ఆటాపోటీ

టెస్టు సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నలభయ్యేళ్ల వయసులో టెస్టు మ్యాచ్ ఆడడం సామాన్యం కాదు. అందులోనూ సెంచరీ సాధించడమంటే మాటలు కాదు. ఈ అరుదైన రికార్డు విజయ్ మర్చంట్ ఖాతాలో ఉంది. 1952లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఢిల్లీ టెస్టులో సెంచరీ చేసినప్పుడు అతని వయసు 40 సంవత్సరాల 22 రోజులు. మన దేశం తరఫున సెంచరీ చేసిన వారిలో ఎక్కువ వయసుగల బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించాడు. రాహుల్ ద్రవిడ్ తన 39వ ఏట అడుగు పెట్టడానికి రెండు నెలల ముందు, 2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేశాడు. కెరీర్‌లో అతనికి అది 36వ శతకం. అదే ఆఖరి సెంచరీ కూడా. వినూ మన్కడ్ తన 38వ ఏట న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు శతకాలు సాధించాడు. సచిన్ తెండూల్కర్ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో, 1990లో ఈ ఫీట్ సాధించిన అతను చిన్న వయసులోనే టెస్టుల్లో శతకాన్ని నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా అంతకు ముందు కపిల్ దేవ్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు చేశాడు. సచిన్‌కు చివరి టెస్టు శతకం 2011 జనవరిలో లభించింది. అప్పటికి అతని వయసు 37 సంవత్సరాల 255 రోజులు.