పశ్చిమగోదావరి

వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఏప్రిల్ 3: వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ భారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కెఎస్ జవహర్ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి సుజాత మాట్లాడుతూ ప్రజలు ఉదయం 11నుండి మధ్యాహ్నం 3గంటల వరకూ ఎండలో తిరగరాదన్నారు. ప్రతి ఒక్కరూ ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా ప్రభుత్వాసుపత్రులలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలలో ఉదయం 8నుండి 10 గంటలు వరకూ మాత్రమే పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టిడిపి వర్గీయులు వేసవిలో ప్రజలు తమ సేవలు అందజేయాలన్నారు. మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. జిల్లాలో ఇసుక రీచ్‌లను ఎక్కువగా ప్రారంభించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఇసుక అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఇసుక ఏ రీచ్‌లో అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవచ్చునన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే జవహర్, మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్, టిడిపి నేతలు జెవిఎస్ చౌదరి తదితరులు ఉన్నారు.