పశ్చిమగోదావరి

బడుగుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 14: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే థ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గతంలో నాలుగులేన్ల రహదారి నిర్మాణం కోసం భీమవరం పట్టణ శివారుల్లో నివవిస్తున్న ఆక్రమణదారుల ఇళ్ళను ప్రభుత్వం తొలగించింది. వీరందరూ నిరాశ్రయులయ్యారు. పేదలు నిరాశ్రయులయ్యారన్న విషయం తెలుసుకున్న విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి 2 ఎకరాల 50 సెంట్ల భూమిని పేదల కోసం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆనుకుని ఉన్న కొవ్వాడ - అన్నవరం గ్రామంలో కొనుగోలు చేశారు. ఈ భూమిలో ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం ద్వారా ఇళ్ళను నిర్మించేందుకు గురువారం శంకుస్థాపన ఏర్పాటుచేశారు. జిల్లాపరిషత్ డిప్యూటీ సిఇఒ వై.పరదేశీకుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి, గంగరాజు మాట్లాడుతూ పేదవాడి సొంతి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అల్లూరి కృష్ణంరాజు, తహసీల్దార్ గంధం చెన్నుశేషు, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.