రంగారెడ్డి

ప్రపంచానికి ఆది గురువు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 20: అజ్ఞాన అంధకారంలో ప్రపంచ కొట్టుమిట్టాడుతున్న సమయంలో వేధాలను వెలికితీసి, ప్రపంచానికి జ్ఞాన భిక్షను ప్రపంచానికి భారత్ ప్రసాందించిదని ఆది గురువు అని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యంజీ అన్నారు. ప్రపంచ యోగా డేను పురస్కరించుకుని కోఠిలోని వైఎంఐఎస్ భవన్‌లో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సూర్య నమస్కారాలు, ఆసనాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రంగంలోనైనా భారత్ అగ్రగామిగా రాణిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు జూన్ 21న యోగా డేను నిర్వహించటం భారత్ సాధించిన విజయంగా అభివర్ణించారు. మతాలు కులాలు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లకు అతీతంగా ప్రపంచమంతా ఒక్కటై ఏకకాలంలో యోగా నిర్వహించటం శుభప్రదమని అన్నారు. జేఏటీ రాష్ట్ర అధ్యక్షుడు బాలస్వామి, కార్యదర్శి చారి, రమేశ్, కార్పొరేటర్ మమతాగుప్తా, బీజేపీ నాయకుడు గోవింద్ రాఠీ, టీఆర్‌ఎస్ నాయకులు సంతోష్‌గుప్తా, జేఏటీ నాయకులు ప్రవీణ్, గిరిధర్ చారి, కుమారస్వామి పాల్గొన్నారు.

యోగతో ఆరోగ్యం - ఆనందం
వికారాబాద్: నిత్య యోగ సాధనతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని వికారాబాద్ తహశీల్దార్ చిన అప్పల నాయడు అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక ఓం శాంతి భవనం నుంచి బీజేఆర్ చౌరస్తా నుంచి యోగ శాంతి యాత్ర నిర్వహించారు. బ్రహ్మకుమారి మధు మాట్లాడుతూ మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం రాజయోగం చేయాలని, శారీరక ఒత్తిడులను తగ్గించడానికి యోగ ప్రాణాయామం చేయాలని సూచించారు. పతంజలి యోగ సమితి అధ్యక్షుడు ప్యాట మల్లేశం మాట్లాడుతూ పతంజలి మహర్షి ప్రపంచ మానవులకు అందించిన అద్భుతమైన విద్య యోగ అని, గత నాలుగు సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగదినంగా ప్రకటించిందని తెలిపారు. బ్రహ్మకుమారి కేంద్రం యోగ సమితి సభ్యులు సదానందం, సీ.నర్సింహా రెడ్డి, హన్మంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరేశం, వీరభద్రయ్య, మల్లప్ప, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

నేడు ఎస్పీ కార్యాలయంలో యోగా డే
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఉదయం ఏడు గంటలకు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొంటారని చెప్పారు.
కులకచర్ల: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఆరు గంటలకు పాంబండ సమీపాన గల గిరిజన గురుకుల పాఠశాలలో జాట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు యోగా నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు పి.రమేశ్ తెలిపారు.
రాజేంద్రనగర్: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాటేదాన్ బాబల్‌రెడ్డినగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో యోగాసనాలను వేస్తున్నట్లు శ్రీవివేకానంద యోగా సమితి సభ్యులు వెల్లడించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురూజీ భద్రయ్య ఆధ్వర్యంలో గురువారం యోగాసనాలను వేయిస్తున్నామని నిర్వాహాకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అర్తం లక్ష్మయ్యగుప్త, పర్సనాలిటీ డెవలెప్‌మెంట్ ట్రైనర్ హుమ్లా గురులు హాజరు అవుతున్నారని అన్నారు.
మేడ్చల్: నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలో బుధవారం సాయంత్రం పతంజలి సమితి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకు యోగపై అవగాహన కల్పిపంచడమే కాకుండా యోగ సాధనతో కలిగే లాభాలను వివరించారు. ర్యాలీలో జడ్పీటీసీ శైలజ హరినాథ్, సీఐ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.