భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారిని అట్లా అల్లరి చేయవద్దని, బాబా అంటే దైవం అని వారికి ఎన్నోసార్లు చెప్పింది. పిల్లమూక కదా అందుకే వారు వింటున్నట్టే ఉంటారు కాని వారు చేసేది చేస్తారు. బహుశా అందుకే మళ్లీ బయాజీబాయి వారిని కోప్పడుతున్నట్లు ఉంది.
రహమాన్ అన్నాడు.
అవును నిజమే అయ్యి ఉండవచ్చు. పిల్లలు కూడా నలుగురైదుగురు అక్కడ నేను చూశాను’’ అన్నాడు రాము పాటిల్.
అంతలో అక్కడికి హేమాదిపంతు వచ్చారు. ఏమిటో మీరు మాట్లాడుకుంటూ ఉన్నట్టు ఉంది అంటూ పలకరిస్తూ బాబా దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి వచ్చి వీరి దగ్గర కూర్చున్నారు.
బాబా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా కూర్చుని ఉన్నారు. వీరిని కనీసం కనె్నతె్తైనా చూడడంలేదు.
హేమాదిపంతు ‘చూశారా! ఈ బాబాను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇక్కడే ఉన్నట్టు ఉంటారు కాని ఎక్కడో మనసు వుంటుంది’ అన్నాడు.
నిజమే.. వామనరావు డేంగిల్ కూడా ఇలానే అన్నారోసారి.
ఈమధ్య బాబా ఇక్కడ ఉన్నట్టు ఉండి కనిపించకుండా వెళ్లిపోయారట. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. ఇలా బాబా కనిపించకుండా రెండున్నర ఏళ్లు పాటు ఉన్నట్టు ఉన్నారు. మళ్లీ ఒకరోజు బాబా కనిపించారు. బాబా ఉంటే ఈ మసీదులో ఉంటారు. లేకపోతే ఈ లెండి, సిర అనే ఈ జంట నదుల దగ్గర ఉన్న చెట్ల తోపుల్లో కనిపిస్తూ ఉంటారు. అసలు బాబా ఎక్కడి వారనికాని, ఎవరి తాలూకూ మనిషి అని కాని మనమెవరమూ చెప్పలేము’ అన్నాడు హేమాది పంతు.
నిజమే మా అమ్మ వాళ్లు కూడా ఈ బాబాను చూశామని చెప్తారు. అసలు మా తాతగారైతే ఈ బాబా సాక్షాత్తు అక్కల్‌కోట మహారాజు అని అంటారు అన్నాడు అపుడే వచ్చిన వామనరావు.
‘అదీ నిజమే శంకర్ నారాయణ వైద్య అనే ఒక మహాత్ముడు ఉండేవాడు. అతడు నానావల్లీ భక్తుడు. నానావల్లీ ఒకరోజు స్వప్నంలో కనిపించి నీవు శిరిడీ వెళ్లు అక్కడ ఓ మహాత్ముడు నీకు దర్శనం ఇస్తాడు. ఆయన్ను సేవిస్తూ ఉండు అని చెప్పాడట. అందుకని చాలా రోజుల క్రితం ఇపుడు మీరు చూసే శంకర నారాయణ ఈ శిరీడీ కి వచ్చాడు.
అయితే బాబా ఇక్కడ కనిపించగానే అతను ‘‘మామా వచ్చావా!’’ అన్నాడు. అంతే అపుడు ఈ బాబా ‘నోరెత్తద్దు’ అని గట్టిగా మందలించారు. ఇక అప్పట్నుంచి చూస్తున్నారు. రోజు బాబాను సేవిస్తారు కాని ఎపుడూ బాబా గురించి ఒక్క ముక్క ఐనా చెప్పలేదు ఈ శంకర నారాయణ’’ అన్నాడు హేమాదిపంతు.
‘ఎందుకో బాబా ఎపుడూ తన గురించి తాను చెప్పడు. ఎవరినీ కూడా చెప్పనివ్వడు’ అన్నాడు తాత్యాపాటిల్.
‘‘నేను మీకో అద్భుతమైన రహస్యం చెప్పనా’’ ఎంతో ఆనందంగా అడిగాడు వానమరావు.
దానిదేముంది చెప్పు అన్నారందరూ.
రెండు రోజుల క్రితం నేను మహిల్సాపతి, హేమాదిపంతు ఇంకా కొంతమంది రాత్రివేళ బాబా దగ్గర సెలవు తీసుకొని ఇండ్లకు వెళ్లిపోయాము. కాని నాకెందుకో నిద్రపట్టలేదు. ఎక్కడినుంచో మధురమైన పాటలు వినిపిస్తున్నాయి. ఎవరో మంచి నాట్యం చేస్తున్నట్టు మువ్వల శబ్దాలు కూడా నేను విన్నాను.
ఎవరై ఉంటారు అని నేను వీధిలోకి వచ్చాను. వీధి అంతా శబ్దం లేకుండా ఉంది. కాని నాకు మాత్రం ఈ మువ్వల చప్పుడు, ఇంకా పాటలు వినబడుతూనే ఉన్నాయి.
ఎక్కడినుంచో ఇలా వినిపిస్తున్నాయో చూద్దామని అనుకొంటూ ముందుకు వెళ్లాను.
ఇదిగో ఈ ఫకీర్లు ఉండే చావడి ఉంది కదా. ఇక్కడే బాబా చేతిలో ఎక్కడిదో కాని తుంబర పట్టుకొన్నారు. కాలికి గజ్జెలు కట్టుకున్నారు. ఆహా ఎంత పారవశ్యంతోనో నాట్యం చేస్తున్నారు. చెప్పలేను పాట కూడా మధురంగా ఆలపిస్తున్నారు. నేను అలా చూస్తుండిపోయాను. ఎంతసేపు అలా చూశానో నాకే తెలియదు.
నాకు అప్పుడు అనిపించింది ఇలా..
అవును కృష్ణుడు కూడా పిల్లనగ్రోవి ఊదుతూనే గోవులు కాచేవాడట. రాత్రి సమయాల్లోను, పొద్దునే్న కూడా ఊరి చివరకు వెళ్లి చక్కని పాటలతో మురళిరావంతో గడిపేవాడట. ఆ మురళీరావానికి ప్రజలందరూ తన్మయులయ్యేవారట.
ఒక్కోసారి ఎవరికివారు వారికి తెలియకుండానే ఆ మురళిగానం వచ్చే దిక్కుకు వెళ్లిపోయేవారట. మురళీ మోహనునితో కలిసి ఆడుతూ పాడుతూ కాలాన్ని వెళ్లబుచ్చేవారట. ఆనాడు బృందావనంలో గోపికలతో ఆడి పాడిన కృష్ణయ్యనే నేడు మన శిరిడీకి వచ్చాడా అని అనిపించింది.
వామనరావు పరవశంతో చెప్పాడు. వినే వారంతా ఊకొట్టడం కూడా మరిచిపోయినట్టుగా ఉన్నారు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743