భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లాగే బాబా అంటూ వెళ్ళి వామన్ తాత్యా రెండు పచ్చి కుండలు తెచ్చి ఇచ్చాడు. ఆ తరువాత కుమ్మరి ఆము దగ్గరకు వెళ్లాడు. అనుకోకుండా దూర ప్రాంతం నుంచి ఒకరు వచ్చి తన దగ్గర చేసి ఉన్న కుండలన్నీ కొనుగోలు చేసి తీసుకునివెళ్లారు. మాకు మరలా యాభై కుండల దాకా కావాలి ఎప్పుడు రమ్మంటావు అని కూడా అడిగారు. అలా బేరం అయ్యేసరికి వామన్ తాత్యాకు ఎనలేని సంతోషం వేసింది. అంతే బాబా దగ్గరకు పరుగెత్తుకు వచ్చి బాబా నీకు కుండలు ఇచ్చాను. అంతే నాకు పెద్ద బేరం దొరికింది. దానికి కారణం నీవు బాబా. ఇలాగే నన్ను అనుగ్రహించు. నేను రోజూ నీకు రెండు పచ్చి కుండలు ఇస్తాను అని చెప్పాడు. అప్పటినుంచి వామన్ తాత్యా రోజు పచ్చి కుండలు మొట్టమొదట బాబాకు సమర్పించి ఆ తరువాత వ్యాపారాన్ని మొదలుపెట్టేవాడు.
బాబా కూడా సంతోషంగా వాటిని తీసుకునేవాడు. వాటితోనే నీటిని బావి నుంచి తీసుకుని వచ్చి తోటలో పోసేవాడు. పొద్దున్న సాయంత్రం రెండు పూటలా ఇలా ఈ కుండలతో నీటిని పోసి వేపచెట్టు కింద కుండలను పెట్టేవాడు. అవి రాత్రి అవగానే విచ్చిపోయేవి. అంతే మరునాడు యథాప్రకారంగా వామన్ పచ్చికుండలు తెచ్చేవాడు. బాబా ఆనందంగా తీసుకునేవాడు.
***
గంగఘిర్ బాబా అనే ఓ సన్యాసి సద్గోష్ఠి చేస్తూ ఊరూరు తిరిగేవాడు. ఓ రోజు శిరిడీ వచ్చాడు. అతడు ముందు కాలంలోనూ వచ్చాడు. ప్రజలందరినీ ఖండోబా దేవాలయంలో కూర్చోబెట్టుకుని భాగవతాన్ని భారతాన్ని చదివి వినిపించి అందలి మర్మాలను విడమర్చి చెప్పేవాడు.
ఈసారి కూడా గంగఘిర్ బాబా వచ్చాడని ఊరిలోని పెద్ద పిన్నా అంతా ఖండోబా దేవాలయానికి వెళ్లారు. అక్కడ గంగఘిర్ మహాభారతంలోని ఘట్టాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే బాబా ఓ కుండలో నీరు తీసుకుని ఆ దారిలోనే వెళుతున్నాడు. దాన్ని గంగఘిర్ చూశాడు. వెంటనే తన ప్రసంగం ఆపి ఆ బాబాతోనే వెళ్ళాడు. బాబా మసీదులోకి వెళ్లాడు. గంగఘిర్ కూడా వెళ్లి బాబాకు నమస్కరించి నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడిగారు.
బాబా చిరునవ్వు నవ్వి గంగిఘిర్ మనిద్దరం అన్నదమ్ములమే. ఓకే కుటుంబంలోంచి వచ్చాము. భగవంతుడు మనలను ఇక్కడు పంపించాడు. ఈ పనులు చేయమని చెప్పాడు. నేను నీవు చేసే పనులనే చేస్తున్నాను. కాని ఏం చేయను కొందరు నేను ఇచ్చిన పాలను తాగి ఆయన ఇచ్చేవి పాలు కాదు నేనే మీకు పాలను ఇస్తాను అని నీళ్లను పాలని చెపుతూ ఇస్తున్నారు.
ఇదిగో బాబా నన్ను పూనాడు ఇవి చేయమని చెబుతున్నాడు. ఈ తాయెత్తు కట్టుకోండి. ఈ ఉపవాసాలు చేయండి. ఈ పూలను పంచండి. ఈ పుస్తకాలు చదవండి. అన్నదానాన్ని ఇలా చేయండి. సాయిబాబా ఇవన్నీ నా చేత చెప్పిస్తున్నాడనీ కొందరు అబద్ధాలు చెబుతున్నారు.
కాని ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూన్న జనం ఆ అబద్ధపు మాటలకు లోబడి అక్కడికి వెళుతున్నారు. వారు చెప్పిందల్లా చేస్తున్నారు. కాని వారి కోరికలు తీరకపోతే నన్ను తిడుతున్నారు. నాపై రాళ్లు రువ్వుతున్నారు. నేను ఎప్పటికప్పుడు వారిని పిలుస్తూ అసలు సంగతి చెబుతూనే ఉన్నాను. కాని వారు మాత్రం ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నారు. ఏం చేద్దాం నేను వారిని ఎల్లవేళలా చూడాల్సిందే కదా. నీవు కూడా నాలాగే నేను చేసే పనులనే చేస్తున్నావు కదా. నాకు తెలుసు. భగవంతుడు నీకునాకు ఈ లోకంలో ఈ ఈ పనులు చేయమని ఈ భూమిమీదకు పంపించాడు. కనుక మనం ఇవి చేయాల్సిందే కదా అన్నాడు. అలా అనేసరికి గంగఘిర్ ఇక ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.
బాబా కూడా గంగఘిర్‌ను ఆలింగనం చేసుకుని చేతులు పట్టుకుని మన పనులను పరాకు లేకుండా చేద్దాం అంతా పైనవాని దయ అంటూ గబగబా తన స్థానంలోకి వెళ్లి కూర్చున్నాడు.
గంగఘిర్ నమస్కరించి వెనుతిరిగాడు. ఖండోబా ఆలయంలో తన కోసం కూర్చుని ఉన్నవారిని ఉద్దేశించి ఇలా మాట్లాడాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743