పశ్చిమగోదావరి

కిటకిటలాడిన మద్ది క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, మే 31: హనుమజ్జయంతి, ఏకాదశి, మంగళవారం మూడూ కలసి రావడంతో మంగళవారం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విఐపిల తాకిడితో ఆలయం ఉక్కిరిబిక్కిరైంది. స్వయంభూ ఆంజనేయస్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జాము 4.30 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. వేకువజామున దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), విజయలక్ష్మి దంపతులు, వారి కుమారుడు కార్తీక్‌వర్మ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బొడ్డు శ్రీమన్నారాయణ, కస్తూరీబాయి దంపతులు 25 వేల రూపాయల విరాళంతో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపించారు. సాయి సత్యన్ మోటార్ భక్తులకు చల్లని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీచేశారు. ప్రభుత్వ చీఫ్ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), డిసిసిబి సిఇఒ ఫణికుమార్, గురవాయిగూడెం సొసైటీ అధ్యక్షుడు కొలనువాడ సాయిరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసారు. వీరికి ఆలయం వద్ద ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) పూర్ణకుంభ స్వాగతం పలికి పూజల అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక బహూకరించారు.
ఆయల ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు వేదాశీస్సులు అందజేశారు. మంగళవారం దేవస్థానానికి రూ.5,37,340 ఆదాయం లభించినట్టు ఇఒ శివ తెలిపారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు భక్తులకు విశేష సేవలందించడంతో ఇఒ వారిని అభినందించారు. దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంకు చెందిన పాకలపాటి సురేష్, నీరజ దంపతులు 50 వేల రూపాయల విరాళం అందజేశారు. కాగా, బుధవారం ఆలయంలో శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం, గ్రామోత్సవం నిర్వహించనున్నట్టు ఇఒ తెలిపారు.

ఏడాది చివరకు స్వచ్ఛ జిల్లా
బహిరంగ మల విసర్జన నిర్మూలనపై కలెక్టర్
నల్లజర్ల, మే 31: ఈ సంవత్సరాంతానికి జిల్లాను సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. మంగళవారం నల్లజర్లలో స్టార్ గ్రాండ్ కల్యాణ మండపంలో నిర్వహించిన నీరు, పారిశుద్ధ్య మిషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మనదేశంలో ఉద్యమ స్ఫూర్తితో అందరినీ భాగస్వామ్యంచేస్తేనే సంపూర్ణ బహిరంగ మలవిసర్జన నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉద్యమంతో పనిచేస్తేనేగానీ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన నిర్మూలన సాధ్యం కాదన్నారు. కేవలం అధికారులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకూ సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారులంతా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీ ఒక్కరికీ బహిరంగ మలవిసర్జన వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ త్వరలో బహిరంగ మలవిసర్జనకు పాల్పడేవారి చిత్రాలను నేరుగా ఫ్లక్సీలుగా గ్రామ కూడలిలో ఉంచుతామన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జవహర్, బూరుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం, జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ వెంకటరమణ, ఎంపిపి జమ్ముల సతీష్, జడ్పీటీసీ కొఠారి అనంతలక్ష్మి, సర్పంచ్ యలమాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నవ నిర్మాణ దీక్షకు కార్యాచరణ ప్రణాళిక
-ఏర్పాట్లపై కలెక్టర్‌తో చర్చించిన విప్ చింతమనేని
ఏలూరు, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కోరారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో నవన నిర్మాణ దీక్షా కార్యక్రమంపై జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్‌తో మంగళవారం సాయంత్రం ఆయన చర్చించారు. తెలుగు రాష్ట్రాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా రెండు ముక్కలుగా విడదీసిన జ్ఞాపకాలను మరొకసారి ప్రజలకు తెలియజేసి కష్టపడి అభివృద్ధి బాటలో ఏ విధంగా ముందడుగు వేస్తున్నామో వాటి వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రజాహితం కోసం చేపట్టే సంక్షేమ పధకాలన్నీ మరింత పటిష్టవంతంగా అమలు చేసి ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలని అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. జూన్ 2వ తేదీన ప్రతీ పల్లెలో నవ నిర్మాణ దీక్షపై ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రతీ నియోజకవర్గానికి జిల్లాస్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించి సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం ఆనాడు తెలుగునాట ఎక్కడైతే రోడ్డెక్కి నిరసన తెలిపారో అదే ప్రాంతాలలో నవ నిర్మాణ దీక్ష కోసం జూన్ 2వ తేదీన జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో జరిగే నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞా కార్యక్రమంలో పది వేల మంది ప్రభుత్వోద్యోగులు, ప్రజలు పాల్గొనేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఇందుకు ప్రజాప్రతినిధులుగా తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని చింతమనేని చెప్పారు. జూన్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై చర్చాగోష్టిలు, రాష్ట్రం విడిపోకముందు పరిస్థితి విడిపోయిన తర్వాత సాధిస్తున్న ప్రగతి తీరు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు ద్వారా సాధించే ప్రగతి లక్ష్యాలపై సమగ్ర చర్చ జరపాలని కోరారు. జూన్ 8వ తేదీన మహా సంకల్పదినాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని ప్రతీ గ్రామంలో ఈ మహా సంకల్పం ఒక పండుగ వాతావరణంలో జరిగేలా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు.

జూన్ నెలాఖరుకు నిర్మించి నూరు శాతం లక్ష్యాన్ని పూర్తిచేస్తామన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ ప్రాంతంలో 4వేల మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంకాగా అక్టోబర్ నాటికి పూర్తిచేస్తామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 2015-16 సంవత్సరానికిగానూ 1,02,509 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, దానిలో 27,243 మరుగుదొడ్లు పూర్తిచేశామన్నారు. ఇందుకుగానూ రూ.4.8 లక్షలు ఖర్చు చేశామన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ త్వరలో బహిరంగ మలవిసర్జనకు పాల్పడేవారి చిత్రాలను నేరుగా ఫ్లక్సీలుగా గ్రామ కూడలిలో ఉంచుతామన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తదితరులు మాట్లాడుతూ వారివారి నియోజకవర్గాల వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియజేశారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం, జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ వెంకటరమణ, ఎంపిపి జమ్ముల సతీష్, జడ్పీటీసీ కొఠారి అనంతలక్ష్మి, సర్పంచ్ యలమాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈదురుగాలుల బీభత్సం
ద్వారకాతిరుమల, మే 31: భారీ ఈదురుగాలులు సోమవారం రాత్రి బీభత్సాన్ని సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన గాలులకు మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో జన జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడింది. మండలంలో సోమవారం రాత్రి భారీగా ఈదురుగాలులు వీయడంతో భీమడోలు నుండి ద్వారకాతిరుమల సబ్ స్టేషన్‌కు వచ్చే 11కెవి విద్యుత్ స్తంభాల వైర్లు నేలనంటాయి. సూర్యచంద్రరావుపేట వద్ద వరుసగా నాలుగైదు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో రాత్రంతా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయమేర్పడింది. అయితే సంబంధిత శాఖాధికారులు, సిబ్బంది గాలుల ప్రభావం తగ్గిన అనంతరం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రత్యామ్నాయంగా మరో లైనుద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరింపజేశారు. అలాగే గొల్లగూడెం వద్ద ఒక వైపు రోడ్డుకు అడ్డంగా తాడిచెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది. అలాగే సూర్యచంద్రరావుపేటలో గాలులకు అరటి తోటలు నేలనంటాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు.

ప్రతి గడపకు హిందూధర్మం చేరుకోవాలి

సమరసత సేవా ఫౌండేషన్ ధర్మప్రచారక్ వీర్రాజు
బుట్టాయగూడెం, మే 31: దేశంలోని మారుమూల పల్లెల్లో సైతం ప్రతి గడపకు హిందూధర్మం చేరుకునే విధంగా కృషిచేసి, హిందూధర్మం గొప్పదనం, ఆధ్యాత్మికత విలువలను తెలియజెప్పడమే సమరసత సేవా ఫౌండేషన్ లక్ష్యమని షౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ కొండపల్లి వీర్రాజు తెలిపారు. హనుమజ్జయంతి సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలో పలు గ్రామాలను సందర్శిస్తూ, మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బుట్టాయగూడెం అభయాంజనేయస్వామి ఆలయం వద్ద వీర్రాజు మాట్లాడుతూ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగేది హిందూమతం మాత్రమే అన్నారు. ర్యాలీ నిర్వహించిన గ్రామాల్లో ఆంజనేయస్వామి మందిరాలు, రామాలయాల్లో హనుమాన్‌చాలీసా పఠనం చేశారు. రామభక్త హనుమాన్ చరిత్రను గానంచేస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. దొరమామిడి రామాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ అలివేరు డ్యాం, చినజీడిపూడి, పెద జీడిపూడి, గురుగుమిల్లి, రంగాపురం, గుబ్బిసమామిడి, గుర్రప్పగూడెం, తెల్లంవారిగూడెం, ముప్పినవారిగూడెం మీదుగా బుట్టాయగూడెం చేరుకుంది. దువ్వెల దుర్గారావు, ఉడతా లక్ష్మణరావు, గ్రంధి వెంకటేశ్వరరావు, కోమటి లాలాస్వామి, కొండేపాటి రామకృష్ణ, కుంజా గంగులు, ఆరేపల్లి శేఖర్ పాల్గొన్నారు.

పసికందు దహనంపై దర్యాప్తు
దెందులూరు, మే 31 : జన్మించిన రెండ్రోజులకే ఒక పాపను దెందులూరు మండలం కొవ్వలివారిగూడెంలో దహనం చేసిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం రెండ్రోజుల వయస్సున్న చంటిపాప మృతిచెందడంతో కుటుంబ సభ్యులు దహనం చేశారు. దహనం అసంపూర్తిగా జరిగి, కొద్ద్భిగం మిగలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. చంటిపాప సహజీవనం ద్వారా జన్మించిందని, వెంటనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు దహనం చేసినట్లు తెలిసింది.

ఎస్ చిక్కాలలో భారీ బందోబస్తు
మెటల్ డిటెక్టర్లు,
బాంబు స్క్వాడ్లతో తనిఖీ
వీరవాసరం, మే 31: కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామివారి రాక సందర్భంగా మంగళవారం చిక్కాల గ్రామంలో నరసాపురం డిఎస్పీ పూర్ణచంద్రరావు, పాలకొల్లు సిఐ చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. స్వామివారు విడిది చేసే ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు దొర్లకుండా మెటల్ డిక్టేటర్లు, బాంబు స్క్వాడ్‌లను రప్పించారు. జయేంద్ర సరస్వతీ స్వామివారు వచ్చే వాహనం చుట్టూ ప్రత్యేక పోలీసులను నియమించారు. స్వామివారు వచ్చే దారిని క్షుణ్ణంగా పరిశీలించారు. స్వామివారు వచ్చే రహదారులకు అనుసంధానంగా ఉన్న అన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. భక్తులను క్యూలో ఉంచడం, వారికి అవసరమైన తాగునీటిని అందించడంలో, వృద్ధులు, చంటిపిల్లలను స్వామివారి దర్శనానికి పంపించడంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

నవ నిర్మాణ దీక్షలో అంతా పాల్గొనాలి
నరసాపురం, మే 31: జూన్ 2 నుంచి నిర్వహించనున్న నవనిర్మాణ దీక్షలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే మాధవనాయుడు, సబ్ కలెక్టర్ ఎఎస్ దినేషకుమార్ పాల్గొన్నారు. కమిషనర్ పి రమేష్, తహసీల్దార్లు జి సూర్యనారాయణరెడ్డి, ఎస్ హరినాథ్, ఎంపిడిఒ కన్నమనాయుడు, ఎఒ రవేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జయేంద్ర సరస్వతి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మే 31: భీమవరం హౌసింగ్‌బోర్డు కాలనీలో వేంచేసియున్న శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామివారిని కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామిజీ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా స్వామిజీకి ఆలయ కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకట్రాజు, కార్యదర్శి కుక్కల బాల వెంకట రత్నం, సభ్యులు ఎస్ రామారావు, కొత్తపల్లి శివశంకర్ అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొత్తూరి ఆంజనేయరాజు, తాడికొండ కోటేశ్వరరావుగుప్తా, గొట్టుముక్కల మురళీ, చెరుకువాడ రంగసాయి, కె సుబ్బరాజు తదితరులు స్వామిజీ ఆశీస్సులు పొందారు.