భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదిగో మీరంతా రేపల్లెలో ఉన్నప్పుడు వచ్చాను అంటూ కూర్చున్నాడు డేంగలే వారి దగ్గర.
‘మీకి విషయం తెలుసా!’ అడిగాడు డేంగలే.
‘ఏ విషయం’ అందరూ ముక్తకంఠంతో అడిగారు.
‘అదే నేను ఈమధ్య ఓ రాత్రి అనుకోకుండా బయటకు వచ్చాను. నాకు బాబా కనిపించారు. కాని బాబాను నేను చూస్తున్నాను. బాబా నన్ను చూడటంలేదు. అరబ్బీ, ఫ్రాన్స్, పార్శీ, తెలుగు ఏవేవో భాషలు ఎవరితోనో మాట్లాడుతున్నారు. వారంతా ఎదురుగా ఉన్నట్టు మాట్లడుతూ ఉన్నారు. వారంతా వెళ్లుతూ బాబా వీడ్కోలు పలికినట్టుగా సరే సరే అని మన భాషలో అన్నారు. నేను అప్పుడు దగ్గరకు వెళ్లాను. ఇదంతా ఏమీ జరగనట్టుగా బాబా నాతో డేంగలే! ఈ రాత్రిపూట ఎందుకు తిరుగుతున్నావు వెళ్లు హాయిగా నిద్రపో.. వెళ్లు ఇంటికి వెళ్లు అని అన్నారు. అంతే నేను మంత్రం వేసినట్టుగా బాబాను ఏమీ అడగకుండానే ఇంటికి వెళ్లిపోయాను..
ఈ సంగతే మరచిపోయాను. కాని మీరంతా ఇపుడు మాట్లాడుతుంటే నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది అన్నాడు డేంగలే.
ఇలా వారంతా బాబా గురించి తలో మాట చెప్పుకుంటూనే ఉన్నారు.
అంతలో భిక్ష తీసుకోవడానికి బాబా లేచి తన జోలెను సర్దుకుంటున్నారు. అదుగో సమయం అయినట్టు ఉంది. బాబా భిక్షకు వెళ్లుతున్నారు. పదండి మనమూ వెళ్దాం అంటూ అందరూ ఒక్కసారిగా లేచారు.
***
కుశాబావు గబగబా ఎక్కడనుంచో వస్తున్నట్లు ఉన్నాడు. ఎంతో ఆందోళనతో ఆయన ముఖం ఉంది. సాయి నిర్మలంగా గోడకు ఆనుకుని కూర్చుని ఉన్నాడు. మహిల్సాపతి, హేమాదిపంతు, ఇంకా కొందరు కూర్చుని ఉన్నారు. అందరి మనసులోను ఇదే విషయం ఉన్నట్లు ఉంది. ఏమిటి ఈ కుశాబావు ఎప్పుడూ ఆందోళనతో ఉంటుంటాడు. అసలు ఏ సమస్యలు ఏమి ఉన్నాయో ఎన్ని ఉన్నాయో తెలియదు అనుకున్నాడు డేంగల్.
‘బాబా అసలు గురుచరిత్ర చదివితే అన్ని కష్టాలూ దూరమవుతాయి కదా. నేను చెబుతుంటే వారు వినలేదు. పైగా అందులో ఏమన్నా కష్టాలు తీరే మార్గం ఉందా? కష్టాలు పోవడానికి అదంతా మీ మూఢ నమ్మకం’ అని అంటున్నారు. మీరే చెప్పండి కష్టాలు పోవాలన్నా సుఖాలు రావాలన్నా అసలు ఈ లోకంలో ఎలా మెసలాలన్నా, త్రిమూర్తులకన్నా గొప్పవాడు గురువే కదా! ఆయనకు మనం ఏం కావాలో చెప్పాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? ఆయనే సర్వం అయినపుడు ఆయన మన చేత ఏమి చేయిస్తాడో అదే కదా మనం చేస్తాం. మీరేమంటారు చెప్పండి. నా సందేహాలను తీర్చే శక్తి మీకే ఉంది బాబా’’ అన్నాడు కుశాబావు.
‘ఆఁ అంతా బాగుంది. కాని నీకు ఒకసారి ఉన్న బుద్ధి మరోసారి ఎందుకు ఉండదు. మనమందరం బుద్ధిజీవులం కదా. అందుకే పుర్రెకో బుద్ధి అన్నారు’ అన్నాడు సాయి.
‘బాబా నేను ఏమి అడిగాను మీరేమి చెబుతున్నారు. ఎప్పుడూ మీరు ఇంతే. ఏదో అడుగుతాను, మీరు మరేదో చేస్తారు. నాకు ఏమీ అర్థం కదా. నేనేమన్నా మీలా తెలివిగలవాణ్ణి అనుకున్నారా? నాకు ఏమి కావాలో నేను స్పష్టంగా చెప్పాను. అట్లానే నాకు కావాల్సిన దానిని కూడా స్పష్టంగా చెప్పండి. ఈ డొంక తిరుగుళ్లు నాకు వద్దు’’ చాలా కఠినంగా కోపంగా అన్నాడు కుశాభావు.
అంతలో వయస్సులో పెద్దయిన తాత్యా ‘‘కుశాభావు నీవు ముందు ఊపిరి తీసుకో! కాస్త కుదుటపడు. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం బాబా చూపుతారు’’ అన్నాడు.
కూచోను అంటే మరి మేమేం చేస్తాం.. బాబా ఏం చేస్తారు. అన్నింటికీ పరిగెత్తుతాను అంటే ఎలా? మహిల్సాపతి కుశాభావును కూర్చోపెట్టడానికి
అన్నాడు.
అంతలో పార్వతీబాయి వచ్చింది.
‘‘బాబా! నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు ఎంత లేదన్నా నాలుగు రూపాయలు కావాలి. నేను నా కుమారుల ఆకలి వారి కిష్టమైన పదార్థాలతో తీర్చాలంటే ఈ డబ్బు కావాలి. నాకు ఏ దారీ దొరకడంలేదు. మీరే నాకు ఆ డబ్బును ఇప్పించండి’’ అంది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743