రంగారెడ్డి
వైద్యం అందక వృద్ధుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 August 2018
ఉప్పల్, ఆగస్టు 17: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 108 అంబులెన్స్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా 108 వాహనం కదలక పార్కింగ్కే పరిమితమైంది. దీంతో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో వాకింగ్ కోసం వచ్చిన 52 ఏళ్ల వయస్సు కల్గిన వ్యక్తికి గుండెపోటు వచ్చింది. పక్కనే 108 వాహనం ఉన్నప్పటికీ సమ్మె కారణంగా సకాలంలో వైద్యం అందక అక్కడిక్కడే మరణించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.