యువ

ఆమె దారి... రహదారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషంగా ఉండటమెలా?
ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గరా ఒక్కొక్క రకమైన సమాధానం ఉంటుంది. కానీ, కుంగుబాటుతో బాధపడే యువతకు ఆ మానసిక రుగ్మతనుంచి బయటపడి.. సంతోషంగా జీవించడమెలాగో తెలియజెప్పడం సనా ఇక్బాల్‌కు మాత్రమే తెలుసు. ఎందుకంటే...మూడు పదుల వయసులోనే అనేక కష్టాలు అనుభవించింది సనా. ఇరవై ఆరేళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాది తిరిగేలోగా ఆ పెళ్లి పెటాకులైంది. ఏం చేయాలో తోచక నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. చివరకు తనకు తాను ధైర్యం తెచ్చుకుని, తనను తాను మార్చుకుంది. తనలా బాధపడేవారిని మార్చాలని కంకణం కట్టుకుంది. ఇప్పుడామె అనేకమంది జీవితాల్లో సంతోషం నింపుతోంది. హైదరాబాద్‌కు చెందిన సనా ఇక్బాల్ కథ ఇది.
సనా తల్లిదండ్రులు ఇద్దరూ లాయర్లే. వివాహం విఫలమయ్యాక కొంతకాలం కుంగుబాటు (డిప్రెషన్)కు గురైంది సనా. ఈలోగా తండ్రి కూడా మరణించడంతో మానసికంగా మరింత దిగజారింది. కానీ తల్లి తోడ్పాటుతో త్వరలోనే కోలుకుంది. తనలా డిప్రెషన్‌కు గురై, జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి జీవితాల్లో వెలుగు పూలు పూయించాలని కంకణం కట్టుకుంది. ఇందుకు ఆమె ఎంచుకున్న మార్గం దేశాన్ని చుట్టిరావడం...అదీ మోటార్ సైకిల్‌పై. మొత్తం 83 నగరాలను చుట్టి రావడం ఆమె లక్ష్యం. వెళ్లిన ప్రతి చోటా యూనివర్శిటీలు, కాలేజీల్లో సెమినార్లు నిర్వహించడం, యువతను కుంగుబాటుకు, సూసైడ్ టెండెన్సీకి దూరంగా ఉంచడం ఆమె ధ్యేయం. ఇప్పటికే సగానికి పైగా ఊళ్లను చుట్టేసిన సనా, జూన్ 12న హైదరాబాద్ చేరుకోబోతోంది.
మోటార్‌సైకిల్‌పై వెడుతున్నప్పుడు తనను చూసి చేతులూపేవారు, తనను ఎంకరేజ్ చేస్తూ బొటనవేలు పైకెత్తి చూపించేవారే తన సాహసయాత్రకు ఊపిరులూదుతున్నారని వినయంగా చెప్పే సనాకు సూరత్‌లో అపూర్వ ఆదరణ లభించిందట. ఆమె లక్ష్యాన్ని అర్థం చేసుకున్న అక్కడి ప్రజలు ఏకంగా ఆమెను తమ ఇళ్లకు తీసుకువెళ్లి అతిథి సత్కారాలు చేయడం మరచిపోలేనంటుంది. యువతనుంచి కుంగుబాటును దూరం చేయగలిగితే చాలు...వారు విజయశిఖరాలను అధిరోహించగలుగుతారంటుంది సనా.
*