నిజామాబాద్

ఎస్పీ ఆదేశాలతో అధికారుల్లో దడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూన్ 3:విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు..ప్రతిరోజు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి...ఆటోవాలాల ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలి అంటూ విధులలో చేరిన రెండవ రోజునే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో మునుముందు ఎటువంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఆందోళన క్షేత్ర స్థాయి అధికారులలో మొదలయ్యింది. ఇందుకోసం ఠాణాల వారీగా అధికారులు నిర్లక్ష్యం బయట పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు అధికారులు పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో నిమగ్నమయ్యారు. డివిజన్ కేంద్రమైన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్‌హెచ్‌వో ఠాణాలో మారిన పరిస్థితులే ఇందుకు అద్ధం పడుతున్నాయి. ఇక్కడ విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆటోవాలాల ఆగడాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ 95శాతం ఆటోల సైట్ సీటర్లు తొలగించారు. సైడ్ సీట్లు ఉంచి ప్రయాణీకులను తీసుకెళితే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిసి గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటో డ్రైవర్లు సీట్లను తొలగించి పరిమిత సంఖ్యలోనే ప్రయాణీకులను తీసుకెళుతున్నారు. ఇదిలా ఉండగా బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకన్న గత మూడు రోజులుగా పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం విస్త్రుతంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న కొన్ని పుట్‌పాత్ దుకాణాలు తొలగించడమే కాకుండా ట్రాఫిక్ సమస్య సృష్టిస్తున్న వ్యాపారస్థులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రతిరోజు ఈ పోలీసు స్టేషన్‌లో 30కి పైగా ఎంవి యాక్టు కేసులు నమోదవుతున్నాయి.
ఇదిలా ఉండగా సమస్యాత్మక ప్రాంతంగా ముద్ర పడిన బోధన్‌లో ఐదారు రోజులుగా న్యూసెన్స్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం సేవించి గొడవ చేయడం, అతివేగంతో వాహనాలు నడిపించడం, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గ్రామాలలో పేకాట కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. మొన్నటి వరకు పదిన్నర వరకు ఠాణాలో ఎస్సైలు కనిపించేవారు కాదు. కానీ నేడు తొమ్మిదిన్నర గంటలకే ఎస్సైలు ఠాణాలకు చేరుకుని విధులలో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులలో ఒకరిపై స్పెషల్ బ్రాంచ్ ఎంక్వయిరీ జరుగుతుందని తెలియడంతో ఇతర క్రిందిస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో చిత్తశుద్దిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చారని ఇక నుండి ఎవ్వరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని ఠాణా అధికారులు ఆయి సెక్షన్‌లలో విధులు నిర్వహించే ద్వితీయ శ్రేణి అధికారులకు, క్రిందిస్థాయి సిబ్బందికి తెలియచేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఠాణాల తనిఖీలు మొదలు పెట్టలేక పోయారు. ఎప్పుడు ఏ ఠాణాను తనిఖీ చేస్తారోనని భావిస్తూ అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు బోధన్ పోలీసు స్టేషన్‌ను డిఎస్పీ, ఎస్పీలు శాఖాపరంగా తనిఖీలు చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు శాఖాపరమైన తనిఖీలు జరుగక పోవడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారి పోలీసు స్టేషన్‌ను ఎప్పుడైనా చేసే అవకాశం ఉందని తెలిసి అధికారులు కేసులకు సంబంధించిన అన్ని ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ఠాణా ముందున్నటువంటి రేకుల షెడ్డు కూలిపోయి ఎస్‌హెచ్‌వో వాహనం దెబ్బతినగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాహనానికి మరమ్మతులు చేయించడంతో పాటు ఠాణా ముందు కుప్పకూలిన షెడ్డు స్థానంలో నూతన షెడ్డును ఏర్పాటు చేసారు. పట్టణంలో జరుగుతున్న విస్త్రుత పెట్రోలింగ్, న్యూసెన్స్, ఎంవి యాక్టు కేసులు, ఆటోల సైడ్ సీట్లు, పుట్‌పాత్ దుకాణాల తొలగింపు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.