థించుకునే స్థితికి దిగజారిపోయింది సొసైటీ.
అందరూ లేచారు. వౌళిని, తేజాని పరిచయం చేశాను.
‘‘మీ ఇద్దరూ అమ్మగారిని బాగా ఎంకరేజ్ చెయ్యాలి. రుూ ప్రాజెక్టు ముందు నిలబడటానికి.
వౌళి చిరునవ్వు నవ్వి- షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళ కారు కదిలేంతవరకు వేచి చూసి వెంటనే ‘గో ఫర్ ఇట్ అత్తయ్యా గో ఫర్ ఇట్’’ అంది చాలా ఉత్సాహంగా తేజ.
‘‘నో తేజా! యిది ఎంత కష్టమో తెలుసా యిలాంటి ప్రాజెక్టు నడపాలంటే!’’ అన్నాడు వౌళి.
‘‘అఫ్‌కోర్స్ వౌళి, కాని మీ అమ్మ చాలా సమర్థురాలు’’.
‘‘సమర్థత ఒక్కటే సరిపోదు చాలా కష్టపడాలి. అంత కష్టపడాల్సిన అవసరం లేదు’’ అన్నాడు వౌళి.
‘‘కమాన్ వౌళి! ఆవిడ ఏదో చాలా పెద్దవయస్సన్నట్లుగా మాట్లాడకు. అమెరికాలో అయితే యిదే మంచి వయస్సు. ఆవిడ ముందుచూపు, తెలివితేటలు, సమర్థత అంతటికి ఇదో ఛాలెంజ్ అంది.
‘‘కావచ్చు అమ్మ అంత పెద్ద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏముంది’’ అన్నాడు వౌళి.
‘‘కష్టపడి పనిచేసేవాళ్ళంతా, అవసరం వుండే చెయ్యరు వౌళి. కొందరు పనిచెయ్యాలి. మానసికంగా వున్న ఎనర్జీకి కట్టలు కట్టడం కష్టం. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మైండ్‌కి అంతే’’ అంది.
‘‘నీకు ఇండియాలో పనులు చేయించడం ఎంత కష్టమో నీకు తెలియదు తేజా! హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని టెలిఫోన్‌లో పనులు చేయించగలిగే దేశం కాదు ఇది. నా దృష్టిలో అమ్మ హాయిగా రిలాక్స్ అయి సరదాగా ఏ బాధ్యతలు లేకుండా గడపాలి’’ అన్నాడు వౌళి.
అన్నయ్యకి వౌళికి మాటలు చాలా నచ్చాయి. ‘‘నా ఓటు నీకేరా చంద్రా’’ అన్నాడు అన్నయ్య.
‘‘మరి నీ ఓటు వదినా’’ అడిగాను. మా వదినకి, తేజ, వౌళి ఇద్దరి మాటలు నచ్చాయి. కాని క్రిందటిసారి అంతగా ప్రోత్సహించలేకపోయింది. అందుకే ‘‘నా ఓటును ఈసారి వేయదల్చుకోలేదు’’ అంది.
‘‘మరి మీ ఓటు తాతగారు?’’ అంటూ అడిగింది తేజా, మా నాన్నను. తేజాలో వున్న ఆ కలుపుగోలుతనం అందరినీ ఆకట్టుకుంది. తనకు కూడా, మా ఇంట్లో మా అందరి మధ్య వున్న దగ్గరతనం, ఓపెన్‌గా మాట్లాడుకోవడం చాలా నచ్చింది.
‘‘నా ఓటా! అని ఓ క్షణం ఆలోచించి నా ఓటు ఎప్పుడూ కళ్యాణికే! అది ఏ నిర్ణయం తీసుకుంటే దానికే!’’ అన్నారు నాన్న.
అందరూ నవ్వారు. తేజ అమ్మ వంక చూస్తూ ‘‘తాతగారు చాలా స్మార్ట్’’ అంది.
నవ్వాను- వాళ్ళిద్దరు వున్న కొద్ది రోజులు చాలా హాయిగా, సంతోషంగా గడిచిపోయాయి. వౌళి, తేజ మధ్య వున్న అనుబంధం నన్ను చాలా తేలిక చేసింది.
పెళ్లి సంబరాలన్నీ చాలా ఆనందించి వచ్చానే కాని, మనసులో రుూ పెళ్లి ఎలా సాగుతుంది అన్న భయం మనసులో మెదులుతూనే వుండేది. తేజ అమెరికాలో పెరిగింది. వౌళితో సమంగా చదువుకుంది. వౌళి కంటే ఎక్కువ సంపాదిస్తోంది.
వౌళి ఇండియాలో చాలా సంప్రదాయమైన పాత కాలపు పరిసరాల్లో పెరిగాడు. వీళ్ళ ఆలోచనలు ఎలా వుంటాయో అన్న భయం నాకు ఎప్పుడూ ఉండేది. కాని, వౌళిలో ఎదుటవారిని గౌరవించే గుణం చాలా వుంది. వాడు ఎదుటివారిలో వున్న సమర్థతను చాలా గుర్తిస్తాడు. బహుశ అదే వాళ్ళిద్దరి అనుబంధానికి పునాది అయిందేమో.
కాని వాళ్ళిద్దరి వాదాలు, పోట్లాటలు మాత్రం అందరికీ చాలా సరదాగా వుండేది. తేజాకి ఏది కొత్తగా ఎదురయినా ‘‘మీ అమెరికా అమ్మాయికి వీటిలో మజా తెలియదు’’ అని టీజ్ చేసేవాడు.
‘‘అందుకేగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఏమీ తెలియకపోవడంతోనే అన్నీ నువ్వు నేర్పుతావని’’.
‘‘ఏమిటీ తేగలు తింటం, ముంజలు తింటం యివా నేనేర్పాల్సింది’’.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి