పశ్చిమగోదావరి

నకిలీల అడ్డా అకివీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, మే 31: ఏమో గుర్రం ఎగరావచ్చు... నువ్వే స్వారీ చేయావచ్చు...! అన్నాడో రచయిత. కాసులుంటే ఎంతటి పనైనా ఇట్టే జరిగిపోతోంది. గత కొన్నిరోజులుగా ఆకివీడు ప్రాంతంలో నకిలీల దందా కొనసాగుతుంది. 2006 సంవత్సరంలో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో ఆంధ్రాబ్యాంకులో రూ. 1.19 కోట్లు రుణాలు పొందిన వైనం వెలుగుచూసింది. ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తతంగమంతా బట్టబయలైంది. నకిలీ పాస్‌పుస్తకాలను తయారుచేసి తహసీల్దార్, విఆర్వోల సంతకాలతో 119 మంది వ్యక్తులు ఆంధ్రాబ్యాంకు నుంచి రుణాలు పొందారు. అయితే సర్వేనెంబర్లు వేరే యాజమానులకు చెందిన వారివి వేసి ఈ పుస్తకాలు పొందారు. ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చూసి కూపి బయటకు లాగారు. దీంతో రుణాలు పొందిన వారు ఒక్కొక్కరిగా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు తయారుచేసే ముఠా వెలుగులోకి వచ్చింది. ఏలూరుపాడు, దుంపగడప, సమతానగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి, వారు జన్మించిన సమయంలో ఆసుపత్రిలో నమోదు కానిపక్షంలో, ఆర్డీవో స్థాయ అధికారి నుండి నాన్ అవైయిలబులిటీ సర్ట్ఫికెట్ పొందాల్సి ఉంది. అయతే వీరు దీనితో సంబంధం లేకుండా మీసేవా కేంద్రాల నుంచే జనన ధ్రువీకరణ పత్రాలు పొందారు. అయితే పాస్‌పోర్టు ఎంక్వయిరీ నిమిత్తం వెళ్ళిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు జనన ధ్రువీకరణ పత్రాలు నకిలీవి సమర్పించారని నిర్ధారణకు వచ్చారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక ఎస్ టర్నింగ్ సమీపంలోని మీసేవా కేంద్రం నుంచి ఈ పత్రాలు జారీ అయినట్లు గుర్తించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఎన్ ఠాగూర్ విచారించారు. ఈ సర్ట్ఫికెట్స్ తమ దృష్టికి రాలేదని, తన డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కడియాల అశోక్‌కుమార్ రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు. మీసేవా కేంద్రం నిర్వాహకురాలితో పాటు ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని మంగళవారం విచారించారు. ఈ కోణంలోనే నకిలీ ధ్రువపత్రాలతో పాస్‌పోర్టులు తయారుచేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యక్తి గత కొంతకాలంగా పాస్‌పోర్టుకు సంబంధించి పత్రాలు అభ్యర్థుల వద్ద లేనప్పటికీ వారి నుంచి పెద్దమొత్తంలో సొమ్ము వసూళ్లు చేసి పాస్‌పోర్టులను సిద్ధం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భీమవరం రూరల్ సిఐ ఆర్‌జి జయసూర్యతో పాటు నిఘా సిబ్బంది ఈ నకిలీ ముఠాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రస్తుతం వీరి నుంచి కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకోవడానికి నాన్ అవైల్‌బులిటీ సర్ట్ఫికెట్లు లేని వారంతా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆకివీడుకు వచ్చి ఈ నకిలీ దందా చేసే వ్యక్తుల ద్వారా పాస్‌పోర్టులు చేయించుకుంటున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నకిలీ వ్యవహారాలను మరో రెండు రోజుల్లో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒక కొలిక్కి తీసుకువచ్చే అవకాశముందనే సమాచారం.

బెట్టింగ్ బకాయలే కిడ్నాప్‌కు కారణం
ముగ్గురు బుకీలు అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మే 31: భీమవరంలో జరిగిన యువకుడి కిడ్నాప్‌నకు క్రికెట్ బుకీల నడుమ బెట్టింగ్ బకాయల వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫలితంగా కిడ్నాప్‌కు గురైన బుకీ ఫిర్యాదుతో ముగ్గురు బుకీలను భీమవరం టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించి వివరాలను టూ టౌన్ సిఐ రమేష్‌బాబు మంగళవారం విలేఖర్లకు తెలిపారు. కిడ్నాప్ కేసులో ఫిర్యాదుదారుడు కఠారి సత్యకృష్ణవర్మ గతంలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఈ నెల 29న సత్యకృష్ణవర్మకు చందు అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాను గతంలో రూ.25 వేలు బకాయి ఉన్నానని, ఎఎస్‌ఆర్ నగర్‌కు వస్తే బకాయి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో వర్మ తన కారులో ఎఎస్‌ఆర్ నగర్‌లోని ఝాన్సీలక్ష్మీబాయ్ పాఠశాల వద్దకు వెళ్లగా, ఇద్దరు వ్యక్తులు కారు వద్దకు వచ్చి బలవంతంగా వర్మను (ఏపి 33 డి 007 నెంబర్) కారులో పాలకొల్లు రోడ్డులో ఉన్న శృంగవృక్షం తీసుకువెళ్లి గ్రామంలోని పొలాల్లోకి లాక్కుపోయారు. వర్మ తండ్రి శ్రీనివాసరాజుకు ఫోన్‌చేసి, రూ.12లక్షలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. తండ్రి శ్రీనివాసరాజు కంగారుపడి ప్రస్తుతం తన వద్ద రూ.4.25 లక్షలు ఉన్నాయని, అవి ఇస్తానని చెప్పాడు. దీంతో కిడ్నాపర్లు భీమవరం పట్టణంలోని శివారులో ఉన్న ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్దకు రావాలని ఆదేశించారు. అక్కడ డబ్బు తీసుకున్న కిడ్నాపర్లు కొంతదూరం కారులో వెళ్లిన తరువాత వర్మను వదిలివేశారు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు. స్థానిక ఉండి రైల్వేగేటు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చందు, అతని స్నేహితుడు నాయుడు, మరో స్నేహితుడు నాగరాజును పట్టుకుని వారి వద్ద ఉన్న రూ.4లక్షల 25వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముగ్గురు బుకీలను అరెస్టుచేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు.

భూకంపం

*‘్భసేకరణ’లో పూర్తి ప్రక్షాళన
*18 మంది డిటిలు బదిలీ
*8 మంది సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి

ఏలూరు, మే 31 : ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల అవసరం పెద్ద ఎత్తున పెరిగిందనే చెప్పాలి. అలాంటి వ్యవస్థకు భూసేకరణ విభాగాలు దాదాపు ప్రాణాదారంగానే చెప్పుకోవాలి. అయితే ఈ విభాగాల్లో తిష్టవేసుకుని వుండిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీన్ని గమనించే జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ భూసేకరణ విభాగాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానని ఇంతకుముందే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే తాజాగా దాదాపు భూకంపం రీతిలో భూసేకరణ విభాగాల ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేపట్టారు. దీనిలో భాగంగా 18 మంది భూసేకరణ డిప్యూటీ తహశీల్దార్లకు స్థానచలనం కల్పించారు. వీరితోపాటు మరో ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తూ బదిలీచేశారు. మొత్తం 26 మందికి స్థానచలనం కలిగినట్లు చెప్పుకోవచ్చు. ఇక భూసేకరణ విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల బదిలీల్లో భాగంగా కెఆర్‌పురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (టిడబ్ల్యు)గావున్న వివి నారాయణను పోలవరం ఎస్‌డిటి ( ఇపి ఐసి)గా బదిలీచేశారు. పోలవరం ఎస్‌డిటి (టిడబ్ల్యు)గా వున్న ఐవి ఎస్ ఎస్ సుబ్రహ్మణ్యాన్ని నర్సాపురం డిటిగా, పోలవరం ఎస్‌డిటి (టిడబ్ల్యు)గా వున్న బి ఎస్‌వి ఆర్ ఎల్ రాజును కామవరపుకోట ఎస్‌డిటి (సిఎస్)గా, కొవ్వూరులో యూనిట్ -1 ఐ ఎస్‌పి ఆర్ ఎంసి ఎస్‌డిటి ( ఎల్‌ఎ)గా వున్న కెవివి సత్యనారాయణను కుకునూరు డిటిగా బదిలీ చేశారు. అలాగే కొవ్వూరులో యూనిట్-1 ఐఎస్‌పిఆర్ ఎంసి ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా వున్న ఎం ఆనంద్‌కుమార్‌ను తాడేపల్లిగూడెం ఎస్‌డిటి ( ఇపిఐసి)గా, కొవ్వూరు యూనిట్-1 ఐ ఎస్‌పి ఆర్ ఎంసి ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా వున్న కె త్రిమూర్తులును ఏలూరు సివిల్ సప్లయిస్ డిఎం కార్యాలయం ఎస్‌డిటిగా, ఏలూరులో యూనిట్-2 ఐ ఎస్‌పి ఆర్ ఎంసి ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా వున్న టి వెంకటేశ్వరరావును పాలకొల్లు ఎస్‌డిటి (ఇపి ఐసి)గా, ఏలూరు యూనిట్-2 ఐ ఎస్‌పి ఆర్ ఎంసి ఎస్‌డిటి ( ఎల్‌ఎ)గా వున్న ఎస్‌కె లాల్ అహ్మద్‌ను కొవ్వూరు ఆర్‌డివో కార్యాలయంలో డిటి ( ఎల్ ఆర్)గా, ఏలూరు యూనిట్-2 ఐ ఎస్‌పి ఆర్ ఎంసి ఎస్‌డిటి ( ఎల్ ఏ)గా వున్న ఎ సాయిబాబాను తణుకు ఎస్‌డిటి (ఇపిఐసి)గా, నల్లజర్ల యూనిట్-2 టి ఎల్‌ఐఎస్ ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా వున్న పిఎస్‌ఎస్ లక్ష్మిని నిడదవోలు ఎస్‌డిటి ( ఇపి ఐసి)గా, తాడేపల్లిగూడెంలో ఎస్‌డిటి (ఇపిఐసి)గా వున్న ఎస్ శ్రీనివాసరావును ఏలూరు ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా, పాలకొల్లు ఎస్‌డిటి (ఇపిఐసి)గా వున్న వై సూర్యప్రకాశరావును పోలవరం ఎస్‌డిటి (టిడబ్ల్యు)గా, కొవ్వూరు ఎస్‌డిటి (ఇపిఐసి)గా వున్న ఎస్‌విఎన్ మహాలక్ష్మిని నల్లజర్ల టిఎల్‌ఐఎస్ ఎస్‌డిటిగా బదిలీచేశారు. తణుకు ఎస్‌డిటి (ఇపిఐసి)గా వున్న ఎస్‌కె సలీమ్‌ను కొవ్వూరు ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా, నిడదవోలు ఎస్‌డిటి (ఇపిఐసి)గా వున్న ఎం కనకదుర్గను కొవ్వూరు ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా, పోలవరం ఎస్‌డిటి (ఇపిఐసి)గా వున్న ఎం బోడయ్యను కుకునూరు ఆర్‌డివో కార్యాలయం డిటి (ఆర్ అండ్ ఆర్)గా, మొగల్తూరు డిటి జి ఉదయభాస్కర్‌ను బుట్టాయిగూడెం డిటిగా, కొవ్వూరు ఆర్‌డివో కార్యాలయంలో ఎస్‌డిటి (ఎల్‌ఆర్)గా వున్న పి సూర్యనారాయణను జీలుగుమిల్లి డిటిగా బదిలీ చేశారు.
ఇక పదోన్నతుల్లో భాగంగా ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు (ఎస్‌ఎ)కు డిటిగా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. యలమంచిలి ఎస్ ఏగా వున్న వి రవికుమార్‌ను పోలవరం ఎస్‌డిటి (టిడబ్ల్యు)గా, కలెక్టరేట్ ఎస్‌ఏగా వున్న పిఎన్‌విఎస్‌ఎస్ లక్ష్మిని ఏలూరు ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా, పెంటపాడు ఎస్ ఏగా వున్న ఎవిఎస్‌ఎస్‌ఆర్‌ఎం శేషగిరిరావును కుకునూరు ఆర్‌డివో కార్యాలయంలో డిటి (ఆర్ అండ్ ఆర్)గా, జీలుగుమిల్లి ఎస్ ఏగా వున్న బి ప్రదీప్‌కుమార్‌ను కెఆర్ పురం ఎస్‌డిటి (టిడబ్ల్యు)గా, ద్వారకాతిరుమల ఎస్ ఏగా వున్న ఎం వెంకట్రావును ఏలూరు ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా, నర్సాపురం ఆర్‌డివో కార్యాలయంలో ఎస్ ఏగా వున్న కెపి నాగదేవిని మొగల్తూరు డిటిగా, ఏలూరు కలెక్టరేట్‌లో ఎస్‌ఏగా వున్న జి రామారావును కొవ్వూరు ఎస్‌డిటి (ఎల్‌ఎ)గా, కొవ్వూరు ఐఎస్‌పి ఆర్‌ఎంసి ఎస్‌ఏగా వున్న కెయు శ్రీనివాస్‌ను కొవ్వూరు ఎస్‌డిటి (ఇపిఐసి)గా బదిలీ చేశారు.

నేడే శివదేవునికి రజత జఠాఝూట అలంకరణ
చిక్కాల విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి:కాషాయ రంగు పులుముకున్న గ్రామం
వీరవాసరం/పాలకొల్లు, మే 31: శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామివారికి శ్రీ మహాసామాజ్య్ర పట్ట్భాషేక పూర్వక రజత జఠాఝాట అలంకరణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనుంది. ఇంకోసం భారీ ఏర్పాట్లుచేశారు. చిక్కాల, బల్లిపాడు గ్రామాలు ఎక్కడ చూసినా కాషాయ వర్ణం ప్రతిఫలించింది, కంచికామాక్షి అమ్మవారు కటౌట్లు, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతీ స్వామిజీల కటౌట్లతో వీధులన్నీ కళకళలాడాయి.
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీశ్రీశ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామివారు మంగళవారం గ్రామానికి విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా మంగళవారం చిక్కాల గ్రామంలో సుమారు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటలకు స్వామివారు జాతీయ రహదారి గుండా చిక్కాల గ్రామానికి చేరుకున్నారు. గ్రామపొలిమేరల నుండి స్వామివారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. చిక్కాలకు చెందిన సిద్ధాంతి ర్యాలీ కృష్ణప్రసాద్ గృహంలో స్వామివారు విడిది చేశారు. స్వామీజీ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి దర్శనం భక్తులకు కలిగింది. రాత్రి 9 గంటల వరకు
స్వామివారి అనుగ్రహ దర్శనం కోసం భక్తులు క్యూలో నిలిచి ఉన్నారు. వచ్చిన ప్రతీ భక్తునికి స్వామివారు చిరునవ్వుతో కుంకుమ ప్రసాదాన్ని అందించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి సోమయాజులు దంపతులు, మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామివారికి శ్రీ మహాసామాజ్య్ర పట్ట్భాషేక పూర్వక జఠాఝాట అలంకరణ కోసం 30 కేజీల వెండితో తయారుచేసిన ఆభరణాలను స్వామివారు అనుగ్రహించారు. అలాగే వేరే ప్రాంతంలో ప్రతిష్ఠించనున్న నూతన శివలింగానికి స్వామివారు పూజలు చేసి వారికి అందించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి స్వామివారి జఠాఝూట అలంకరణకు బల్లిపాడు గ్రామం నుంచి వెండి ఆభరణాలను ఏనుగుపై ఊరేగిస్తూ శివాలయం వద్దకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆలయ ఇఒ సిహెచ్. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.