ఆటాపోటీ

అత్యుత్సాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అహ్మద్ షెజాద్ అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అభిమానులంతా తనకు బ్రహ్మరథం పడతారని ఊహించాడు. కానీ, అతని ప్రయత్నం బెడిసికొట్టింది. వెక్కిరింతలు, విమర్శలు ఎదురుకావడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే, ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్తాన్ కప్‌ను గెల్చుకుంది. ఆ మ్యాచ్‌కి ముందు తాను నెట్స్‌లో ఎంతగా కష్టపడిందీ చెప్పడానికి షెజాద్ ఒక ఫొటోను ట్వీట్ చేశాడు. చెమటలు పట్టిన ముఖంతో చాలా అలసటగా కనిపిస్తున్న ఆ ఫొటోను చూసి, భారత్‌తో తుది పోరుకు తాను శ్రమించడాన్ని అందరూ మెచ్చుకుంటారని అనుకున్నాడు. కానీ, ఇదేం పోస్టు అంటూ ట్విటర్‌లో అతనిని అనుసరిస్తున్న అభిమానులే వ్యాఖ్యానించడంతో కంగుతిన్నాడు. ‘సెల్ఫీల మొనగాడు’ అని కొందరు పేర్కొంటే, ‘ఇదో డ్రామా’ అని మరికొందరు విమర్శించారు. అందరూ భేష్ అంటూ మెచ్చుకుంటారనుకుంటే, జోకర్‌గా మారిపోయానని షెజాద్ తెగ బాధపడుతున్నాడు. ఓవరాక్షన్ చేస్తే అంతే మరి!