రంగారెడ్డి

జాబ్‌మేళాలో 1284 మందికి ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఆగస్టు 19: భృంగీ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం పెద్దిగారి ఫౌండేషన్, ట్రేడ్ హైదరాబాద్ డాట్‌కామ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 1284 మందికి ఉద్యోగావకాశం కల్పించినట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్‌కామ్ సీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జాబ్ మేళాకు 3672మంది నిరుద్యోగులు తరలి వచ్చారని, 90శాతం మంది వికారాబాద్ జిల్లాకు చెందినవారు. మిగతా పదిశాతం బయటి వారని చెప్పారు. జాబ్‌మేళాలో 60కంపెనీలు పాల్గొన్నా, ఒక్కో కంపెనీ ఎంపిక ఒక్కో రకంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 163 జాబ్‌మేళాలు నిర్వహించి 20 వేల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. రెండేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించేలా అతి పెద్ద జాబ్‌మేళాను నిర్వహించే ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. జాబ్‌మేళా ఏపార్టీకి సంబంధం లేనిదని స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ వేరుగా కౌంటర్ ఏర్పాటు చేసుకుందని, అది మాకు సంబంధం లేదని, ఉద్యోగాలు ఇచ్చేందుకే జాబ్‌మేళా పెట్టామని వివరించారు. సమావేశంలో పాఠశాల డైరెక్టర్లు కుమారస్వామి, శివప్రసాద్ పాల్గొన్నారు.

ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
బొంరాస్‌పేట, ఆగస్టు 19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రతాప్, అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి బాలు, కోశాధికారి రాము, కార్యవర్గ సభ్యులు సాధిక్, మహేష్, ప్రవీణ్, అభిషేక్, బాబ్యనాయక్, మల్లేష్, గోవింద్ పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ నుంచి ప్రశంసాపత్రం
వికారాబాద్, ఆగస్టు 19: మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడంతో పాటు సన్మానం పొందారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ నియోజకవర్గంలో శక్తి ప్రాజెక్టు (కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు)లో మొదటి స్థానంలో ఉన్నందున రాహుల్‌గాంధీ నుండి ఈనెల 17న పిలుపు రావడం, 18న ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసాద్‌కుమార్‌ను సన్మానించి, ప్రశంసాపత్రం అందజేశారు.