ఆటాపోటీ

భారీ ప్రైజ్ మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఆరంభంలో చాలా టోర్నీల కంటే చాలా తక్కువగా ఉండేది. అయితే, క్రమంగా పెరుగుతూ, 1968 నాటికి ఈ మొత్తం లక్ష డాలర్లకు చేరింది. ఇప్పుడు పురుషులు, మహిళల విభాగాల్లో సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరికీ 33,00,000 డాలర్లు లభిస్తున్నాయి. లక్ష డాలర్ల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన ప్రైజ్ మనీ ఇప్పుడు 4.22 కోట్ల డాలర్లకు చేరింది. ఇది సుమారు 254 కోట్ల రూపాయలకు సమానం. క్వాలిఫయర్స్‌లో ఆడిన వారికి కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది. మూడు దశల్లో జరిగే క్వాలిఫయర్స్‌లో వరుసగా 5,000, 10,000, 15,000 డాలర్లు చెల్లిస్తారు. ఫస్ట్ రౌండ్‌కు చేరితే 39,500, రెండో రౌండ్‌కు చేరితే 68,600, మూడో రౌండ్‌లోకి అడుగుపెడితే 1,20,200 డాలర్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ప్రీ క్వార్టర్స్‌లో చేరిన వారికి 2,13,575, క్వార్టర్ ఫైనల్స్‌లోకి వెళ్లిన వారికి 4,10,975 డాలర్లు లభిస్తాయి. సెమీ ఫైనల్స్ చేరితే 8,05,000, ఫైనల్ చేరితే 18,00,000 డాలర్లు సొంతమవుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో తేడా లేకుండా ఒకే ప్రైజ్‌మనీని ఇస్తున్న ఏకైక టోర్నీ యుఎస్ ఓపెన్ మాత్రమే. మిగతా టోర్నీల్లో మహిళలు, పురుషుల విభాగాల్లో వ్యత్యాసం ఇప్పటికీ కొసాగుతునే ఉంది.