డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రి నాతో ఏకీభవించినట్లు చూసింది. ఎంతకీ లోపల నుంచి కబురు రావడంలేదు. ఇక్కడ బయట ప్రతీ క్షణం ఒక యుగంగా అనిపిస్తోంది. ఎంత సేపు చూసినా గడియారం కదలడంలేదనిపిస్తోంది.
చటుక్కున నాకు మామ్మ గుర్తుకు వచ్చింది ఎందుకనో. మామ్మ పురిటిగది ముందు కూర్చుని స్తోత్రాలు చదువుతూ కూర్చునేది. ఇంట్లో ఎవరు ఎంత హడావిడి పడుతున్నా సరే.
‘‘ఎలా చదవగలుగుతున్నావు మామ్మా’’ అంటే చిరునవ్వు నవ్వేది. ఆ భగవంతుడినే అమ్మా ప్రతి తల్లిని రక్షించేది. ఆ భగవంతుడే భూమిమీదపడ్డ ప్రతి ప్రాణికి తొలి ఊపిరి తీసుకోవడం నేర్పేది. ఈ డాక్టర్లంతా కేవలం ధైర్యం చెబుతారంతే.
అప్పుడు తోచింది మామ్మ ఎందుకు గుర్తుకు వచ్చిందో గబగబా హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో చిన్న పుస్తకం తీశాను. గదిలో చివరగా వున్న కుర్చీలో కూర్చుని మనసులో నమస్కరించి స్తోత్రాలు చదవడం మొదలుపెట్టాను. దాదాపు సగం పుస్తకం అయ్యేటప్పటికి దిగజారిపోయిన ధైర్యం తిరిగి వస్తోంది. మధ్య మధ్యలో సావిత్రి లోపలకు వెళ్లి వస్తోంది. వౌళి పూర్తిగా తేజా పక్కనే వున్నాడు.
తెలతెలవారుతుంటే నా స్తోత్రం పఠనం పూర్తి అవుతూ వుంటే బాసినెట్లో తీసుకుంటూ వౌళి బయటకు వచ్చాడు. వాడి మొహం వెలిగిపోతోంది అలసటనంతా కప్పేస్తూ.
మేముగ్గురం గబగబా ఒక అడుగు వేశాం. గులాబి రంగు బ్లాంకెట్‌లో పూర్తిగా చుట్టేసిన పెద్ద కలువ పువ్వులా వుంది. కళ్ళు తెరచుకునేవున్నాయి. అప్పుడే లోకంని చూస్తోంది. నల్లటి జుట్టు, నుదుట అంతా అతుక్కుపోయి వుంది తడితడిగా.
నేను, సావిత్రి ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. అప్రయత్నంగా కళ్ళల్లోంచి నీరు జారి పడింది. ఆనంద బాష్పాలో, తేజా పడుతున్న బాధ తగ్గిందన్న రిలీఫో.. నర్సు మా ముందు నుంచే పిల్లను తీసుకువెళ్లిపోయింది శుభ్రం చేయడానికి.
రెండు చేతులు జోడించి మనఃస్ఫూర్తిగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
సావిత్రి రెండు చేతులు పట్టుకుని కంగ్రాట్యులేషన్స్ అమ్మమ్మగారు అన్నాను చిరునవ్వుతో!
మీకు కూడా మామ్మగారూ అంది.
ఆ క్షణంలో అనుభవించిన రిలీఫ్, ఆనందం నేను చెప్పుకోలేను. అది అనుభవించాల్సిందే! అప్పుడే భూమి మీదకు వచ్చిన సరికొత్త శిశువు రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. మరో తరానికి నాంది. ‘నా’ అన్న శబ్దానికి పూర్తి అర్థం.
‘‘తేజా ఎలా వుంది వౌళి అన్నాను’’.
ఇంకా మత్తుగానే వుందమ్మా. చివరిలో కొంచెం మత్తు ఇచ్చారు. చాలా బాగా హ్యాండిల్ చేసింది అన్నారు డాక్టరు అన్నాడు.
వాడు ఇంకా ఒక రకపు ఎమేజ్‌మెంట్‌లో వున్నాడు. వాడికి అసలు యింకా నమ్మబుద్ధి అవడంలేదు.
‘‘వాట్ యాన్ ఎమేజింగ్ థింగ్’’ అన్నాడు. మూర్తిగారు దగ్గరగా వచ్చి వౌళి భుజం చుట్టూ చేయి వేసి వూపుతూ ‘కాంగ్రాచ్యులేషన్స్’ అన్నాడు.
‘‘మీ ఇంటికి మరో లక్ష్మి వచ్చింది’’ అన్నాడు. మరో కొద్ది నిముషాలలో తేజాని, పాపాయిని వేరే గదిలోకి మార్చేశారు.
తేజా ఇంకా బాగా మగతగానే వుంది. పాపాయి మాత్రం హాయిగా నిద్రపోతోంది. ఒళ్లంతా బ్లాంకెట్‌తో గట్టిగా చుట్టేశారు. తలకు గులాబి రంగు టోపీ పెట్టారు. టోపీలోంచి తొంగిచూస్తోంది నల్లటి జుట్టు.
నేనింతవరకూ ఏ శిశువుని చూడలేదు ఇంత జుట్టుతో అంది, అమెరికన్ నర్సు, బేబిని సరిగ్గా పడుకోబెడుతూ!
అందరం అక్కడే కూచున్నాం. తేజాకి మెలుకవ వచ్చేవరకు వెళ్లడం ఇష్టంలేదు. అందరూ శారీరకంగా అలసిపోయారు. కాని మానసికంగా చాలా ఉత్తేజంగా వుంది.
తేజావంక, పాపాయి వంక మార్చి మార్చి చూస్తూనే ఉన్నాను. ఎందుకో, అరగంట వరకు చాలా టెన్షను అనుభవించిన మనసు చాలా ప్రశాంతంగా వుంది. వాళ్లిద్దరి వంకా చూస్తూంటే చాలా సంతోషమనిపించింది. వౌళి జీవితంలోకి పూర్తిగా, పరిపూర్ణత చేకూర్చారు. అంతులేని సంతోషాన్ని కలిగించారు. నా కొడుకు సంతోషానికి కారకులయిన వారిద్దరూ నాకు చాలా ప్రియమయిన వాళ్ళు. ఎంతో తృప్తి కలిగింది.
తొలిసారిగా, ఆ పాపాయిని ఎత్తుకుంటూంటే నా చేతులు జలదరించాయి. వళ్లంతా గగుర్పొడిచింది. కళ్లు చెమ్మగిల్లాయి. ఇంత ఎర్రగా వున్న పిల్లని మునుపెన్నడూ నేను చూడలేదనుకున్నాను. తెరచి చూస్తున్న కళ్లతో, చిన్న బొమ్మలా వుంది. నా కళ్లకు ఎంతో అపురూపంగా కనిపించింది. అప్రయత్నంగా నా నోటినుండి సన్నగా జోలపాట వచ్చేసింది. నేను పాడాలని కూడా అనుకోలేదు. దాని స్పర్శ తగలంగానే ఏమయిందో నాకే తెలియదు. నా జీవితం మరో కొత్త అనుబంధం. బలంగా శ్వాస వదిలాను.
నా చేతులలలోంచి పాపాయిని తీసుకుని సావిత్రి మూర్తిగారికి దగ్గరగా తీసుకువెళ్లి చూపింది. ఒకసారి ఆయన భార్య మొహంలోకి తరచి చూస్తూ, ఏదో మెల్లిగా అంటున్నాడు. ఆవిడ కూడా నవ్వుతూ అంగీకరిస్తోంది.
వారికి తొలి మనుమరాలు. మొట్టమొదటి మనుమరాలి ఆగమనం ఎంత ఆనందకరమయిన విషయం. అది అలా ఇద్దరు పెంచుకుని ఆనందిస్తూ వుంటే ఎంత సంతృప్తికరమైన అనుభవం.
ఒక ఆనందాన్ని, తనతో సమంగా అనుభవించేవారితో పంచుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి! అలాంటి అనుభూతులు నాకు పూర్తిగా పరాయివి.
రుూ దేశపు హాస్పిటల్‌లో ఇంటికి తీసుకువెళ్ళేలోపే పేరు చెప్పాలి. నర్సు ఫారమ్, పెన్ వౌళికి అందించి వెళ్లిపోయింది.
పేరు రాసి ఇవ్వాలి వాళ్లకు అన్నాడు వౌళి తేజా వంక చూస్తూ.
‘‘రాయి. ఏరుకున్నావుగా పేరు. పొద్దునే్న పుట్టింది’’ అంది తేజా!
‘‘నీకు వచ్చిన వేరే పేర్లు ఏమీ లేవా’’ అన్నాడు.
తల వూగించింది తేజా లేనట్లు. సావిత్రి, మూర్తిగారు ఎదురుచూస్తున్నారు ఏం పేరు చెప్తారా అని.
వౌళి ‘ఉష’ అన్నాడు.
నేను విడమర్చి చెప్పాను సావిత్రితో- వౌళి, తేజా సంభాషణ. మూర్తిగారు ఫక్కున నవ్వారు.
సావిత్రి మాత్రం తేజా మరో నాలుగు గంటలు కష్టపడితే పడింది. తెల్లవారేందుకు లేకపోతే ‘నిశాచరి’ అని పిలిచేవారో ఏమిటో అంది నవ్వుతూ!
వౌళి ఉష పేరు ఫారమ్‌మీద రాస్తూ అడిగాడు. ఇంతకీ అబ్బాయి పుడితే- ఏం పేరు పెట్టేదానివో నాకు చెప్పనే లేదు అన్నాడు.
‘‘అబ్బాయి పుట్టలేదుగా. పుట్టినపుడు చెప్తాను’’ అంది తేజ స్పోర్టివ్‌గా.
‘‘వాట్’’ అన్నాడు వౌళి నెత్తిన పిడుగుపడ్డట్లు, ఇంత శ్రమ మళ్లీనా, నెవర్’’ అన్నాడు నిశ్చయంగా.
‘‘బేబి పుట్టడం ఇంత కష్టతరమైన విషయం అని నాకు తెలిసుంటే - ఇందుకు వప్పుకునేవాడిని కాదు’’ అన్నాడు.
‘‘ఉష మొహం చూచి అను ఆ మాట’’ అన్నాను నవ్వుతూ.
వౌళి కూడా చిరునవ్వుతో ఉష వంక చూచాడు. సుదీర్ఘంగా నిట్టూరుస్తూ తల వూగించాడు, ఇది సంభవమా అన్నట్లు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి