నిజామాబాద్

ఏడు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూన్ 3:కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుండటంతో కొత్త మండలాలతో పాటు కొత్తగా రెవెన్యూ డివిజన్‌లు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు మండలాలతో కొనసాగుతున్న బోధన్ డివిజన్ ఏడు లేదా ఎనిమిది మండలాలకే పరిమితం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలాలు గనుక పెరిగితే కొత్తగా బాన్సువాడ కూడా డివిజన్‌గా ఏర్పాటయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోధన్ డివిజన్‌ను బాన్సువాడకు మారుస్తారని కొంతకాలం నుండి ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే. అంతేకాకుండా బోధన్ నుండి రెవెన్యూ డివిజన్‌ను బాన్సువాడకు తరలించవద్దని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టాయి. కానీ అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. అధికారులు కొత్త మండలాల కోసం చేస్తున్న కసరత్తులు, రూపొందిస్తున్న ప్రతిపాదనలు చూస్తుంటే బోధన్ నుండి బాన్సువాడకు డివిజన్‌ను మారుస్తారనేది ఏ కోశాన కూడా కనిపించడం లేదు. ఈ డివిజన్‌లో ఉన్నటువంటి పనె్నండు మండలాలకు గాను ఏడు మండలాలు ఇందులోనే కొనసాగినట్లయితే ఈ డివిజన్ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ డివిజన్‌లో ప్రస్తుతం నవీపేట్‌ను బోధన్ రెవెన్యూ డివిజన్‌లో చేర్చడంతో మండలాల సంఖ్య పదమూడుకు చేరుకుంది. తాజాగా వర్ని మండలంలోని రుద్రూర్ మండలంగా ఏర్పడనుంది. అలాగే బోధన్ అర్బన్‌ను, రూరల్‌ను వేరు చేసి రూరల్ కోసం కొత్తగా తహశీల్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడాన్ని పరిశీలిస్తే ఈ డివిజన్‌లో కొత్త తహశీల్ కార్యాలయాలు, కొత్త మండలాల ఏర్పాటు తర్వాత మొత్తం పదిహేను మండలాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన బోధన్ డివిజన్‌లో ఎనిమిది మండలాలు, కొత్తగా బాన్సువాడ డివిజన్ గనుక ఏర్పాటైతే అందులో మరో ఏడు మండలాలు చేర్చే అవకాశం ఉంది. గత వారం రోజులుగా ఇక్కడి రెవెన్యూ అధికారులు ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త మండలాల కోసం అన్ని కోణాల నుండి ఆలోచనలు జరుపుతు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు, వీటి ప్రకారం కొత్త మండలాలు, కొత్త తహశీల్ కార్యాలయాలు గనుక ఏర్పాటైతే బోధన్ డివిజన్ యదావిధంగా కొనసాగడమే కాకుండా కొత్తగా బాన్సువాడ డివిజన్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అధికారుల అంచనాల ప్రకారం ఇదే గనుక జరిగినట్లయితే ఎక్కడా రాజకీయ ఆందోళనలు కొనసాగే అవకాశాలు ఉండవు.
1956 నుండి బోధన్ డివిజన్‌గా కొనసాగుతూ వస్తోంది. ఈ రెవెన్యూ డివిజన్‌ను బాన్సువాడకు తరలించడం కూడా అంత సునాయమేమి కాదని కొత్త మండలాలు, కొత్త డివిజన్‌ల ఏర్పాటు వలన కొన్ని మండలాలు మాత్రం ఈ డివిజన్ నుండి ఇతర డివిజన్‌లో చేర్చే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుండి ఈ బోధన్ డివిజన్ బాన్సువాడకు తరలిపోనుందని విస్త్రుత ప్రచారం జరుగుతుండటంతో పట్టణ ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు సైతం అయోమయ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. కొందరు ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్‌ను అంచనా వేస్తు ఇప్పటి నుండియే ఆందోళన చెందుతున్నారు. కానీ అధికారులు సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలు పరిశీలిస్తే ఈ డివిజన్ ఇక్కడే యదావిధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.