ఆటాపోటీ

ఫిట్నెస్ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అథ్లెట్స్‌ను మించిన ఫిట్నెస్ లేకపోతే, ఫ్రెంచ్ ఓపెన్‌లో రాణించడం అసాధ్యం. ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ వంటి కొంత మందికి మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ సొంతం. తొమ్మిది సార్లు పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న నాదల్ ఈనెల 22 నుంచి జూన్ 5 వరకూ జరిగే ఈటోర్నీలో గెలుస్తాడా అన్నది అనుమానంగానే ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న రాఫెల్‌ను గాయాల సమస్య వెంటాడుతున్నది. 2014 పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అతను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్‌ను 3-6, 7-5, 6-2, 6-4 తేడాతో ఓడించాడు. క్లే కోర్టుపై ఆడాలంటే ఫిట్నెస్ సమస్యలు ఉండకూడదు. ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న నాదల్ గతంలో మాదిరి కోర్టులో వేగంగా కదల్లేకపోతున్నాడు. హోరాహోరీగా సాగే పోరులో అతను నెగ్గుకురావడం కష్టంగానే కనిపిస్తున్నది. నిరుడు అతని పోరు క్వార్టర్ ఫైనల్స్‌కే పరిమితమైంది. 2014లో జొకోవిచ్‌ను ఓడించిన అతను అదే ప్రత్యర్థి చేతిలో 5-7, 3-6, -6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. కాగా, అదే విజయపరంపరలను కొనసాగించిన జొకోవిచ్‌కు ఫైనల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఎవరి అంచనాలకు అందని విధంగా స్టానిస్లాస్ వావ్రిన్కా అతనిని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. ఈసారి జొకోవిచ్, ఆండీ ముర్రే, డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా, రోజర్ ఫెదరర్, థామస్ బెర్డిచ్ వంటి మేటి ఆటగాళ్లు తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో నాదల్ కెరీర్‌లో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకోవడం అనుమానంగానే ఉంది.
ఫిట్నెస్ సమస్యలు చాలాకాలంగా అతనిని పలు టెన్నిస్ టోర్నీలకు దూరం చేశాయి. పాల్గొన్న టోర్నీల్లో అతను ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. గత రెండు నెలల కాలంలో పరిస్థితి కొంత మెరుగైనట్టు కనిపిస్తున్నది. దీనితో నాదల్ కూడా టైటిల్ రేసులో ఉండడం ఖాయం. ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, రెండో స్థానంలో ఆండీ ముర్రే, వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్, డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా తదితరులు ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్‌పై కనే్నశారు. గతంతో పోలిస్తే ఈసారి పోరు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలున్నాయి.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న నిరుటి విజేత సెరెనా విలియమ్స్ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. చక్కటి ఫామ్‌లో ఉన్న ఆమెనే ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. నిరుడు ఆమె లూసీ సఫరోవాను 6-3, 6-7, 6-2 తేడాతో ఓడించింది. మొత్తం మీద ఫ్రెంచ్ ఓపెన్‌లో 2002, 2013, 2015 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన సెరెనా ఖాతాలో ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో మొత్తం 36 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు ఉన్నాయి.
వీటిలో 13 డబుల్స్ విభాగంలో, 2 మిక్స్‌డ్ డబుల్స్‌లో సాధించనవికాగా, సింగిల్స్ విభాగంలో 21 టైటిళ్లను ఆమె గెల్చుకుంది. టెన్నిస్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో అత్యధిక టైటిళ్లను సాధించిన క్రీడాకారిణుల్లో సెరెనాది మూడో స్థానం. మార్గరెట్ కోర్ట్ 24 టైటిళ్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, 22 టైటిళ్లతో స్ట్ఫె గ్రాఫ్ రెండో స్థానంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌ను సెరెనా నిలబెట్టుకుంటే, ఆమె స్ట్ఫె గ్రాఫ్ సరసన చోటు సంపాదిస్తుంది. అయితే, ఆమెతో పాటు విక్టోరియా అజరెన్కా, ఏంజెలిక్ కెర్బర్, ఇటీవల కాలంలో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి దూసుకొచ్చిన యువ క్రీడాకారిణులు గార్బినె ముగురుజా, టిమియా బాసిన్‌స్కీ కూడా టైటిల్ రేసులో ఉన్నారు.