ఆటాపోటీ

వీరూ పాటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెటర్లలో చాలా మంది పాటలు పాడతారు. డాన్స్ చేస్తారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ ఏదో ఒక పాడుకుంటూనే ఉంటాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ కూడా అంతే. అతను గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. మంచి పాటగాడు కూడా. ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వనే్డలో 149 బంతులు ఎదుర్కొని, 25 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 219 పరుగులు సాధించి సెవాగ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. వనే్డల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అంతేగాక, ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో సచిన్ చేసిన స్కోరును అధిగమించాడు. ఆ మ్యాచ్ ఆడుతున్నంత సేపు తాను కిషోర్ కుమార్ పాడిన ‘చలా జాతాహూ, కిసీ కి ధున్‌మే.. ధడక్‌తే దిల్‌కే తరానే లియే’ పాటను పాడుకుంటునే ఉన్నాడట. కిషోర్ 88వ జయంతి సందర్భంగా అతను ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను కిషోర్ అభిమానినని ప్రకటించుకున్నాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపూ ఏదో ఒక పాట పాడుకుంటునే ఉంటానని తెలిపాడు.