యువ

మీరూ విజేతలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎందుకు వెనుకబడి పోతున్నాం..ఎందుకు విజయాల మైలురాళ్లను అధిగమించలేక పోతున్నాం..ఇది వేలాది మందిని వేధించే ప్రశ్న. పరుగు పెట్టడం ఎంత ముఖ్యమో..మనల్ని మనం నిగ్రహించుకోగలిగే రీతిలో పరుగాపడమూ అంతే ముఖ్యం..ఈ రెంటి మధ్య ఉన్న తేడాను గమనిస్తే..అనుక్షణం గమనంలోకి తీసుకుంటే విజయం అందరినీ వరిస్తుంది..విజేతలు వేళ్లపై లెక్క పెట్టే సంఖ్యలో కాదు..ప్రతి ఒక్కరిలోనూ ఉంటారు..
****
ఎన్నో సాధించాలనుకుంటాం.. ఎన్నో కలలు కంటాం..తప్పటడుగులు వేసే దశ నుంచి జీవితంలో పరుగులు పెట్టే వరకూ మానవ జీవితం కోరికల మయం. వాటిని తీర్చుకోవడంలోనూ, ల క్ష్యాలను చేరుకోవడంలో నూ కొందరినే విజయం వరిస్తుంది. వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే విజయాలు ఉంటే కోటానుకోట్ల సంఖ్యలో అపజయాలు, పరాజయాలూ వికటాట్టహాసం చేస్తూంటాయి. ఈ కొందరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? వారినే విజయాలు వరించడానికి కారణం ఏమిటి? మిగతావారికీ వీరికి మధ్య లక్ష్యాల నిర్థారణలోనూ, వాటిని సాధించాలనుకోవడంలోనూ పట్టుదల, అంకిత భావంలోనూ తారతమ్యాలు ఎందుకు ఉంటాయి? వాటికి కారణం ఏమిటన్నది లోతుగా పరిశీలిస్తే తప్ప అర్థం కానిదే! విజయానికి, అపజయానికి మధ్య ఉండే స్పల్పమైన రేఖను గుర్తించగలిగితే అసలు సంగతి అర్థమవుతుంది. మనలో ఉన్న లోపమేమిటో.. విజయాలను పరంపరగా అందుకుంటు న్న వారిలో ఉన్న సుగుణమేమిటో తేటతెల్లమవుతుంది. అందరికీ ఆలోచనలుంటాయి. జీవితంలో ఏదో సాధించేయాలన్న కోరికా ఉంటుం ది. కానీ ఎప్పుడు ముందుకెళ్లాలి.. తొలి అడుగు ఎప్పుడు పడాలి.. అందుకు మనల్ని మనం ఎంతగా నిగ్రహించుకోవాలి..మన ఆలోచనలను, ప్రవర్తన ను ఎలా నియంత్రించుకోవాలన్నదానిపైనే అసలు విజ యం ఆధారపడి ఉం టుంది. ఇందుకు ప్రధానంగా కావాల్సింది మానసిక స్థిరత్వం..ఎలాంటి ప్రలోభాలకు, వత్తిళ్లకు లొంగని ఆలోచనా రీతి. దీన్ని అదిమిపెట్ట గలిగితే..మనల్ని మనం ప్రతికూల పరిస్థితుల్లో తమాయించుకోగలిగితే..అనుకున్న లక్ష్యాలను సగం మేర చేరుకున్నట్టే! మన జీవితంలో మనం నిజంగా నియంత్రించుగోదగ్గవి మన ఆలోచలు, ప్రవర్తన, మనోభావాలనే..!ఈ మూడే ఎవరి జీవితాన్నయినా ఉన్నత స్థాయికి తీసుకెళతాయి..అదే విధంగా అథఃపాతాళానికీ తొక్కేస్తాయి. ఈ ఐహిక బంధాలు, బంధనాలను అదుపుచేసుకోవడంలోనే.. వాటిని నియంత్రించుకోవడంలోనే మన విజయం ఆధార పడి ఉంటుంది. ప్రపంచంలో విజేతలుగా రాణిస్తున్న వారి జీవితాలను లోతుగా పరిశీలిస్తే..ఇలాంటి సుగుణాలెన్నో ద్యోతకమవుతాయి. జీవితంలో ఎదగాలనుకునే వారికి దివిటీలుగా, మార్గదర్శకాలుగా పని చేస్తాయి. ఆలోచనలు, మనోభావాలు, ప్రవర్తనా రీతిని నియంత్రించుకోవడం అన్నది అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు. ఇందుకు చాలా బలమైన, దృఢమైన మానసిక పరిణతి, దృఢత్వం, స్థిరత్వం కా వాలి. భావావోద్వేగ పరిస్థితుల్ని అధిగమించేందుకు, ఆలోచనలకు కళ్లెం వేయాలంటే..వత్తిళ్లకు లొంగకుండా సమ యస్ఫూర్తిని, సమయోచిత ప్రవర్తనా రీతిని అలవరచుకోవాలి. ప్రతి మని షి విజయం వెనుక అత డి వ్యక్తిత్వమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్య అంశాలకు తను ప్రభావితం కాకుండా తన గుణాత్మక ప్రవర్తనా రీతితో ఇతరుల్ని ప్రభావితం చేయగలగడమే విజేతల లక్షం.. లక్షణం కూడా.. వీటిని మీరు సొంతం చేసుకోవచ్చు.. అందుకు కావాల్సిందల్లా మనల్ని మనం అర్థం చేసుకోగలగడం..ఇతరుల్ని చూసి నేర్చుకోవాలన్న సానుకూల లక్షణాన్ని పెంపొందించుకోడం. లక్ష్యమేదైనా..దాన్ని సాధించుకునేందుకు మనం ఎంచుకునే మార్గమే కీలకం. ఆ మార్గం ఎలాంటిదన్నదానిపైనా గమ్యం చేరువ కాడం..మరింత సుదూరమయం కావడం జరుగుతుంది. విజయాలు జన్మలక్షణం కాదు..పరాజయాలూ అంతకంటే కాదు.. ఈ వాస్తవాలను దృషి టలో పెట్టుకుంటే కాదేదీ ఆశయానికి అనర్హమన్న వౌలిక సూత్రం కరతలామలకమవుతుంది. అదే మన విజయానికి తొలి మెట్టు..గమ్యాలను సునాయాసంగా సాధించుకోవడానికీ అందివచ్చే అవకాశాల నిచ్చెన!

-బి.సుధ