నెల్లూరు

ఇంకా.. ఇంకా.. (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి సంధ్య వేళలో
మంచు తెమ్మరలలో
దాగిన నీకై ఎంతని వెదికేది?
మలిసంధ్య చీకట్లలో
మనసంతా నీపై ఉంచి
ఏకాంతంగా.. ఏకాగ్రతతో వెతుకుతూనే ఉన్నా
కనులముందు ఎన్నో రూపాలు తారాడుతున్నా
నేకలగన్న నీ రూపం ఇంకా.. కన్పించదాయె
ఆ మంచులో అలా నీకై..నాని..తుమ్మితే
కళ్ల ముందు తిరుగుబూచులు దోబూచులాడుతుంటే..
నువ్వేనేమోనని పొరబడ్డా..
వెతికి వెతికి పట్టుకొనేలోపు
కనుల ముందే మాయమైనాయి
ఇక చీకట్లో కళ్లు పొడుచుకొని వెదికినా
కళ్లు కాగడాలు చేసి వెదికినా..
నీడలు జాడలేగాని, నీ ఉన్నవాడ కన్పించదాయె
వెలుగులో..అందరిలో..నీవెక్కడో
అసలు కానరావు
నీడలా కన్పిస్తావనుకున్నా..
అసలు నిజం ఉండాలిగా..!
నీవసలున్నావో..లేవో..? ఓ అనుమానం
ఎండమావిలా కన్పిస్తూ..
నేనెంత దగ్గర కొస్తుంటే..
నీవంత దూరం జరిగిపోతుంటే
తనువు చెబుతుంది మనసుకు
పిచ్చి భ్రమలు వదిలేయమని
అయినా నమ్మబుద్ది కావటం లేదు
ఇంకా.. ఇంకా..
వెతుకుతూనే ఉన్నా నీకై..
నెమలి పింఛం నెత్తినెట్టుకొని.
- నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వరశర్మ
చరవాణి : 9908101646

మ్యానరిజం
ఒకప్పుడు
మరీ పచ్చగా
మాధుర్యంతో నిండి వున్న
మమతానురాగాల పూదోటలు
స్వార్థమనే స్వయంకృతాపరాధంతో
విషపూరితాలై
విద్వేషపు అంటురోగాలు సోకి
నిర్జీవాలై
నిండు బూడిద రంగులో కనిపిస్తున్నాయి

ఆత్మీయతా, అనుబంధాల
ఆదర్శాల హరిణాలు
ఆమడదూరం పరుగులెత్తి
అందీ, అందకుండా
అంతర్థానమైపోతున్నాయి

నగిషీ మాటల
నయగారాలు,
నయవంచనా, నటనాధురీణతలు
నలుగురిలో నమ్మకంగా నాటుకపోతూ
ననె్నవరేమి చేయగలరనే ధీమాతో ఉన్నాయి

మాటమీద నిలబడ్డం అనేది
మరీ పాతపద్ధతై పోయి
మనుగడే కష్టంగా
నల్లపూసైపోయి, నగుబాటు పాలౌతూ వుంది
మనీ బాలెన్సులూ... మందీ మార్బలాలు
మనిషి మ్యానరిజానికి
మచ్చుతునకలై పోతున్నాయి
మహోన్నత శిఖరాలెక్కుతున్నాయి...
- పచ్చా పెంచలయ్య
చరవాణి : 99128 22341

దారులు వేయాలి
నేటి యాంత్రిక జీవిత చక్రానికి
కరెన్సీయే కేంద్ర బిందువు
రేపటి కుటుంబ అనుబంధానికి
ఆస్తిపాస్తులే సాంద్రబంధువు..

విలువలకు నిర్వచనాలు జారి
మానవత్వం అంటరానిదయ్యింది
ఆదాయాలకు కొత్త అర్ధాలు చేరి
సంప్రదాయం కంటకమయ్యింది..
వెండితెర బుల్లితెరలపై
కురుస్తున్న భావకాలుష్యాలు
కళ్లకు పొరలు కప్పుతున్నాయ్
అపార్ధాల జడలు విప్పుతున్నాయ్...

వావివరుసలు తీరుమారి
కాంతాకనకాల మోహం మీరి
మనసులు చిక్కుముళ్లవుతున్నాయ్
మన ఇళ్లు ముళ్లపొదలవుతున్నాయ్..

మనిషి మనిషిగా మిగలనప్పుడు
‘రోబోట్’లే బాటలు చూపాల్సొస్తుంది
సంస్కృతి వికృతంగా తిరిగేటప్పుడు
జాతివీరులే దారులు వేయాల్సొస్తుంది..
- బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, నెల్లూరు
చరవాణి : 988541939

మన ఆంధ్రకేసరి జేజేలు.. (కవిత)
ఆంధ్రకేసరీ.. మనజాతికే మగసరి
ఆంధ్రకేసరీ! నీకెవ్వరు సరి
ప్రకాశవంత స్ఫూర్తిదాయక రూపం మీది మరి
సత్య, ధర్మ, పరాక్రమ సుగుణాలసిరి
ధైర్యసాహసాల, నిష్కల్మష దేశభక్తుల ఝరి
భరతమాత దాస్యశృంఖలాలు తెగవేసిన తెగువరి
మన టంగుటూరి

తెల్లవారి దుర్మార్గములకు అదరక బెదరక
పల్లవించిన ధైర్యసాహసాల కిరీటి.
సైమన్ కమిషన్‌వారినెల్ల‘‘రండిరా’’ యిదె
కాల్చుకొండిరా’’యని నిండు గుండెలిచ్చిన
మహోద్దండ మూర్తి
డొల్ల ధైర్యము గల తెల్లవారు చల్లగా జారుకొనిరి
ఎల్లజనులు మిమ్ము ఆంధ్రకేసరి కేసరికే సరియని
పొగడిరి
తెలుగుజాతియంతము మిమ్ము గుండెల్లో దేవళముగ నిలిపిరి..
భరతమాతకు స్వేచ్ఛావాయువులు
ప్రసాదించుటయందు
చెరసాలలకు ముందు పలు ఉద్యమాలకు ముందు
పౌరుష జ్వాలలు రగిలించు ఉపన్యాసాలకు ముందు
కరకు బ్రిటీషువారి నెల్ల నెదిరించిన
ఆంధ్రతేజము మీరు..

ఐదేళ్లకే కోట్లాది ఆస్తులను సంపాదించుచు
రోజుకో పార్టీ నీడన నిలబడుతూ,
పూటకో సిద్ధాంతం కల్పిస్తూ
ఆకర్షక పథకాలతో ఓటును, నోటును ఆర్జించుచూ
పదవినే పరమార్థముగ, తనవారే
కుంభకోణాలు, స్కాములు
చూసి చూడనట్లుగ, ప్రజలసొమ్ము
దోచేసే ఈ నాయకులకు
నీ జీవితచరిత్ర ఒక న్యాయశాస్త్ర నిఘంటువు కావాలి..

ఓ మహనీయా! ఓ త్యాగపునీతా! ఓ ధీరోదాత్తా!
ఈ నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించు!
దేశమంటే దోచుకోవటం కాదని
దేశమంటే తాడిత, పీడిత, జనోద్ధరణమని
రాష్టమ్రంటే సంకుల సమరాలు చేసే గోదా కాదని
రాష్టమ్రంటే సుజల, సఫల, మలయజశీతల స్వర్గమని
పదవియంటే పదిరాళ్లు సంపాదించే సింహాసనం కాదని
పదికాలాల పాటు గుర్తుంచుకొనే మహోన్నత పీఠమని
ప్రకాశమాన జీవితమును, వివేకమును
ప్రసాదించు కేసరీ!
దివి నుండి భువి ప్రజలను ఆశీస్సులందించుచూ..
నీ జీవితం, నీ నడత మా జాతికే ‘మగసిరి’యని
తలంపులనియ్..
వందేమాతరమ్, మా తెలుగుతల్లికి
వందనమనెడి జ్ఞానమివ్వు..!
- లక్కరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9849166951