ఆటాపోటీ

కూల్ కూల్ రాహుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత టెస్టు క్రికెట్‌కు లభించిన గొప్ప ఓపెనర్లలలో ఒకడిగా పేరు తెచ్చుకున్న 25 ఏళ్ల లోకేష్ రాహుల్ మైదానంలో దూకుడుగా ఉండడాన్ని ఎవరూ చూసి ఉండరు. ఒకప్పుడు క్రీజ్‌లో పాతుకుపోయి, ప్రత్యర్థి జట్టు బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన రాహుల్ ద్రవిడ్‌కు ‘ది వాల్’ అన్న పేరు స్థిరపడింది. అజాత శత్రువుగా, మచ్చలేని క్రికెటర్‌గా ద్రవిడ్‌ను యావత్ క్రికెట్ ప్రపంచం ఆకాశానికి ఎత్తేస్తుంది. కర్ణాటకకు చెందిన ద్రవిడ్ మాదిరిగానే, అదే రాష్ట్రం నుంచి దూసుకొచ్చిన లోకేష్ రాహుల్ కూడా వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారీ సర్వశక్తులు ఒడ్డి, జట్టుకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రాహుల్ అద్భుతంగా రాణించాడు. అంతేగాక, టెస్టుల్లో వరుసగా ఏడు అర్ధ శతకాలను నమోదు చేసి, ప్రపంచ రికార్డును సమం చేశాడు. 2015లో, తాను ఆడిన రెండో టెస్టులోనే రాహుల్ సెంచరీ సాధించి, అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను 110 పరుగులు చేశాడు. 2016లో, తొలి వనే్డలోనే సెంచరీ చేశాడు. తాను ఆడిన నాలుగో టి-20లో శతకంతో రాణించాడు. భారత జట్టుకు ఓపెనర్‌గా శిఖర్ ధావన్, మురళీ విజయ్, అభినవ్ ముకుంద్‌తో పోటీపడే స్థాయికి చేరాడు. బ్యాట్స్‌మన్‌గానేగాక, అత్యంత సంక్లిష్టమైన ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో సమర్థుడైన ఫీల్డర్‌గా కూడా అతను సేవలు అందిస్తున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగినా, ఎప్పుడూ ఒదిగి ఉండే లక్షణం రాహుల్‌కు ప్రత్యేకతను సంపాదించిపెట్టింది. ఇంత కూల్‌గా ఉండడం ఎలా సాధ్యమని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బెంగళూరులో పుట్టిపెరగడమేనని రాహుల్ సమాధానమిచ్చాడు. అక్కడ అందరూ క్లాస్‌గా ఉంటారని, కాబట్టి, దుస్తుల నుంచి మాట తీరు వరకూ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అందుకే, ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండడం అలవాటైందంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ద్రవిడ్ నుంచి రాహుల్ వరకూ కర్నాటక నుంచి వచ్చిన క్రికెటర్లు మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.