రంగారెడ్డి

రైతు బంధు పథకంపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 25: రైతు బంధు పథకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా, పోలీస్, బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రెడ్డి మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదని అన్నారు. జిల్లాలో 129 గ్రామాల్లో 33523 మంది భూ పట్టాదారులు ఉన్నారని, వారిలో 28268 మంది పట్టాదారులు ఆధార్ అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. గ్రామాల్లో పంపిణీ చేసే ముందు రైతులకు తెలిసేలా గ్రామాల్లో దండోరా, ఫ్లెక్సీలతో తెలపాలని చెప్పారు. పంపిణీ చేసే కేంద్రాల వద్ద తాగునీరు, షామియానాలు, టాయిలెట్స్, వైద్య సిబ్బంది, పోలీస్‌లను అందుబాటులో ఉంచాలని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద ఒక్కో కౌంటర్‌లో 300 మందికి ఉంటుందని అన్నారు. ఖాతా నెంబర్‌ను బట్టి ముందుగానే టోకెన్‌లు జారీచేసి క్రమ సంఖ్యలో పంపిణీ జరగాలని అన్నారు. తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టాదార్ పాస్ పుస్తకాలు, చెక్కులు లబ్ధిదారులకు మాత్రమే అందజేస్తామని తెలిపారు. చెక్కులు మార్చుకునే క్రమంలో రైతులు బ్యాంకులకు వెళ్లే ముందు తమ వెంట ఆధార్‌కార్డును తీసుకెళ్లాలని అన్నారు. జిల్లాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఎస్‌బీఐ చెక్కులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మండల, గ్రామ స్ధాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతు బంధు పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేసే రైతు బంధు పథకాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించాలన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌ఓ విజయకుమారి, ఆర్డీఓ లచ్చిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ఎల్‌పీఎం భుజంగ రావు పాల్గొన్నారు.

విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి

* ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
వనస్థలిపురం, ఏప్రిల్ 25: విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. వనస్థలిపురం గణేష్ టెంపుల్ సమీపంలో శ్రీపుణ్య భూమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వండర్ పూల్ కిడ్స్ అకాడమీని ఎమ్మెల్యే కృష్ణయ్య ముఖ్య అతీథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులలో చదువు పట్ల ఒత్తిడిని తగ్గించి ఉత్తములుగా తిర్చిదిద్దడానికి ఇలాంటి సంస్థలు రావడం అభినంద నీయమని అన్నారు. చదువు ఒత్తిడితో విద్యార్థులు అనేక సమస్యలు పడుతూ.. కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. వాటిని అధిగమించడానికి చక్కటి సలహాలు సూచనలు ఇవ్వాలని వండర్ పుల్ కిడ్స్ అకాడమీకి సూచించారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ కిషోర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 14వేల మంది చదువులో రాణించలేక అనేక రకాల ఒత్తిడిలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. చిన్నారుల్లో ఒత్తిడిలు తగ్గించేందుకు మెలుకువలతో కూడిన శిక్షణ ఇచ్చి విద్యలో రాణించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, స్పూర్తి సేవా సమితీ అధ్యక్షుడు కొలిశెట్టి సంజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ ఉమా శ్రీనివాస్, బోడ భిక్షపతి, చింతల రవి కుమార్, నిర్వాహకులు కే.శ్రీనివాస్ రావు, ఎస్వీ. నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.