రంగారెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రిగా ప్రగతి భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జనవరి 19: రాజధాని నగరంలో ప్రజల ఖజానాతో అట్టహాసంగా నిర్మించుకొని రాజభోగాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతిభవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చేంత వరకు టీడీపీ పోరాటం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చంపాపేట్ పోచమ్మగడ్డలో ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా రమణ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. రమణ మాట్లాడుతూ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నగరంలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజభోగాలు అనుభవించేల ఆ నిధులతో ప్రగతి భవన్‌ను నిర్మించుకున్నారని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమస్యలు తాండవిస్తున్నాయని వాటిని గుర్తించి పరిష్కారం కోసం చర్యలు తీసుకునేందుకే సామ రంగారెడ్డి పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతల సురేందర్ యాదవ్, వెంకటేశ్వర రావు, వీరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, లలిత, శ్యామల, సత్యనారాయణ, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు పాల్గొన్నారు.