ఆటాపోటీ

వీరి తర్వాత ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ టెన్నిస్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ, యువ ఆటగాళ్లకు సైతం గట్టిపోటీనిస్తున్న 36 ఏళ్ల రోజర్ ఫెదరర్, 31 ఏళ్ల రాఫెల్ నాదల్ కెరీర్ త్వరలోనే ముగుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఎంత అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ, ఎల్లకాలం కెరీర్‌ను నెట్టుకురావడం ఎవరికైనా అసాధ్యం. అభిమానులు అంగీకరించినా, లేకున్నా ఇది వాస్తవం. టెన్నిస్ చరిత్రలోనే తమకంటూ ప్రత్యేక అధ్యాయాలను సృష్టించుకున్న ఫెదరర్, నాదల్ రిటైర్మెంట్ అభిమానులను నిరాశ పరచడం ఖాయం. ఈ ఏడాది... లేదా వచ్చే ఏడాది.. కొద్దికాలంలోనే వీరిద్దరూ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల్లోనే, వీరి తర్వాత టెన్నిస్‌ను ఎవరు శాసిస్తారన్న ప్రశ్నపై చర్చ జోరందుకుంది. ఫెదరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో నాదల్‌ను ఓడించి కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. క్లే కోర్టుపై జరిగే ఏకైక టోర్నమెంట్‌లో నాదల్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచాడు. స్టానిస్లాస్ వావ్రిన్కాను ఫైనల్‌లో 6-2, 6-3, 6-1 ఆధిక్యంతో, వరుస సెట్లలో ఓడించి, పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించాడు. మొత్తం మీద అతనికి అది 15వ గ్రాండ్ శ్లామ్. ఈ టోర్నమెంట్‌లో ఆడని ఫెదరర్ గ్రాస్ కోర్టుపై మక్కువతో ఫెదరర్ వింబుల్డన్ టోర్నీలో ఆడాడు. తుది సమరంలో విజయభేరి మోగించిన అతను కెరీర్‌లో తన గ్రాండ్ శ్లామ్స్ సంఖ్యను 19కి పెంచుకున్నాడు. టెన్నిస్‌ను వీరిద్దరూ ఏ స్థాయిలో శాసిస్తున్నారనేది, క్రీడపై వీరి ముద్ర ఏ స్థాయిలో ఉందనేది, వారు సాధిస్తున్న విజయాలే స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరి వయసు మూడు పదులు దాటడంతో, ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తున్నది. అందుకే, వీరి తర్వాత ప్రపంచ టెన్నిస్‌లో ఎవరు ఈ స్థాయిలో రాణిస్తారనే అంశం ఆసక్తిని రేపుతున్నది. వీరిద్దరి ఆట తీరు వేరు. నాదల్ కొట్టే బంతులు ఎవరూ ఊహించని రీతిలో స్పిన్ తిరుగుతుంది. ప్రత్యర్థులకు అందకుండా మెరుపు వేగంతో దూసుకెళుతుంది. బలమైన సర్వీసులు, శక్తివంతమైన షాట్లు నాదల్ బలమైతే, ఫెదరర్‌ది క్లాసిక్ ప్లే. చాలా మంది అతనిని పీట్ సంప్రాస్‌తో పోలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, టెన్నిస్‌పై ఇద్దరూ ప్రభావం చూపిస్తున్నారు. తాము ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు లేరన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే తదితరులను ఫెదరర్, నాదల్‌కు వారసులుగా పేర్కోవచ్చు. అయితే ఫిట్నెస్ సమస్య వారిని వెంటాడుతున్నది. ఫెదరర్ మాదిరి తిరుగులేని ఫిట్నెస్‌తో ఉండడం నాదల్‌కే సాధ్యం కాలేదు. ఈ పరిస్థితుల్లో జొకోవిచ్, ముర్రే ఇంకెంత కాలం అంతర్జాతీయ టెన్నిస్‌లో ఉంటారన్నది అనుమానమే. ఫెదరర్, నాదల్ కలిస్తే, హార్డ్, క్లే, గ్రాస్ కోర్టుల్లో వీరిని సమర్థంగా ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదు. జొకోవిచ్, ముర్రేకు ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదు. బలమైన ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తే, స్టానిస్లాస్ వావ్రిన్కా, 6 అడుగుల 6 అంగుళాల పొడవుతో అందరినీ ఆకట్టుకుంటున్న అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందు వరసలో ఉంటారు. ఫెదరర్, నాదల్ వారసత్వాన్ని కొనసాగించే సత్తా వీరికి ఉంది. 20 ఏళ్ల సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను చాలామంది ఇప్పటికే ఫెదరర్‌తో పోలుస్తున్నారు. అతని సోదరుడు మిచా జ్వెరెవ్ కూడా ప్రతిభావంతుడే. 23 ఏళ్ల డామినిక్ థియేమ్, 22 ఏళ్ల నిక్ కిర్గియోస్ పేరు టెన్నిస్ రంగాల్లో మారుమోగుతున్నది. జువాన్ కార్లొస్ ఫెరెరో, ఏడడుగులతో తాటి చెట్టును తలపిస్తున్న 19 ఏళ్ల అమెరికా హీరో రిల్లీ ఒపెల్కా తదితరులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని టెన్నిస్ పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే, వీరిలో ఎంత మంది ఫెదరర్, నాదల్‌కు దీటుగా పేరుప్రఖ్యాతులు సంపాదించి, వారిని తలపిస్తారని అనుకోవడానికి వీల్లేదు.