భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెన్న మీగడలు పెడితే తినకుండా మన్ను తింటావా అని అరిచింది. ఏది నోరు చూపిస్తావా లేదా అని గదమాయించింది.
ఆ అమాయకురాలైన తల్లికి భయపడినట్లే నటిస్తూ తన నోటిని చూపాడా కృష్ణయ్య. అంతే ఆ నోటిలో సమస్త లోకాలు కనిపించాయి. లోకాలలోని మానవులు, జంతువులు, దేవతలు, మునులు, సాధువులు, సజ్జనులు, పరమ మూర్ఖులు, రాక్షసులు, చెట్లు, పుట్టలు, పర్వతాలు, నదులు, సముద్రాలు ఒక్కటేమిటీ సర్వ సృష్టి ఆ నోటిలో యశోదమ్మకు కనిపించింది. ఆమె నోట మాట రాక అలానే కూర్చుని ఉండిపోయింది. మళ్లీ కృష్ణయ్యనే యశోదమ్మ నోటిని తాకుతూ అమ్మా ఆకలి వేస్తోంది. అందరూ నాపై అబద్ధం చెప్పారమ్మా.. చూడు నా పొట్ట చూడు ఎంత ఆకలి వేస్తోందో అంటే యశోదమ్మ ఇప్పటిదాకా తాను చూసిన ఈశ్వరుణ్ణే తన బాలకుడు అనుకుంది.
అవునురా కన్నా ఎంత నకనకలాడుతోందో నీ పొట్ట, అయ్యో పాపిష్టిదాన్ని, నీకు అన్నం పెట్టకుండా ఏం పనిచేస్తున్నానో ఇంతవరకు. అయ్యో మా నాయనే ఒక్క క్షణం ఆగు అంటూ వంటింట్లోకి పరుగెత్తి తాను వండిపెట్టిన అన్నంలో నెయ్యి ఉప్పు వేసుకుని వచ్చింది. వస్తూ వస్తూ వెన్న కుండల్లోని వెన్నను తెచ్చింది. మా చిట్టి తండ్రీ మా కన్నతండ్రీ రారా నాయనా అంటూ చిన్ని చిన్ని గోరుముద్దలు తినిపించింది. ఎత్తుకుని చంకన కూర్చోబెట్టుకుని చందమామను నక్షత్రాలను చూపుతూ చెట్లపై కోతులను పక్షులను చూపుతూ అలా అలా ఇలా తిరిగి ముద్దులు పెడుతూ అన్నం ముద్దలు పెడుతోంది. కారణా కారణుడు చిన్మయుడు అయిన ఆ పరబ్రహ్మం ఎంతో ముద్దుగా గారాలు కుడుస్తూ అమ్మా అమ్మా మరేమో.. వాడే నన్ను అంటూ తన స్నేహితుల ఆగడాలను చెబుతూ అన్నం తింటున్నాడు.
ఆహా! ఎంతటి భాగ్యమా యశోదమ్మకు అంటూ కన్నులు తెరిచి చూసేసరికి బయాజీబాయి ‘బాబా ఈ రొట్టె ఒక్కటే నీకోసమే చేశాను. అప్పుడే కడుపు నిండిందా. అయినా ఈ ఒక్కటి తిను బాబా నా కోసం తినవా’ అంటూ ఎంతో గోముగా అడుగుతూ కొసరి కొసరి తినిపిస్తుంటే, ఆహా! ఆ యశోదమ్మనే నేటి బయాజీ బాయిగా పుట్టిందేమో.. ఆ కృష్ణయ్యనే నేడు బాబాగా వచ్చారేమో అని కనుల నీరు నింపుకున్నాడు నానా.
***
జానకీదాసు బాబా తన అనుష్టానాలన్నీ పూర్తిచేసుకుని మసీదుకు వచ్చాడు. బాబాను దర్శించుకుని వచ్చి అక్కడే కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి దేవీదాసు బాబా కూడా వచ్చారు.
దేవీదాసుగారు మీ పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయాయా అని పలకరించాడు జానకీదాసు.
ఆ అయినట్లే. ఇదిగో ఈ బాబా దర్శనంతో నా పూజలు నేటికి ముగిసినట్లు అంటూ అక్కడే కూర్చున్నాడు దేవీదాసు.
ఓహో మీరిద్దరూ వచ్చారు కదా, పదండి ముగ్గురం కలిసి అలా కాసేరహటా వరకు వెళ్లివద్దాం అన్నాడు బాబా.
పదండి. ఏముంది మొన్న మమ్మల్ని నీమ్‌గావ్ తీసుకెళ్లి పండ్ల మొక్కలను తెచ్చి ఇక్కడ నాటారు. నేను రహటా వెళ్లి పూల మొక్కలను తెచ్చి నాటుతారా అని అన్నాడు జానకీదాసు.
అంతే కదా అయ్యా! నేడు మనం విత్తనాలు వేస్తే రాబోయే తరం వారు ఆ పంటలను మక్కువగా తింటారు. మనం చేయవలసింది అదే కదా అన్నాడు బాబా. అలా వారు ముగ్గురు వెళ్లి పూల మొక్కలు విత్తనాలు తెచ్చి వేపచెట్టుకు దగ్గరలో నాటుతున్నారు. ఇదంతా చూస్తున్న వామన్ తాత్య గబా గబా వెళ్లి తన కుమ్మరి ఆములోనుంచి రెండు మంచి కుండలు తెచ్చి ‘బాబా ఇవిగో వీటితో నీళ్లు పోయండి ఈ చెట్లకు’ అని చెప్పాడు.
బాబా అక్కడనుంచి పైకి లేచి కుండలు చేతుల్లోకి తీసుకుని ‘‘వామన్ తాత్యా! నాకు రెండు పచ్చి కుండలు తెచ్చివ్వు చాలు, ఇవి నీవు అమ్ముకో, నీకు పనికివస్తాయి’’ అన్నారు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743