భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయనకు కావాల్సిన నీటిని తెచ్చిపెట్టేవాడిని. అగ్నిని రాజేసేవాడిని. అంతే నాకు మాత్రం ఆయన ఏ పని చెప్పేవారు కాదు. కాని ఆయన దేహాన్ని మరిచి ఎన్నో యేండ్లు ధ్యనస్థులై ఉండేవారు. అట్లాంటపుడు ఆయన దేహావసరాలను నేను చూచేవాడిని. నాకు ఏదైనా మంత్రమేదైనా ఉపదేశిస్తారేమో అనుకునేవాడిని. కాని నాకెప్పుడూ ఆయన మంత్రమంటూ చెప్పలేదు. కాని ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు నీ దగ్గరనుంచి రెండు కావాలి అన్నారు. ఏమిటి ఆ రెండు అని నేను కాస్త గాబరా పడ్డాను. అంతలోనే మా గురువుగారు-
‘‘నాయనా ఇపుడు నేను కోరినవి నీ దగ్గర సమృద్దిగా ఉన్నాయి. కాని అవి ఎన్నటికీ చేజారనీయకు’’ అన్నాడు కాని నా మట్టిబుర్రకు ఏమీ తోచలేదు.
నేను వెర్రి మొహం వేసుకుని చూస్తున్నాను.
అపుడు మా గురువుగారే నా దగ్గరికి వచ్చి నా తల నెమిరి ‘‘పిచ్చివాడా! నాక్కావాల్సింది నీ దగ్గర ఉన్నవి శ్రద్ధ, ఓరిమి అనేవే. ఈ రెండు ఉన్నంతకాలమూ నా అనుగ్రహం నీపై ఉంటూనే ఉంటుంది. నీవు నలుగురికి ఉపయోగపడే పనులు చేయి. ఇతరుల సంతోషాన్ని నీ సంతోషంగా భావించు. ఇతరుల దుఃఖాన్ని నీ దుఃఖంగా స్వీకరించు. అదే నాకు నీవిచ్చే రెండు అన్నారు. అంతే నా మనస్సంతా ఆనందంగా మారిపోయింది.
మా గురువుగారి దగ్గర నాతోపాటు మరో ముగ్గురు శిష్యులు ఉండేవారు. వారు నేను కలిసి ఒక రోజు పురాణ గ్రంథ చర్చ చేస్తున్నాము. అందులో ఒకరు అన్నారు. ‘ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. కాని ఇతరులపై ఆధారపడకూడదు’. దీనినే భగవద్గీత చెపుతోంది అన్నాడు.
మరొకడు ‘సర్వసాక్షియైన ఆత్మయే సత్యం. ఆ సత్యాన్ని గుర్తించి మనస్సును నిగ్రహించినవాడే ధన్యుడు’ అన్నాడు.
ఇంకొకడు ‘ఈ కనిపించేదంతా అసత్యం. నిరాకారమైందే సత్యం. దీనినే వివేకంతో గుర్తిస్తూ ఉండడమే ముక్తికి మార్గం’’ అన్నాడు.
అప్పుడు నేను మాత్రం ‘‘కేవలం గ్రంథ పాండిత్యం అంతా వ్యర్థమే. స్వధర్మాన్ని ఆచరిస్తూ సద్గురువే సర్వవ్యాపియైన దైవమన్న భావాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటూ సర్వస్వాన్ని గురువుకు అర్పించి నిమిత్తమాత్రుడిని నేను. సర్వమూ గురువే అని నమ్మితే చాలు’’ అన్నాను.
ఇలా మేము చర్చించుకుని గురువుగారి కోసం సమిధలు తేవడానికి అడివికి వెళ్లాము. అడవిలోకి వెళ్లగానే మాకు ఒక కూలివాడు కనిపించాడు. వాడు మమ్మల్ని ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగాడు. దానికి మాకు సమాధానం ఇవ్వాలని అనిపించలేదు. దానితో మేము వౌనంగా ముందుకు నడిచాము. అంతే ఆ కూలివాడు తిరిగి మమ్మల్ని ఆపి సరే మీరు ఎక్కడికి పోతున్నారో నాకు చెప్పనక్కర్లేదు. కాని ఇదంతా కీకారణ్యం కనుక మీరు ఒక మార్గదర్శిని తీసుకొని పోండి లేకపోతే మీరంతా తప్పిపోయే ప్రమాదం ఉంది అని చెప్పాడు.
దానికి మేము బదులివ్వక ముందుకు సాగిపోయాం.
ఆ కూలివాడు మమ్మల్ని వదిలిపోకుండా తిరిగి మా దగ్గరకు వచ్చి ‘అయ్యా! సరే మీ ఇష్టమొచ్చినట్లు చేయండి. కాని ముందు ఈ మార్గం అతికష్టంగా ఉండి తినడానికి తాగడానికి అక్కడ ఏమీ దొరకవు. అందుకే నేనిచ్చే ఈ రొట్టెలు తిని మంచినీరు తాగి వెళ్లండి’’ అని చెప్పాడు.
మేము కాదని ముందుకు నడిచాము. అలా చాలాసేపు నడుస్తూనే ఉన్నాం కాని ఎంత నడిచినా మాకు దారి డొంకా ఏమీ తెలియలేదు. నా మనసు, మేము ఆ కూలివాని మాట విని వుంటే బాగుండేది కదా అనిపించింది. వారు కూడా ఆ స్థితిలోనే ఉన్నట్లు ఉన్నారు. మేమంతా కలిసి తిరిగి తిరిగి చివరకు మేము బయలుదేరిన చోటుకువచ్చాము. అక్కడే ఇంతకుముందు మాకు రొట్టె నీరు ఇస్తానన్న కూలివాడు కూర్చుని మాకు కనిపించాడు.
ఆయన మమ్మల్ని ఏమీ అనలేదు. కాని మాకు మాత్రం ఎంతో దాహం, ఆకలి వేసాయి. మేమే వెళ్లి కాసిని నీళ్లు ఇవ్వమని దీనంగా అడిగాము. దానికి ఆయన చిరునవ్వు నవ్వి తీసుకోండి అన్నాడు. మేమంతా ఆ చల్లనీరు తాగాము. మాకు కాస్త సేదతీరినట్లు అయ్యి అక్కడే కూర్చున్నాము. అప్పుడు మేము మీరు చెప్పినట్లు వినలేదు. అందుకేనేమో మాకు దారి కనిపించలేదు. అసలు మేము వెళ్లాలనుకున్న దారి ఏదో కూడా గుర్తించలేకపోయాము అని నేను చెప్పాను.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743