రంగారెడ్డి

ప్రతి పాఠశాలలో 5 శాతం ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి: కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, జూన్ 3: మానవ వనరుల అభివృద్ధి శీర్షికలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచే దిశలో ప్రతి పాఠశాలలో 5 శాతం ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి చేసే విధంగా జిల్లా కల్టెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలతో బడిబాట కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతి మండలంలో చేపట్టే విధి విధానాలపై సూచనలను ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో తక్కువగా ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది 317 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను మొదలు పెడుతున్నట్లు దీనికిగాను 835 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మొదటి దశలో మంజూరు చేసినటువంటి 19 మోడల్ స్కూళ్లలో 14 పాఠశాలలను ప్రారంభించినట్లు అదేవిధంగా మిగతా వాటిలో మూడింటిని కూడా ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
బడిబాట కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాలో ఉన్న స్వచ్చంధ సంస్థలను భాగస్వాములను చేసి పూర్తి ఎన్‌రోల్‌మెంట్‌కు కృషి చేస్తామని వివరించారు. ఈనెల 13న జిల్లా వ్యాప్తంగా సామూహిక అక్షరభ్యాస కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అదే రోజున విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ అందించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలల్లోని వసతులను పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు ఆయన తెలిపారు. వౌలిక వసతులల్లో భాగంగా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ప్రహారీగోడ నిర్మాణం, విద్యుత్తు సరఫరా, వంట గది ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ కొరత ఉన్న పాఠశాలల్లో విద్యావాలంటీర్లను నియమించుకుంటామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, డిఇఒ రమేష్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.