పశ్చిమగోదావరి

చింతమనేనిని అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 22: హమాలీ కార్మికునిపై దాడిచేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకోవటం కాకుండా చట్టప్రకారం అతన్ని అరెస్టు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. స్ధానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహారదీక్షల చివరిరోజైన శనివారం దీక్షాశిబిరాన్ని వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు నేతల రమేష్‌బాబు, జనసేన నాయకులు మత్తే బాబి, ఎఐడిఆర్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎ విజయకుమార్, ఇఫ్టూ జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి కెవి రత్నం, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్, ఎంఆర్‌పిఎస్ నాయకులు పలివెల చంటి, సిపిఎం నాయకులు జి నరసింహరావు, బికెఎంయు నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అఖిలపక్ష ఉద్యమం ఫలితంగా కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు తమ బాధ్యత అయిపోయిందనుకుంటే కుదరదని అరెస్టు చేయాలని స్పష్టం చేశారు. సామాన్యులపై కేసు రిజిష్టర్ అయిన వెంటనే అరెస్టు చేసే పోలీసు అధికారులు చింతమనేని ప్రభాకర్ విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని వారు ప్రశ్నించారు. చింతమనేనిని అరెస్టు చేసేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. దీక్షల్లో ఐఎంఎల్ డిపో కార్మికులు కాకర్ల శ్రీను, కె శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, రామ్‌కుమార్, యార్డ్ హమాలీ కార్మికులు రమణ, అప్పారావు, గురుమూర్తి, బండి నాగేశ్వరరావు, షేక్ నాగులు, బి భద్రం, అప్పారావు, మోషే, లోవరాజు, వి సాయిబాబు, జగన్నాధం, అమానుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఓటర్ల జాబితా ప్రచురణకు సహకరించాలి
రాజకీయపక్షాలను కోరిన డీఆర్వో సత్యనారాయణ
ఏలూరు, సెప్టెంబర్ 22: జనాభా ప్రాతిపదికన తాజా ఓటర్ల జాబితా ప్రచురణకు అన్ని రాజకీయపక్షాలు సహకరించాలని జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణ కోరారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం 2019 తుది ఓటర్ల జాబితా ప్రచురణ అంశంపై గుర్తింపుపొందిన రాజకీయపక్షాల ప్రతినిధులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, దీనికి సంబంధించి అక్టోబర్ 31వరకు క్లైయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించటం జరుగుతుందన్నారు. నవంబర్ 31వ తేదీలోపు వీటిని పరిష్కరించి, 2019 జనవరి 3వ తేదీనాటికి సప్లిమెంట్ ముద్రణ, జనవరి 4వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తామన్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం 28లక్షల 80వేల 385మంది ఓటర్లుగా నమోదు అయ్యారని, వీరిలో 14లక్షల 22వేల 425మంది పురుషులు, 14లక్షల 57వేల 960మంది మహిళలు ఉన్నారన్నారు. జిల్లాలో జనాభా, ఓటర్ల నిష్పత్తిని పరిశీలిస్తే జిల్లా సగటు 70.60శాతం ఉందన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఈ నిష్పత్తి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 56.2 శాతం, పోలవరంలో 59.9శాతం ఉందని, మిగిలిన నియోజకవర్గాల్లో 70శాతం పైబడి ఉందన్నారు. ఏలూరు, పోలవరం నియోజకవర్గాల్లో జనాభా, ఓటర్ల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏలూరు నియోజకవర్గంలో 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన 12వేల 089మంది, పోలవరం నియోజకవర్గంలో 11వేల 13మందిని ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని అయా నియోజకవర్గాల్లో కళాశాలల్లో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టామన్నారు. మొత్తం 92 కళాశాలల్లో 166మందిని క్యాంపస్ అంబాసిడర్లుగా నియమించామన్నారు. సమావేశంలో జడ్పీ సిఇఓ వి నాగార్జునసాగర్, డ్వామా పిడి ఎం వెంకటరమణ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో మోహన్‌కుమార్, టిడిపి నగర అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, బిజెపి నేత నెరుసు నెలరాజ, బిఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి కారెం లెనిన్, జిల్లా అధ్యక్షులు నేతల రమేష్‌బాబు, వైకాపా నాయకులు బండారు కిరణ్‌కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, డిఎన్‌విడి ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

స్పా మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి
భీమవరం, సెప్టెంబర్ 22: స్పా మసాజ్ సెంటర్, డ్రీమ్స్ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న మిజోరాం యువతులను భీమవరం టూటౌన్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు సెంటర్లలోను క్రాస్ బాడీ మసాజ్‌లు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా దాడిచేశామని భీమవరం టూటౌన్ సీఐ ఎ.చంద్రశేఖర్ విలేఖరులకు చెప్పారు. స్పా మసాజ్ సెంటర్‌లో నలుగురు, డ్రీమ్ బ్యూటీ పార్లర్‌లో ముగ్గురు వెరశి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. స్పా మసాజ్ సెంటర్‌లో పనిచేస్తున్న వారిలో ఇద్దరు మిజోరాం యువతులు ఉన్నారని, డ్రీమ్ బ్యూటీ పార్లర్‌లో ఒక యువతి ఈ ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని సీఐ చెప్పారు. వారితో పాటు పురుషులు, మేనేజర్లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.