భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో భాగాన్ని బాబా తిన్నారు. ఆ తరువాత సాయంత్రం అవుతుంటే నేను మా ఇంట్లో నుంచి కాస్త నూనె తెస్తాను అని లేచాను.
అయితే బాబా ఏమీ వద్దులే. పద మనం దీపాలు పెట్టుకుందాం అన్నారు. ఆయనకు ఎదురు చెప్పలేక నేను ఈ వెంకన్న ఇద్దరమూ సాయితోపాటు కదిలాము. సాయి ఆ నూనె డబ్బాలో నీళ్లు పోసి ఆయన ఆ నీటిని నోట్లో పోసుకున్నారు. ఆ తరువాత అందులో నీళ్లు పోసారు. ఆ నీళ్లనే ఈ ప్రమిదల్లో వేస్తూ పోయారు. నేను వెంకన్న వత్తులు వేసాము. బాబా దీపాలు వెలిగించారు. మేము వాటిని మసీదు వెలుపలా లోపల అందంగా పెట్టాము. అంతే జరిగింది అన్నారు.
ఆ మాటలు వినేసరికి అక్కడకు వచ్చిన మార్వాడీలు అందరూ చెంపలుమీద కొట్టుకున్నారు. ఎవరికి వారు గబగబా సాయి దగ్గరకు పరుగెత్తారు. సాయి కాళ్ళమీద పడ్డారు.
స్వామి మమ్మల్ని క్షమించు మేము అజ్ఞానంతో నూనె లేదు నూనె లేదు అని చెప్పాము. మీరు ఇలా నూనె ఊరికినే తీసుకుని దీపాలు వెలిగిస్తున్నారు అనుకున్నాము కాని మాలో ఉన్న అజ్ఞానాన్ని అంతా కాల్చివేస్తున్నారని మాకు పొద్దున తెలియలేదు. స్వామి మీరే మమ్మల్ని రక్షించి కాపాడాలి.
మాలో ఉన్న అజ్ఞానంతో ఏమేమి చేయకూడని పనులు చేస్తుంటాము. మీరే మాకు జ్ఞానం ఇచ్చి మంచిదారిలో మమ్ములను నడిపివ్వండి అని అందరూ ఒక్కసారిగా చెప్పారు.
స్వామి వారు చెప్పిందంతా విన్నారు. ఏమీ ఫర్వాలేదు. మీరు మీ దగ్గర ఉంచుకుని కూడా లేదు అని అబద్ధం చెప్పవద్దు. మీకు ఇష్టం లేకుంటే ఇష్టం లేదనే చెప్పండి. అబద్ధం చెప్పినందువల్ల ఎప్పుడూ నష్టమే జరుగుతుంది. అబద్ధాలు జీవితాలను నాశనం చేస్తాయి. కనుక నేటి నుంచి ఎట్టి పరిస్థితులలోను దేనికైనా అబద్ధాలు చెప్పకండి. అది చాలు నాకు అన్నారు.
వారంతా సాయిబాబా మా తప్పులు క్షమించండి. మేము ఎప్పటికీ అబద్ధాలు చెప్పము అని అన్నారు. సాయి వారిని చిరునవ్వుతో చూశారు.
అప్పటినుంచి అందరూ ఎవరికివారు నూనె తెచ్చి ఆ డబ్బాలో పోసేవారు. ఆ నూనెతోనే ప్రతిరోజు సాయిబాబా దీపాలు వెలిగించి అలంకరించేవారు.
దీపాలు అంటే సాయికి చాలా ఇష్టమని అక్కడ ఉన్నవారంతా అనుకున్నారు.
ఒక రోజు-
త్య్రయంబక్ డేంగల్ నీమ్‌గావ్‌లో ఉంటారు. ఆయన ఒక రోజు హడావుడిగా వచ్చారు.
‘‘త్య్రయంబక్ డేం గల్ ఎందుకంత హడావుడిగా వస్తున్నావు. ఏమైంది. అంతా సజావుగానే ఉంది కదా. ఈ ఉరుములు మెరుపుల్లో నీవు అక్కడ నుంచి ఎందుకు వచ్చావు. బిడ్డ క్షేమంగానే ఉంది కదా అన్నారు’’ బాబా ఆయన్ను చూడగానే. ఆయన మరింత ఆశ్చర్యంగా.
‘‘ఆ ఆ విషయం కోసమే నేను వస్తున్నాను బాబా’’ అన్నాడు.
‘‘ఏ విషయం’’ చిరునవ్వు చెదరనీయకుండా బాబా చూస్తున్నాడు.
‘‘బాబా ఇప్పుడే ఇందాకే మా పొలంలో పనిచేసే మనిషి నిన్ను చూసాను. నా బిడ్డ వానలో తడవకుండా గొడుగు పట్టుకుని బాబా నిలబడ్డారు. ఇంత హఠాత్తుగా వాన వచ్చింది కదా. ఎక్కడ ఆ గాలి వానకు చెట్టు విరుగుతుందేమో అనుకుని బాబాను తలుచు కుంటూ పరుగెత్తాను. కాని నేను చెట్టుకిందకు వెళ్ళేసరికి బాబా నిల్చుని ఉన్నారు. నేను ముందు నా బిడ్డను చేతుల్లోకి తీసుకుని బాబా వైపు చూడగానే అక్కడ లేరు. అంతా వెతికాను. వాన ఆగిపోయింది. బాబా కూడా కనిపించలేదు అంటూ మా దగ్గరకు వచ్చింది. నేను పొలం దగ్గరే ఉన్నాను. కాని నేను కూడా మిమ్మల్ని చూడలేదు. ఎక్కడిదాకో వెళ్లి ఉండరు అని మిమ్మల్ని వెతుకుతూ వస్తున్నాను. నాకు తెలియకుండానే నేను ఈ మసీదు దగ్గరకు వచ్చేశాను అన్నాడు డేంగల్.
అక్కడే కూర్చుని ఉన్న మాధవరావు అదేంటి డేంగల్‌గారు బాబా మా ముందే కూర్చుని ఉన్నారు. పొద్దునుంచి ఆయన ఎక్కడికీ వెళ్లలేదు. నీవు ఏమో అక్కడకు బాబా వచ్చాడని చెబుతున్నావు. ఇదెలా సాధ్యం అన్నాడు. నాకు తెలియడంలేదు. నేను బాబాని చూసానని మా పని అమ్మాయి చెబుతోంది అన్నాడు డేంగల్.
అక్కడే కూర్చుని ఉన్న మహిల్సాపతి, బాబా రక్షించాలి ఎవరినైనా అనుకుంటే అక్కడికి వెళ్లి గాని రక్షించలేరా ఏమిటి. మీకొక కథ చెబుతాను వినండి. పూర్వం ద్వాపర యుగంలో అని మొదలుపెట్టాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743