రంగారెడ్డి

ఆర్‌ఎంపీ వైద్యులకు శిక్షణా కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16: రాష్ట్రంలోని ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులకు శిక్షణా తరగతులు నిర్వహించడానికి అదనంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డీఎంహెచ్‌ఓకు తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ, ఈపీ, సీపీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.శివగారి వెంకట రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులతో కలిసి మంగళవారం రంగారెడ్డి వైద్య, ఆరోగ్య అధికారి డా.స్వరాజ్య లక్ష్మిని కలిసి సమస్యలను వివరించారు. ఆర్‌ఎంపీ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని, కొండాపూర్‌లోని ప్రభుత్వ దవాఖానలో అదనంగా మరో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
వికారాబాద్, ఏప్రిల్ 17 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు, హెల్త్ సూపర్‌వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొందరు వైద్యులు, వైద్య సిబ్బంది లక్ష్యాలను మించి ప్రసవాలు చేయగా, మరికొందరు లక్ష్యాలను సాధించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్య సాధనకోసం ఆశా వర్కర్స్ ద్వారా గ్రామాల్లో గర్భిణీలను గుర్తించి ఆసుపత్రులకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీలకు ప్రతి మాసం వైద్య సేవలు అందించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. కష్టతరమైన కేసులను గుర్తించి మెరుగైన సేవలకోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సౌకర్యాల కోసం హెచ్‌డీఎస్ నిధులు నుంచి సమకూర్చుకోవాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఉపేందర్‌రెడ్డి, డాక్టర్ లలిత, డాక్టర్ సాయిబాబా ఉన్నారు.