భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను నమ్మిన వాళ్లు ఎంత దూరంలో ఉన్నా సరే నేను కూర్చున్న చోటు నుంచి వారిని కాపాడగలను. వాళ్లు కోరింది నేను ఇవ్వగలను. కాని వారిలో ఓరిమి తప్పక ఉండి తీరాలి అని ఉన్నట్టు ఉండి గంభీరంగా చెప్పారు.
***
అది వర్షాకాలం ఉన్నట్టు ఉండి ఆకాశమంతా మబ్బులు కమ్మి వర్షం ఆరంభమైంది. కుండపోతగా వర్షం కురువసాగింది. అది రాత్రి సమయం. ఎవరూ బయటకు రాలేదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
రాత్రంతా కురిసిన వాన ఇంకా వెలవకుండా పగలు అంతా వాన కురుస్తూనే ఉంది. ఊరంతా నీటితో నిండిపోయింది. అందరి మనస్సులోను
అయ్యో బాబా ఆ వేప చెట్టు కిందే ఉండిపోయారేమో..

వాన ఇంతగా పడుతోంది. బాబా ఆ మసీదులోకి అయినా వెళ్లారా లేదా అని ఒకటే మదనపడసాగారు. కాని బయటకు వెళ్లి చూడటానికి లేకుండా నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది. ఆ మర్నాటికి వాన తెరిపి ఇచ్చింది. ఎవరికివారు పరుగెత్తి బాబాను చూడడానికి వెళ్లారు.
అక్కడ నిశ్చలంగా నిర్మలంగా ఏకాగ్రతతో దీక్షగా కళ్లు మూసుకుని బాబా కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ నీరు. ఆ నీటికి ఏ మాత్రం చలించకుండా ధ్యానంలోనే ఉండిపోయారు. ఆ పరిస్థితి చూచి వారికి కడుపు తరుక్కుపోయింది. కనుల నీరు కారిపోయింది. వారు అందరూ ముక్త కంఠంతో బాబా అని అరిచారు. బాబా మాత్రం నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. కన్నులు విప్పి వీరిని చూడలేదు. అందరూ బలవంతంగా బాబాను జబ్బలు పట్టుకుని దగ్గరగా ఉన్న మసీదులోకి తీసుకుని వెళ్లి కూర్చోబెట్టారు. అపుడు కళ్లు తెరిచారు బాబా.
అందరూ ఓపిక నశించినట్టు బాబా ఎంతసేపు పిలిచినా పలుకవేమి? మమ్మల్నందరినీ నీవే కాపాడుతావని మేమంతా నమ్ముతుంటే నీవేమి నిమ్మకు నీరెత్తినట్టు హాయిగా ఆ వర్షంలోనే కూర్చుని ఉన్నావు. మాకు తెలిసి రెండు రోజుల నుంచి ఇలాగే కూర్చుని ఉన్నావా? నీకు ఆకలి దాహం ఏమీ వేయలేదా? అయినా ఈ వర్షపు నీటిలో కూర్చుని ఉంటే నీకు జలుబు, జ్వరం వస్తాయేమో కదా అంటూ పార్వతి గబగబా ఓ తుండుతో బాబా పొడగాటి జుట్టును విప్పి తుడుస్తూ ఉంది.
‘అయ్యో అయ్యో ఎంతగా నానిపోయారో మీరు. మీ గురించి మీరే పట్టించుకోకుంటే ఎలా బాబా’ ఆర్తిగా అడిగింది పార్వతి.
దానికి చిరునవ్వే సమాధానం అయింది. అదుగో ఆ నవ్వే మమ్మల్ని రాత్రి అంతా నిద్రపోకుండా చేసింది. నీవు ఎలా ఉన్నావో ఎక్కడ ఉన్నావో తిన్నావో తినలేదో మాకు ఒకటే ఆవేదనగా ఉండింది బాబా అంది లక్ష్మీబాయి.
అమ్మా మీకంతా ఎందుకు శ్రమ. నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు బాబా.
అవును బాబా, నీవు బాగానే ఉంటావు. కొండలు గుట్టలు నదులు సముద్రాలు పర్వతాలు అన్నీ నీకు సాధారణమే. పగలు రాత్రి ఎప్పుడైనా ఎక్కడికైనా పోతావు. అలా పోతూ పోతూ అకలిదప్పులు కూడా మరిచిపోతావు. అందుకే నేను నిన్నటినుంచి నీ కడుపు ఎంతగా ఆకలితో రగిలిపోతోందో అని వేడి వేడి జొన్న రొట్టెలు ఉల్లికారం తెచ్చాను. రా బాబా ఇవి తిను. అప్పుడు మాకు కాస్త హాయిగా ఉంటుంది అంటూనే రొట్టెలు తుంచి కారంలో అద్ది బాబా నోటికి అందించింది బయాజీబాయి.
బాబా కనుల నీరు నింపుకుంటూ ఆ అమ్మ పెట్టిన రొట్టె ముక్కలు తింటున్నాడు. అక్కడే కూర్చున్న నాకు ఆ బాలకృష్ణునికి యశోదమ్మ వెన్న తినిపించడం నాకు కనిపించింది.
లోకాలను పాలించేవాడు, లోకాలన్నింటిని తన కుక్షిలో పెట్టుకున్నవాడు చిన్నివాడుగా పుట్టి అందరిలో తాను ఒక్కడై కలసిపోయి గోవులను కాచి గోపాలురతో ఆడి పాడి అలసిపోతుంటే అమ్మ యశోదమ్మ నీ కొడుకు మన్ను తింటున్నాడమ్మా అంటూ గోపబాలురులంతా వచ్చి యశోదమ్మకు ఫిర్యాదు చేశారు. అపుడు యశోదమ్మ చిన్నికృష్ణుణ్ణి కోప్పడింది. కొట్టింది.
ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743