రంగారెడ్డి

ప్రతి నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, జూన్ 3: ప్రతి నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొల్తూరు, తుర్కపల్లి గ్రామ శివారులోని జీనోమ్ వ్యాలీ పరిసర ప్రాంతంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాన్ని నాయిని నర్సింహ్మరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల జరిగే నష్టం అంచనా వేయలేమని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రానున్న కాలంలో మేడ్చల్, కీసర, ఎల్‌బినగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కూడా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ హోంశాఖకు ఎన్నో నిధులను మంజూరు చేస్తున్నారని అందువల్లే దేశంలోనే పోలీసు శాఖ ఉన్నతమైన సేవలందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుందని తెలిపారు. గతంలో పాలించిన పాలకులు పోలీసుస్టేషన్ల ఆధునీకరణ, ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన, అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు విషయంలో విస్మరించారని కెసిఆర్ అలా కాకుండా వినూత్న ఆలోచనలో ముందుకు వెళ్తూ ప్రజలకు అన్ని సౌకర్యాలను దశలవారీగా అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి శామీర్‌పేట మండల ప్రజలు ఎదురుచూస్తున్న చిరకాల కోరిక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు నేటితో ముగిసిందని అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో సేవలందించేందుకు ముందుండాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, ఎంపిపి చంద్రశేఖర్‌యాదవ్, సర్పంచ్ రాణి, ఎంపిటిసి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కల సాకారం అయిన వేళ
ఎన్నో సంవత్సరాల నుండి మండలానికి అగ్నిమాపక కేంద్రం కావాలని అనేక మార్లు ఆంధ్రభూమి పత్రికలో వార్తలు ప్రచురితమైన విషయం విధితమే. కాగా మండలంలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, బిట్స్‌పిలానీ, భాగ్యనగర్ గ్యాస్ సరఫరా కేంద్రం (సిఎన్‌జి గ్యాస్), ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్, జీనోమ్ వ్యాలీ, అనేక ఫార్మా కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వివిధ కార్పొరేట్ కాలేజీలు ఈమండలం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు అయ్యాయి. కానీ వీటిని అగ్ని ప్రమాదాల నుండి రక్షించేందుకు ఏ ఒక్క అగ్నిమాపక కేంద్రం లేదు. ఒక వేళ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలోనున్న నగరంలోని అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి రప్పించే సరికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ విషయాన్ని అనేకమార్లు గత ప్రభుత్వాలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్ ప్రత్యేక చొరవతో మండలానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కావడం ఎంతో హర్షించ దగ్గ విషయమని ప్రజలంటున్నారు.