రంగారెడ్డి

భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 23: భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టీ.సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం భగత్‌సింగ్ 87 వర్ధంతిని పురస్కరించుకొని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సత్యప్రసాద్ మాట్లాడుతూ బ్రిటీష్ ముష్కరులను తరిమి కొట్టడంలో భగత్‌సింగ్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. నిరుద్యోగ యువతకు భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి అమలుపర్చాలని డిమాండ్ చేశారు. భగత్‌సింగ్ జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో పూర్తి స్థాయి లో చేర్చాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నేతలు ధర్మేంద్ర, విశాల్, సతీష్, మహేశ్, శివ, రాజేశ్, భరత్, ప్రదీప్, నవదీప్, రవళి, సుహాసిని పాల్గొన్నారు.
మేడ్చల్: స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పలువురు నాయకులు సూ చించారు. విప్లవవీరుడు భగత్‌సింగ్ వర్ధంతిని శుక్రవారం మేడ్చల్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ వర్ధంతిని నిర్వహించారు. గుండ్లపోచంపల్లిలో భగత్‌సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌కు నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ బేరీ ఈశ్వర్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, ఎస్. శ్రీనివాస్, నాగేశ్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాగజ్యోతి, గణేశ్, సుధాకర్‌రెడ్డి, పీ.లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
కొడంగల్: విప్లవ కారుడు భగత్‌సింగ్ చిరస్మరణీయుడని ఎంఐఎం తాలూకా అధ్యక్షుడు ఎస్‌బీ గుల్షన్ కొనియాడారు. భగత్‌సింగ్ 87వ వర్ధంతిని శుక్రవారం కొడంగల్ పట్టణంలో నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.