పశ్చిమగోదావరి

ఆరుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, జూన్ 2: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోటారు సైకిళ్లు తదితర దొంగతనాలకు, మహిళల మెడల్లో గొలుసుల చోరీకి పాల్పడిన, చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తులను పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుండి రూ.16 లక్షల విలువైన 34 మోటారు సైకిళ్లు, బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో పట్టణ డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన ఎం దినేష్, జి సతీష్‌కుమార్, వి కిషోర్‌కుమార్, ఇ సూరిబాబు, రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరుకు చెందిన ఆర్ శ్రీనివాస్ అనే అయిదుగురితోపాటు చోరీ సొత్తు, మోటారు సైకిళ్లను కొనుగోలు చేసిన కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన ఎం చిట్టి వీరన్నను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల నుండి రూ.13 లక్షల విలువైన 34 మోటారు సైకిళ్లు, రూ.15 వేల విలువైన 403 గ్రాముల వెండి వస్తువులు, రూ.2.8 లక్షల విలువైన 113 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణ సిఐ పి ప్రసాదరావు, ఎస్‌ఐ ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, సిసి ఎస్‌ఐలు కెవి రమణ, బి సింగ్, ఎఎస్‌ఐ ఎస్ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ టిఎన్‌వి శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, పిసిలు డి ప్రసాదబాబు, పిసిలు పి శ్రీనివాస్, కె జయరాం, ఎం వినయ్‌కుమార్ టీమ్‌గా ఏర్పడి ఈ కేసును ఛేదించినట్టు ఆయన వివరించారు. బైక్ పోగొట్టుకున్న బాధితులు కొవ్వూరు పట్టణ పోలీసులను సంప్రదించాలని డిఎస్పీ కోరారు.