రంగారెడ్డి

వైభవంగా జన్మాష్టమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఆగస్టు 24: కీసర మండలంలోని పలు గ్రామాల్లో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి, చీర్యాల శ్రీలక్ష్మీ నృసింహస్వామి, నాగారం శ్రీసత్యనారాయణ స్వామి, కీసరలోని శ్రీకృష్ణ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కీసరలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్టికొట్టి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాగారం సెరినిటీ పాఠశాలలో, కీసరలోని పుడమి స్కూల్, అరుంథతి పాఠశాల, చీర్యాలలోని నారాయణ గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణుని వేషదారణల్లో అలరించారు. పుడమి, అరుంధతి పాఠశాల విద్యార్థులు కీసరలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పుడమి పాఠశాల ప్రినిపాల్ రాయిల హరిణి భాస్కర్, కరస్పాండెంట్ శ్రీరాములు, సెరినిటీ పాఠశాల కరస్పాంటెంట్ జంగిరెడ్డి, డైరెక్టర్ వసంత, అరుంథతి పాఠశాల కరస్పాంటెంట్ దశరథ్ గౌడ్, ప్రిన్సిపాల్ ప్రసన్న, రాంరెడ్డి పాల్గొన్నారు.
తలకొండపల్లి: చుక్కాపూర్ గ్రామ పంచాయితీలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం కలికిదోణ వేణుగోపాల స్వామి, దుర్గమాత దేవాలయం ఆవరణలో తలకొండపల్లి మండల టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు నల్లపురం శ్రీనివాస్ రెడ్డి, చుక్కాపూర్ సర్పంచ్ దాసరి కిష్టమ్మ, మాజీ ఎంపీటీసీ దాసరి యాదయ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉట్టి కొట్టే మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్యాంసుందర్, బుచ్చిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కృష్ణయ్య, నారాయణ, శంకర్‌జీ, మల్లారెడ్డి, పర్వతాలు, వెంకట్ రెడ్డి, చంద్రు, నర్సింహా, యాదయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.
వికారాబాద్: శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని శనివారం పట్టణంలోని వివేకవాణి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్ని కృష్ణులు, గోపికల వేషదారణలో చిన్నారి విద్యార్థులు పలువురిని అలరించారు. ఉట్టి కొట్టడంతో పాటు కోలాటాలు ఆడారు. ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారులతో కోలాటం ఆడి అందరి చూపు మరల్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.నాగయ్య, నాయకులు చందర్ నాయక్, లక్ష్మణ్, సంతోష్ ఉన్నారు.
జీడిమెట్ల: గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు 11 గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేసి ఉట్టీ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతల్‌లోని రెయిన్ బో స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా చిన్నారి బాలబాలికలు కృష్ణుడు, గోపికల వేషదారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉప్పల్: బోడుప్పల్ ప్రధాన రహదారిలోని కాకతీయ ఈ టెక్నో స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు కరస్పాండెంట్ డాక్టర్ అనంతరెడ్డి భగవద్గీత పుస్తకాలు, పెన్నులు, పెన్సి బాక్స్‌లు, కథల పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలతి, టీచర్లు పాల్గొన్నారు. మేడిపల్లిలోని సరస్వతి ప్లే స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మి, భాగ్యలక్ష్మి, స్వప్న, రూప పాల్గొన్నారు. చెంగిచర్లలో మాజీ ఎంపీటీసీ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో, టీఆర్‌ఎస్ బోడుప్పల్ కార్యాలయంలో నేతలు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నార్సింగి: శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం గండిపేటలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషాదారణ పోటీలు నిర్వహించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తయారు చేశారు. నాటకాలు, ఉట్టికొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ హాజరయ్యారు. గోకరి అర్జున్ గౌడ్, సురేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, సదానంద్, సహదేవ్ గౌడ్, నర్సింహ గౌడ్, నవీన్ పాల్గొన్నారు.
నేరేడ్‌మెట్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నేరేడ్‌మెట్, వినాయకనగర్, ఆనంద్‌బాగ్, వసంతపురికాలనీ, వౌలాలి ప్రాంతాలలో నిర్వహించారు. కార్పొరేటర్ ఎన్. జగదీష్ గౌడ్ మాట్లాడుతూ చిన్న తనం నుండి పిల్లలకు మన సంస్కృతి సంప్రాదాయల పట్ల అవగహన కల్పించాలని తెలిపారు.
బొంరాస్‌పేట: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం మండలంలో ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని స్వామి వివేకానంద పాఠశాలలో విద్యార్థులు.. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. కోలాటం నృత్యాలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఆద్యాంతం అలరించాయి.
మేడ్చల్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శనివారం మేడ్చల్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పలు కాలనీల్లో ఇళ్ల వద్ద చిన్నారులకు శ్రీకృష్ణుడి వేషధారణలు వేసి కృష్ణాష్టమి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. అత్వెల్లిలోని మైనారిటీ కాలనీలో పలువురు ముస్లిం చిన్నారులకు కూడా కృష్ణుడి వేషధారణలు వేయడం గమన్హారం.
కిష్టాపూర్ రోడ్డులోని శ్రీనివాస్ కల్యాణ మండపంలో వేడుకలను పురస్కరించుకుని హరేరామ హరేకృష్ణ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిచారు.
మెహిదీపట్నం: లంగర్‌హౌస్ శ్రీసరస్వతీ శిశు మందిరంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించారు. కార్యక్రమంలో పరిమిశెట్టి సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, కృష్ణ యాదవ్, గంగాధర్, ఇంద్రసేనా రెడ్డి, పూర్ణచందర్ రావు పాల్గొన్నారు. బాపూఘాట్ శ్రీ రాంచంద్రజీ మఠ్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మఠాధిపతి శ్రీ రాహుల్‌దాస్ బాబా ఆధ్వర్యంలో జరిగాయి.