భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబాను ఎక్కడికీ తీసుకొని వెళ్లక్కర్లేదు. మీరంతా బాబా భజన చేయండి చాలు, ఆయనకు తగ్గిపోతుంది. అసలు ఆయనకేమీ బాధ లేదు అని చెప్పాడు.
అందరూ మహిల్సాపతి వైపు వింతగా చూసి నీకేమన్నా పిచ్చా అన్నారు.
అంతలో బాబా నిటారుగా కూర్చున్నాడు. అబ్బా తగ్గిపోయింది బాబూ అన్నారు.
అంతలో అక్కడికి ఒక పరిచయంలేని వ్యక్తి గబగబా వచ్చాడు. బాబా బాబా అని అరుస్తూ వస్తున్నాడు.
‘అంతా క్షేమమే కదా! ఆనందం వచ్చినా తట్టుకోలేకపోతే ఎలా.. కష్టం వచ్చినపుడు అరిచావు బాగుంది. ఇప్పుడూ అలానే అరుస్తావు ఏమిటి?’ అన్నాడు బాబా.
వచ్చినతను అమాంతంగా బాబా కాళ్లమీద పడిపోయి ‘‘బాబా అంతా నీ దయ. మా ఆవిడ బతుకుతుందా అనుకున్నాను. నీవు పంపిన ఊది పెట్టాము. అంతే పండంటి మగబిడ్డను ప్రసవించింది. నేను నీ పేరే పెట్టుకుని రోజు నిన్ను స్మరిస్తుంటాను అన్నాడు.
సరే అలానే
వారంతా అసలు ఏం జరిగింది అని అతనిని అడిగారు. నేను మా ఆవిడ కష్టం చేసుకుని కూలీ నాలీ చేసుకుని బతుకుతూ కాలం గడిపేవారిమి. మేము నెల్లూరి నుంచి ఈమధ్యనే ఇక్కడికి వచ్చాము. వచ్చిన దగ్గరనుంచి మా ఆవిడకు బాబామీద భక్తి కుదిరింది. నేనే బాబా దేవుడు కాదు అని చెప్పేవాణ్ణి. ఆమె ఎప్పుడూ బాబానే స్మరిస్తూ వండేది. ఆమె గర్భవతి. ప్రసవ సమయం వచ్చి రెండు మూడు రోజుల నుంచి బాధపడుతూ వుంది. కాని పొద్దున్న ఉన్నట్టుండి బాగా కడుపునొప్పి అని ఏడ్చేసింది. నాకే ఏమీ తోచలేదు. నేను డాక్టరు దగ్గరకు తీసుకునిపోతా అంటే కాదు కాదు నన్ను బాబానే రక్షిస్తాడు ఏమీ వద్దు అని బాబా అని అరుస్తూ ఉండిపోయింది.
నేను బాబా ఎక్కడ ఉన్నాడో ఏమో, ఆయనకు నీ నొప్పి ఎలా తెలుస్తుంది. నీవు ఊరుకో నేను డాక్టర్‌ని పిలుచుకువస్తాను అని వీధిలోకి వచ్చాను. నేను మా ఇంటి తలుపు తెరవగానే బాబా ఎదురుగా ఉన్నారు.
ఎక్కడికి పోతావు. ఏమీ ఫర్వాలేదు. నీకు మగబిడ్డ పుట్టబోతున్నాడు. ఇదిగో ఈ విభూది మీ ఆవిడకు పెట్టు చాలు అని నాకు విబూది ఇచ్చారు. నేను తీసుకుని వెళ్లి విబూది పెట్టాను. ఎవరిచ్చారు. బాబా అన్నాను. మా ఆవిడ లేచి రాబోయింది. అంతలో సుఖ ప్రసవం జరిగింది. నాకు మగ పిల్లవాడు పుట్టాడు. ఆ ఆనందంతో నేను బాబా కోసం పరుగెత్తి బయటకు వచ్చాను. కాని బాబా అక్కడ లేడు. అందుకే ఇంత దూరం అయినా వచ్చాను అని అన్నాడు.
ఇదేంటి బాబా ఇక్కడ కడుపునొప్పి అంటున్నాడు కదా. ఒకరి మొగాలు ఒకరు చూసుకుంటున్నారు.
మహిల్సాపతి చూశారా నేను మీకు అదే చెప్పాను. బాబా లీలలను అర్థం చేసుకోవడం కష్టం అని అందరూ కలిసి బాబా భజన చేయసాగారు.
మరోసారి శిరిడీకి ప్రధాన్ అనే ఆయన వచ్చారు. ఆయన్ను చూడగానే నీవు ఇక్కడికి వచ్చావా. నాకు ఎడమ ప్రక్క అంతా చాలా నొప్పిగా ఉంది. కాని నాలుగు రోజులు పోతే తగ్గుతుంది అనుకుంటూ అన్నారు.
బాబా మరి నేను మర్దనా చేయనా అని అడిగాడు ప్రధాన్.
ఇది మర్దనా చేస్తే పోయే జబ్బు కాదు అన్నారు.
నాలుగో రోజు ప్రధాన్ పిలిచి నీవు ఈ ఊది ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్లు. అక్కడ ఇది చాలా అవసరం ఉంది. మధ్యలో ఇంకేమీ పని పెట్టుకోకు. త్వరగా ఇంటికి వెళ్లు అన్నారు.
ప్రధాన్ వచ్చి మహిల్సాపతితో మహి బాబా నన్ను త్వరగా ఇంటికి వెళ్ళు, ఊది ప్రసాదం అక్కడ అవసరం వుంది అన్నారు. నాకు ఏదో భయంగా ఉంది అన్నాడు.
ఏం కాదులే. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చే పని అయితే ఆయన నిన్ను పంపనే పంపరు. ఇపుడు ఏం కాదు, బాబాను స్మరిస్తూ వెళ్లు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి పంపాడు మహిల్సాపతి.
బొంబాయిలోని అతని ఇంటికి వచ్చేసరికి డాక్టర్లు ఆయన అమ్మను చూసి అమ్మా ఇపుడు ఈమెకు విరేచనం జరిగితే అంతా బాగయిపోతుంది. ఇంకేం ఫర్వాలేదు అని చెపుతున్నారు.
ప్రధాన్ బాబా దీనికోసమే నన్ను ఊది తీసుకుని వెళ్లమని చెప్పినట్టు ఉంది అనుకుని వెంటనే తన దగ్గర ఉన్న బాబా ఊది తల్లి నొసట మీద పెట్టాడు. అది పెట్టిన వెంటనే ఆమె లేచి కూర్చుని నిలబడింది. హాయిగా తిరుగుతూ ఉంది. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743