భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన చిరునవ్వు నవ్వి నాయనలారా మీరు మీకై తెలిసి తెలియక ప్రయత్నం చేస్తే మాలాంటివారు కనిపించరు. అందుకే తెలిసినవారిని దగ్గర ఉంచుకుని కావాల్సిన చోటుకు వెళితే మీరు వెళ్ళే మార్గమూ, మీరు కావాల్సింది సులభంగా పొందుతారు కదా! అన్నాడు. దానికి మేమంతా తలకాయలు ఆడించాము.
ఏ పనికైనా ఓర్పు, క్షమ, శాంతి కావాలి సుమా అని ఆయన అన్నారు. ఆయనే నాకు గురువుగారిగా కనిపించారు.
నేను ఆయన ఇచ్చిన రొట్టెలు తిని మంచినీరు తాగాను. కాని నా తోడి స్నేహితులంతా కాసేపు కూర్చుని ఈ కూలివాని దగ్గర రొట్టెలు తినడమేమిటి? మంచినీరైతే ఫర్వాలేదు కాని అన్నారు. నేను వారికి నచ్చచెప్పపోయాను. వారు నా మాట వినకుండా వెళ్లిపోయారు. కాసేపటికి నా ముందుకు నా గురువుగారు వచ్చారు. వీరు ఎక్కడినుంచి వచ్చారని నేను ఆశ్చర్యపోతూ చూశాను. అప్పుడు గురువుగారు, ‘‘ఏమిటి మీ చర్చల సారాంశం’’ అన్నారు.
నేను మేము అనుకున్నది చేసింది చెప్పాం, అనుభవించిందీ కూడా చెప్పాను.
అప్పుడు నేను నిన్ను గమ్యం చేరుస్తాను. మరి నీకు నాపై విశ్వాసము నమ్మకం కలిగి ఉంటే నాతో కూడా నడువు. నీకు మార్గాయాసం లేకుండా గమ్యస్థానానికి నేను చేరుస్తాను. నీవు నిర్భయంగా ఉండు అని చెప్పారు. నాకెంతో ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగింది. వెంటనే నేను ఆయనకు నమస్కరించి నేను పూర్తిగా శరణాగతుడిని అయాను. నాకు ఎటువంటి శంకలు లేవు. మీరే నా దిక్కు. నా దిక్కు ఏదో ఎక్కడ ఉందో మీరే చూపించగలరు. నేను కేవలం ఒక బొమ్మను మాత్రమే. ఈ బొమ్మ మీరు ఆడించినట్టల్లా ఆడుతుంది అన్నాను.
దానికాయన ఎంతో సంతోషించాడు. నా దగ్గరకు వచ్చి నా బుగ్గలు నిమిరి అభీష్ట సిద్ధిరస్తు అని దీవించారు.
తరువాత ఆయనే నన్ను దగ్గరకు రమ్మని పిలిచి నన్ను ఒక చెట్టు కొమ్మకు వేలాడదీశారు. అదీ తలకిందులుగా. ఆ తలకు ఓ బావిలో నీటికి మూడు అడుగుల ఎత్తున ఉంది. అంతే. అలా నన్ను తలకిందులుగా వేలాడదీసి ఆయన ఎటో వెళ్లిపోయారు. నాకు మొదట్లో భయమేసింది. కాని అంతా గురువుగారున్నారు కదా. వారే అన్నింటికీ కారణం అని చెప్పారుకదా. మరి ఇపుడు కూడా నాకేదైనా అయితే అది వారిష్టం. నాకు పండు దొరికినా విత్తనం దొరికినా అదంతా ఆయన చలువే అనుకున్నాను.
అంతే నాలో ఎక్కడలేని ఉత్సాహం వేసింది. అప్పుడు చుట్టూర ఉన్న ప్రకృతి అంతా పులకించినట్లుగా జలజలా పూవులు రాల్చాయి. కాసేపటికి మా గురువుగారు దగ్గరకు వచ్చారు. నన్ను చూసి ఎంతో సంతోషించారు. ఇక ఎన్నటికీ నువ్వు నా శిష్యుడివే అన్నారు. అంతే నాకెప్పుడూ ఆయన ముఖారవిందానే్న చూస్తూ ఉండాలని అనిపించేది. అంతేకాని ఎప్పుడూ నేను ఆయన్ను ఏదీ కోరలేదు. ఆయన నాకు ఇవ్వలేదు. కాని ఎప్పుడూ నేను మా గురువుగారి ముఖంమీదనే నా దృష్టిని నిలిపి ఉంటాను. ఇప్పుడు కూడ మా గురువుగారినే నేను ధ్యానిస్తుంటాను అన్నాడు బాబా.
ఇది అంతా వింటున్న నానాకు శ్రీకృష్ణుడు సాందీపని గురువు దగ్గర విద్య నేర్చుకోవడమూ, శ్రీరాముడు వశిష్ఠుల వారి దగ్గర విద్య అభ్యసించటమూ గుర్తుచేసుకున్నారు. శ్రేష్ఠులు ఏది చేస్తే అదే సామాన్యులు కూడా చేస్తారు కనుక ఈ సద్గురువు అయ్యి ఉండి కూడా నాకు గురువుగారు ఉన్నారని తనకు ఎన్నో పరీక్షలు పెట్టి శిష్యునిగా అంగీకరించారని చెబుతున్నారు. అంటే అందరినీ గురువుగారి ప్రేమ పొందడానికి మీకై మీరు ప్రయత్నించమని చెప్పక చెపుతున్నారు కదా అనిపించింది.
నిజమే!
బాబా ఏదీ సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కూడా అందరికీ ఓ సద్గురువు ఉండాలని ఆయనే వీరిని ఈ లౌకిక ప్రపంచంలో ఏది కావాలన్నా ఇస్తారని, అదేకాక పరలోకంలో కూడా గురువుగారే తోడు ఉంటారని భగవంతుని సాయుజ్యానికి దారి చూపేది గురువే అని ఎంత చక్కగా చెప్పారో కదా అనుకోకుండా ఉండలేకపోయాడు నానా. అదే సంగతి అక్కడ ఉన్న అందరికీ కూడా చెప్పాడు. బాబా నానా చెప్పేదంతా విని చిరునవ్వు నవ్వారు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743