ధర్మసందేహాలు

శివలింగాలకు కళ్లు, ముక్కు పెట్టడం శాస్తమ్రా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ మధ్య కొన్ని దేవాలయాల్లో శివలింగానికి కళ్లు, ముక్కు, పెదవులు లాంటివి పెట్టి అభిషేకాలు చేస్తున్నట్టు టివీలలో చూపిస్తున్నారు ఇది శాస్త్ర సమ్మతమేనా?
- దత్తాత్రేయ, హైదరాబాదు
ఇవన్నీ అలంకారాలల్లో భాగాలు. వీటికి ఎక్కువ ప్రాముఖ్యం లేదు
* కర్ణుడు సూర్యుని వరం వల్ల కుంతీ దేవికి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. సైన్సు ప్రకారం సూర్యుడంటే మండుతున్న పెద్ద అగ్నిగోళం కదా. మరి పురాణాల్లో చెప్పేది వాస్తవమా?
- బాలకేశవులు, గిద్దలూరు
సైన్సు ప్రకారమే గాదు, మన జ్యోతిష శాస్త్ర ప్రకారం గూడా సూర్యుడు మండే అగ్నిగోళమే అంతేకాదు ఆకాశంలో వుండే గ్రహగోళాలన్నీ గూడా భౌతికంగా జడ పదార్థ రాశులే. అయితే వీటన్నింటికీ అధిదేవతలున్నారు. వారు చైతన్యాత్మకులు అనే విషయం మన మహర్షులు దివ్యనేత్రాల ద్వారా ప్రత్యక్షంగా దర్శించిన సత్యం. ఆ అధిదేవతల చరిత్రలనే వారు పురాణాల్లో నిబంధించారు. కనుక అవన్నీ నిస్సందేహంగా వాస్తవాలే.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org