విశాఖపట్నం

రావలసిన సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతన్న శ్రమకు కొత్త అర్ధం తెచ్చి
తన కడుపు నింపే ఉగాది రావాలి
పసిపిల్ల, పండు ముసలి అనే తేడా లేకుండా
మగమృగాల వేటకు మాన, ప్రాణాలు
పిడికిట్లో పెట్టుకున్న స్ర్తిలకు
ధైర్యాన్నిచ్చే ఉగాది రావాలి!
పరిసరాలను కలుషితం చేస్తున్న
మానవులకు కనువిప్పుకలిగించి
ప్రకృతిని కాపాడే ఉగాది రావాలి
జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోలేక
ఆత్మహత్యలు చేసుకుంటున్న
యువతకు స్ఫూర్తినిచ్చే ఉగాది రావాలి!

- కూరెళ్ల శ్రీశ్రేయ, పదవ తరగతి,
సెల్ : 9941831146.

అంతా ఉగాదే!

రాలిన ఆకులు చిగురించేటప్పుడు
కలిగే ఆనందమే ఉగాది
కష్టాలు, కన్నీళ్లను అధిగమించినప్పుడు
ఒనగూడే సంతోషమే ఉగాది
జీవితం షడ్రుచుల మయం
అని తెలుసుకుని
తీర్చిదిద్దుకోవడమే ఉగాది
కొత్త ఆలోచనలను
మోసుకొచ్చే నవ చైతన్యమే ఉగాది
మంచి కోసం పోరాటం సాగిస్తే
సాక్షాత్కరిస్తుంది ఉగాది
సర్వేజన సుఖినో భవంతి అని అర్ధం చేసుకుని
ముందుకు సాగితే అంతా ఉగాదే!

- నాగాస్త్రం నాగు,
వడ్లపూడి. సెల్ : 9966023970.

తెలుగు వారి తొలి పండగ

నవ చైతన్యానికి ప్రతీకగా
ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లుగా
తెలుగుదనమంతా సింగారించుకున్న
పదహారణాల పట్టు పరికిణిలా
నవ వధువులా రుతువల రాణితో కలసి
అడుగు పెట్టింది తెలుగువారి తొలి పండగ
అలసిన వృద్ధ వత్సరానికి
వినయంగా వీడ్కోలు పలుకుతూ
కొత్త ఆశలు చిగురు తొడిగిన శిశు వత్సరాన్ని
చిరునవ్వుతో స్వాగతిస్తూ
చైత్రమాసానా శుక్లపక్షాన పాఢ్యమి తిథిలా
తెలుగు వారు పరవశంతో
జరుపుకునే తొలి పండగ
సంస్కృతి, సంప్రదాయాలకు పునాది
యుగానికి ఆది ఉగాది
తెలుగుదనానికే జన్మదినమైన
పర్వం ఉగాది
ఒడిదుడుకులు, ఎత్తుపల్లాల జీవితానికి
అర్ధమిచ్చు ఉగాది పచ్చడి
పుడమితల్లి సైతం పులకించిపోయే
వసంత ఆగమనమే ఉగాది
ఉగాది శోభకు వేదికలు పల్లెలు
కోకిలమ్మ కూతలతో, మామిడి పూతలతో
భవిష్యత్తును తెలుసుకోవాలనే ఆరాటంతో
ఉషోదయం నుండి సాయం సంధ్య వరకు
ఎటు చూసినా ఎగిసే ఉత్సాహంతో
మది నిండా ఆనందం
నింపే ముచ్చటమైన పండగ
ప్రతి ఏడా పసివత్సరంలా
పల్లవించే ఆది పండగ

- సాలూరు సంతోషి,
ఎలుగుబంటి వారి వీధి,
విజయనగరం, సెల్ : 8019783424.

సంబరాల జావళి

షడ్రుచుల ఉగాది
మన జీవితాలకో దర్పణం
సుఖ దు:ఖాల బతుకు పయనంలో
ఉగాది పచ్చడి రుచులు
అన్ని పార్శ్యాలు
మానవ జీవనంలో తారసపడతాయి
సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగక
దు:ఖం కలిగినప్పుడు కుంగిపోక
మును ముందుకే సాగిపోతే
అనంత పయనంలో
ఒయాసిస్సులను
దాటుకుని వెళ్లాక
నీటి చెలమ కనిపించినట్లు
పూలవర్షం కురిసినట్లు
బతుకు పండకపోదు
నిర్వేదం, నిస్తేజం కార్యశీలురకు
తగదని, గెలుపుబాట పట్టాలంటే
సహనం, పట్టుదల ముఖ్యమని తెలుసుకుంటే
అందరి జీవితాల్లోనూ
వెలుగుతుంది ఉగాది
ఎదురైన చేదు జ్ఞాపకాలు,
ఓటమి దెబ్బలను
మరచిపోయి ఆశే శ్వాసగా
నిబ్బరంతో సాగిపోతే
వసంతంలో పచ్చదనం చిగురేసినట్లు
సంతోషాల ఉగాది
ఆత్మీయంగా పలకరిస్తుంది
బతుకు సంబరాల జావళి పాడుతుంది!

- ప్రసాద్, విశాఖపట్నం

ఓ ఉగాది

పండ్రెండు తెలుగు నెలల్లో
మొదటిది ఛైత్రం
రుతువులు ఆరులో మొదటిది వసంతం
అంతం లేని కాలానికి పరిమితి యుగం
ఛైత్రశుద్ధ పాఢ్యమి యుగానికి ఆది
అదే ఉగాది
ఓ ఉగాదీ...
నిష్క్రమిస్తున్నావు ‘శ్రీమన్మథ’నామంతో
సంవత్సరకాల పర్యావలోకంలో
ఏముందిలే అభ్యుదయం
అధికార దాహాలు, పదవీ వ్యామోహాలు
నాయకులు చేసిన ప్రమాణాలు
అవసరాలకు అనుగుణం కాని వరాలు
మాటిమాటికీ వచ్చే కాటకాలు
అంతూ పొంతనా లేని దండగ పథకాలు
అవుతూనే ఉన్నాయి జన, ధన నష్టాలు
మరి కాదా ఖజానా అయ్యవారి నట్టిల్లు
ఇంకా హత్యలు, మానభంగాలు,
దోపిడీలు, లూటీలు, పగలు,
ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు,
ఆత్యహత్యలు, ఆత్మాహుతులు
సరే... మాలో మిగిలే ఉందిలే
ఎండిపోని మానవత్వం
వయసు, వర్గం, మతం, దేశం,
ప్రాంతం పక్కన పెట్టి సాగుదాంలే
ఏకోన్ముఖంగా
ఓ నూతన ఉగాదీ
శ్రీదుర్ముఖి
నీకిదే మా ఘన స్వాగతాంజలి!

- పుష్ప గుర్రాల, విజయనగరం.
సెల్ : 9491762638.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.